RRR 20 Days Collections: 20వ రోజు భారీ షాక్.. సగానికి సగం డౌన్.. ఇక, ఆ రికార్డులు కష్టమే!
గతంతో పోల్చుకుని చూస్తే ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ మూవీల హవా భారీ స్థాయిలో కనిపిస్తోంది. ప్రేక్షకుల అభిరుచిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా దర్శక నిర్మాతలు ఈ తరహా సినిమాలు చేస్తున్నారు. దీనికి హీరోల మద్దతు కూడా దక్కడంతో ఎక్కువగా అలాంటి మూవీలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికలో వచ్చిన బిగ్గెస్ట్ మల్టీస్టారరే RRR (రౌద్రం రణం రుధిరం).
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలై.. అందుకు అనుగుణంగానే కలెక్షన్లను రాబట్టింది. ఫలితంగా సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో అసలు RRR మూవీ 20 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంత వసూలు చేసింది అనే వివరాలు చూద్దాం పదండి!

ఇద్దరు హీరోలను కలిపిన జక్కన్న
బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మించారు. ఈ మల్టీస్టారర్ మూవీకి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అలాగే, చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలు పోషించారు.

అత్యధిక ప్రీ బిజినెస్‌తో రికార్డులు
భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR మూవీపై ఎన్నో అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇలా అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగింది.

20వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
20వ రోజు ఏపీ, తెలంగాణలో RRRకు కలెక్షన్లు భారీగా పడిపోయాయి. దీంతో నైజాంలో రూ. 11 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్‌లో రూ. 3 లక్షలు, వెస్ట్‌లో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. 20వ రోజైన బుధవారం రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 34 లక్షలు షేర్, రూ. 50 లక్షలు గ్రాస్‌ను రాబట్టింది.

20 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు
RRR మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 20 రోజుల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 108.14 కోట్లు, సీడెడ్‌లో రూ. 49.34 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 33.73 కోట్లు, ఈస్ట్‌లో రూ. 15.52 కోట్లు, వెస్ట్‌లో రూ. 12.75 కోట్లు, గుంటూరులో రూ. 17.56 కోట్లు, కృష్ణాలో రూ. 14.12 కోట్లు, నెల్లూరులో రూ. 8.95 కోట్లతో కలిపి రూ. 260.11 కోట్లు షేర్, రూ. 392.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
20 రోజుల్లోనే ఏపీ తెలంగాణలో RRR మూవీకి రూ. 260.11 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 42.15 కోట్లు, తమిళనాడులో రూ. 37.10 కోట్లు, కేరళలో రూ. 10.25 కోట్లు, హిందీలో రూ. 118.35 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.72 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 95.80 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 20 రోజుల్లోనే రూ. 572.48 కోట్లు షేర్, రూ. 1049 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?
భారీ మల్టీస్టారర్‌గా రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 20 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 572.48 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 119.48 కోట్ల లాభాలను సొంతం చేసుకుంది.
Recommended Video


20 రోజుల్లో చాలా తక్కువ వసూళ్లు
RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి 20వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 34 లక్షలు షేర్ మాత్రమే వసూలు చేసింది. ఫలితంగా ఈ సినిమా విడుదలైన తర్వాత చాలా తక్కువ నెంబర్లను రాబట్టినట్లైంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా 20వ రోజు ఈ సినిమా రూ. 2 కోట్లు లోపే షేర్‌ను రాబట్టింది. ఈ రెండు రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు మరింతగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











