RRR 22 Days Collections: మళ్లీ పెరిగిన వసూళ్లు.. 22వ రోజు ఏకంగా అన్ని కోట్లు.. మరో 5 కోట్లు వస్తే!
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ప్రభాస్ హీరోగా ఆయన తెరకెక్కించిన 'బాహుబలి' ఇండియన్ బాక్సాఫీస్‌పై ఏ రేంజ్‌లో హవాను చూపించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతటి భారీ విజయం తర్వాత జక్కన్న తీసిన మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). టాలీవుడ్‌నే ఏలుతోన్న ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించడంతో ఈ మూవీ రేంజ్ మరింతగా పెరిగిపోయింది. దీంతో భారీ అంచనాలతో ఈ చిత్రం మూడు వారాల క్రితమే విడుదలైంది. ఆరంభం నుంచే భారీ స్పందనతో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో RRR మూవీ 22 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంత వసూలు చేసిందన్న దానిపై ఓ లుక్కేద్దాం పదండి!

రియల్ హీరోలుగా మారిన స్టార్లు
అల్లూరి సీతారామరాజు, కొమరం భీం కథల ఆధారంగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన ఈ మూవీని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ మల్టీస్టారర్ మూవీకి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు.

అత్యధిక ప్రీ బిజినెస్‌తో రికార్డులు
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన RRR మూవీపై ఎన్నో అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇలా అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది.

22వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
22వ రోజు ఏపీ, తెలంగాణలో RRRకు కలెక్షన్లు మళ్లీ పెరిగాయి. దీంతో నైజాంలో రూ. 38 లక్షలు, సీడెడ్‌లో రూ. 15 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 9 లక్షలు, ఈస్ట్‌లో రూ. 6 లక్షలు, వెస్ట్‌లో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో.. 22వ రోజైన శుక్రవారం రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 84 లక్షలు షేర్, రూ. 1.35 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

22 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు
RRR మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 22 రోజుల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 108.93 కోట్లు, సీడెడ్‌లో రూ. 49.67 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 33.92 కోట్లు, ఈస్ట్‌లో రూ. 15.66 కోట్లు, వెస్ట్‌లో రూ. 12.84 కోట్లు, గుంటూరులో రూ. 17.66 కోట్లు, కృష్ణాలో రూ. 14.21 కోట్లు, నెల్లూరులో రూ. 9.02 కోట్లతో కలిపి రూ. 261.91 కోట్లు షేర్, రూ. 395 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
22 రోజుల్లోనే ఏపీ తెలంగాణలో RRR మూవీకి రూ. 261.91 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 42.42 కోట్లు, తమిళనాడులో రూ. 37.26 కోట్లు, కేరళలో రూ. 10.28 కోట్లు, హిందీలో రూ. 121.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.80 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 96.65 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 22 రోజుల్లోనే రూ. 578.82 కోట్లు షేర్, రూ. 1063.70 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?
ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 22 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 578.82 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 128.82 కోట్ల లాభాలను సొంతం చేసుకుంది.

మరో 5 కోట్లు వసూలు చేసే చరిత్రే
RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి 22 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 395 కోట్ల గ్రాస్ వసూలు అయింది. అంటే మరో 5 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తే ఈ సినిమా రూ. 400 కోట్ల క్లబ్‌లో చేరిపోతుంది. ఇదే జరిగితే వేగంగా ఈ ఘనతను అందుకున్న చిత్రం RRR రికార్డు క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇది ఈ వీకెండ్‌లోనే జరిగే అవకాశం ఉందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











