RRR 18 Days Collections: కలెక్షన్స్ లో భారీ డ్రాప్.. ఆ విషయంలో బహుబలిని కొట్టలేకపోయిందిగా!
'బాహుబలి' లాంటి అద్భుతమైన విజువల్ వండర్ సినిమా చేసి తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం RRR. భారీ బడ్జెట్ తో తెలుగులో మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. ఇక భారీ అంచనాలతో మార్చి 25న విడుదలైన ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక RRR మూవీ 18 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంత వసూలు చేసిందో మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం.

భారీ అంచనాలు
నందమూరి వంశానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన సినిమా RRR (రౌద్రం రణం రుధిరం). రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటించిన ఈ సినిమా రామ్ చరణ్ సరసన అలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ జంటగా నటించారు.
ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించగా ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇక అజయ్ దేవగన్, శ్రేయ, సముద్రఖని కీలక పాత్రలను పోషించారు. జక్కన్న దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో స్టార్ హీరోల కాంబోలో రూపొందిన RRR మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

కోటి లోపు కలెక్షన్స్
అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు తెలుగు రాష్ట్రాలతో పాటు దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లో కూడా భారీ రేటు పలికింది. ఇలా అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్ల బిజినెస్ జరిగింది. ఏపీ, తెలంగాణలో 18వ రోజు RRRకు కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపించింది. ఇప్పటిదాకా లేని విధంగా మొదటి సారి తెలుగులో కోటి లోపు కలెక్షన్స్ వచ్చాయి.

18వ రోజు RRR కలెక్షన్స్
సోమవారం నాడు నైజాంలో రూ. 25 లక్షలు, సీడెడ్‌లో రూ. 16 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.12 లక్షలు, ఈస్ట్‌లో రూ. 8 లక్షలు, వెస్ట్‌లో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో.. సోమవారం రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 80 లక్షల షేర్, రూ. 1.30 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. 18 రోజుల్లోనే ఏపీ తెలంగాణలో RRR మూవీకి రూ. 259.13 కోట్లు షేర్ వచ్చింది.
అలాగే, కర్ణాటక రూ. 41.90 కోట్లు, తమిళనాడులో రూ. 36.95 కోట్లు, కేరళలో రూ. 10.22 కోట్లు, హిందీలో రూ. 116.45 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 95.30 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా 17 రోజుల్లోనే రూ. 568.60 కోట్లు షేర్, రూ. 1039.50 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

తెలుగు కంటే ఎక్కువ హిందీ
అయితే 18వ రోజు తెలుగు కంటే ఎక్కువ హిందీ వసూళ్లు రావడం విశేషం. భారీ మల్టీస్టారర్‌గా రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 18 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 568.60 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 115.60 కోట్ల లాభాలను సొంతం చేసుకుంది.

బాహుబలిని కొట్టలేక
అయితే వరుసగా కోటి రూపాయల పైన వసూళ్లు చేసిన సినిమాల జాబితాలో RRR మూవీ మూడో సినిమాగా నిలిచింది. ఇప్పటిదాకా బాహుబలి 2 28 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో కోటి పైన వసూళ్లు చేయగా, బాహుబలి 20 రోజుల పాటు వసూళ్లు చేసింది. కానీ ఈ RRR మూవీ 17 రోజులకే ఈ కోటి వసూళ్లలో డ్రాప్ కనిపించింది.
ఆ లెక్కన ఈ సినిమా బాహుబలి 2ని ఆ విషయంలో క్రాస్ చేయలేక పోయింది. ఇక కేజిఎఫ్ 2 సినిమా కూడా బరిలోకి దిగనుండడంతో భారీ ఎత్తున థియేటర్ బదిలీలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈ సినిమా కలెక్షన్స్ లో భారీ డ్రాప్స్ కనిపించే అవకాశం కనిపిస్తోంది. చూడాలి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











