RRR 2 Weeks Collections: 2 వారాల్లో షాకింగ్ కలెక్షన్లు.. లాభమే అన్ని కోట్లా.. మరో సంచలన రికార్డు

పేరుకు తెలుగు సినిమానే అయినా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను ఆకర్షించింది RRR (రౌద్రం రణం రుధిరం). దీనికి కారణం ఈ చిత్రాన్ని దేశమే మెచ్చిన దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడమే. అంతేకాదు, ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించడంతో దీని రేంజ్ మరింతగా పెరిగిపోయింది.

ఫలితంగా ఈ సినిమా ఆరంభంలోనే భారీ బజ్‌ను ఏర్పరచుకుంది. అందుకు అనుగుణంగానే అత్యధిక థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక, దీనికి ఆడియెన్స్ భారీ స్పందనను అందించారు. ఫలితంగా సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో RRR మూవీ రెండు వారాల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

 స్టార్ హీరోలను కలిపిన రాజమౌళి

స్టార్ హీరోలను కలిపిన రాజమౌళి

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ మల్టీస్టారర్ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో చరణ్.. అల్లూరిగా, తారక్.. కొమరం భీంగా చేశారు.

 అత్యధిక ప్రీ బిజినెస్‌తో రికార్డులు

అత్యధిక ప్రీ బిజినెస్‌తో రికార్డులు

పిరియాడిక్ నేపథ్యంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR మూవీపై ఎన్నో అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇలా అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్ల బిజినెస్ అయింది.

14వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

14వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

RRRకు ఏపీ, తెలంగాణలో 14వ రోజు కలెక్షన్లు తగ్గాయి. దీంతో నైజాంలో రూ. 69 లక్షలు, సీడెడ్‌లో రూ. 35 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 27 లక్షలు, ఈస్ట్‌లో రూ. 17 లక్షలు, వెస్ట్‌లో రూ. 12 లక్షలు, గుంటూరులో రూ. 10 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలతో.. 14వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 1.86 కోట్లు షేర్, రూ. 3 కోట్లు గ్రాస్‌‌ను మాత్రమే రాబట్టింది.

2 వారాల తెలుగు రాష్ట్రాల రిపోర్టు

2 వారాల తెలుగు రాష్ట్రాల రిపోర్టు

RRR మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 2 వారాల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 103.15 కోట్లు, సీడెడ్‌లో రూ. 47.41 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 32.20 కోట్లు, ఈస్ట్‌లో రూ. 14.71 కోట్లు, వెస్ట్‌లో రూ. 12.24 కోట్లు, గుంటూరులో రూ. 16.98 కోట్లు, కృష్ణాలో రూ. 13.58 కోట్లు, నెల్లూరులో రూ. 8.49 కోట్లతో కలిపి రూ. 248.76 కోట్లు షేర్, రూ. 374 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

2 వారాల్లోనే ఏపీ తెలంగాణలో RRR మూవీకి రూ. 248.76 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 39.80 కోట్లు, తమిళనాడులో రూ. 35.40 కోట్లు, కేరళలో రూ. 9.90 కోట్లు, హిందీలో రూ. 102.10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 8 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 91.25 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 14 రోజుల్లోనే రూ. 535.21 కోట్లు షేర్‌, రూ. 967 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

Recommended Video

RRR Movie నాలుగో రోజూ రికార్డ్ కలెక్షన్స్.. సోమవారం సెంటిమెంట్ బ్రేక్ | Filmibeat Telugu
బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

స్టార్ హీరోల కాంబోలో రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 2 వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 535.21 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 82.21 కోట్ల లాభాలను సొంతం చేసుకుంది.

రెండో వారంలో అన్ని కోట్లతో రికార్డ్

రెండో వారంలో అన్ని కోట్లతో రికార్డ్

RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి మొదటి వారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 187.65 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, రెండో వారంలో రూ. 61.11 కోట్లు షేర్ దక్కింది. దీంతో రెండో వారంలోనూ ఎక్కువ వసూలు చేసిన చిత్రంగా ఇది రికార్డు నెలకొల్పింది. అంతకు ముందే ఈ ఘనత బాహుబలి 2 పేరిట ఉండేది. ఆ చిత్రం రెండో వారంలో రూ. 40.28 కోట్లు వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X