RRR 19 Days Collections: 19వ రోజు భారీ దెబ్బ.. తొలిసారి ఇంత తక్కువ.. 453 కోట్లకు అమ్మితే లాభమే అంత!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో రకాల సినిమాలు వస్తుంటాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. అలా రూపొందిన సినిమాల్లో RRR (రౌద్రం రణం రుధిరం) ఒకటి. దీనికి కారణం ఈ సినిమాను 'బాహుబలి' వంటి సూపర్ డూపర్ హిట్ సిరీస్‌తో తన స్టామినాను, తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి పరిచయం చేసిన టాప్ డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించడమే.

అంతేకాదు, ఇందులో ఇద్దరు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించడంతో ఈ మూవీ రేంజ్ మరింతగా పెరిగిపోయింది. అందుకు అనుగుణంగానే దీనికి ఆరంభం నుంచే కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో RRR మూవీ 19 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

 స్టార్ హీరోలతో రాజమౌళి మ్యాజిక్

స్టార్ హీరోలతో రాజమౌళి మ్యాజిక్

స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో రాజమౌళి తెరకెక్కించిన సినిమానే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ మల్టీస్టారర్ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలను చేశారు.

 అత్యధిక ప్రీ బిజినెస్‌తో రికార్డులు

అత్యధిక ప్రీ బిజినెస్‌తో రికార్డులు

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన RRR మూవీపై ఎన్నో అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇలా అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్ల బిజినెస్ జరిగిన విషయం తెలిసిందే.

19వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

19వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

19వ రోజు ఏపీ, తెలంగాణలో RRRకు కలెక్షన్లు భారీగా తగ్గాయి. దీంతో నైజాంలో రూ. 19 లక్షలు, సీడెడ్‌లో రూ. 12 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 9 లక్షలు, ఈస్ట్‌లో రూ. 7 లక్షలు, వెస్ట్‌లో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో.. 19వ రోజైన మంగళవారం రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 64 లక్షలు షేర్, రూ. 1 కోటి గ్రాస్‌‌ను రాబట్టింది.

 19 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు

19 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు

RRR మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 19 రోజుల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 108.03 కోట్లు, సీడెడ్‌లో రూ. 49.28 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 33.69 కోట్లు, ఈస్ట్‌లో రూ. 15.49 కోట్లు, వెస్ట్‌లో రూ. 12.73 కోట్లు, గుంటూరులో రూ. 17.53 కోట్లు, కృష్ణాలో రూ. 14.09 కోట్లు, నెల్లూరులో రూ. 8.93 కోట్లతో కలిపి రూ. 259.77 కోట్లు షేర్, రూ. 391.65 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

19 రోజుల్లోనే ఏపీ తెలంగాణలో RRR మూవీకి రూ. 259.77 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 42.05 కోట్లు, తమిళనాడులో రూ. 37.05 కోట్లు, కేరళలో రూ. 10.24 కోట్లు, హిందీలో రూ. 117.75 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 95.55 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 19 రోజుల్లోనే రూ. 571.11 కోట్లు షేర్‌, రూ. 1046.10 కోట్లు గ్రాస్‌ వసూలు చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

ఎన్టీఆర్, చరణ్ కలయికలో రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 19 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 571.11 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 118.11 కోట్ల లాభాలను సొంతం చేసుకుంది.

19 రోజుల్లో ఇదే తక్కువ మొత్తం

19 రోజుల్లో ఇదే తక్కువ మొత్తం

RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి 19వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 64 లక్షలు షేర్ మాత్రమే వసూలు చేసింది. ఫలితంగా ఈ సినిమా విడుదలైన తర్వాత తక్కువ వసూళ్లు చేసినట్లైంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా 19వ రోజు ఈ సినిమా రూ. 2.66 కోట్లు షేర్ రాబట్టింది. ఇది కూడా ఈ సినిమా రన్‌లో చాలా తక్కువ వసూళ్లు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X