RRR 23 Days Collections: శనివారం షాకింగ్ కలెక్షన్లు.. 23 రోజుల్లో భారీగా.. లాభం ఎన్ని కోట్లంటే!
గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ చిత్రాలు రూపొందుతోన్నాయి. దీనికి కారణం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' విజయమే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీతో టాలీవుడ్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో పాన్ ఇండియా సినిమాలు వరుసగా వస్తున్నాయి. ఇలా ఇటీవల విడుదలైన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం).
భారీ మల్టీస్టారర్‌గా వచ్చిన ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. దీంతో ఈ మూవీ రేంజ్ మరింతగా పెరిగిపోయింది. ఇక, ఈ సినిమా ఆరంభం నుంచే అత్యధిక కలెక్షన్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో RRR మూవీ 23 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

విప్లవ వీరుల కథతో వచ్చిన మూవీ
విప్లవ వీరులుఅల్లూరి సీతారామరాజు, కొమరం భీం కథల ఆధారంగా రాజమౌళి తీసిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా చేసిన ఈ మూవీని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ మల్టీస్టారర్ మూవీకి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు.

అత్యధిక ప్రీ బిజినెస్‌తో రికార్డులు
భారీ బడ్జెట్‌తో రూపొందిన RRR మూవీపై ఎన్నో అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇలా అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల టాక్.

23వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
ఏపీ, తెలంగాణలో RRRకు 23వ రోజు కలెక్షన్లు మళ్లీ తగ్గాయి. దీంతో నైజాంలో రూ. 31 లక్షలు, సీడెడ్‌లో రూ. 12 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్‌లో రూ. 5 లక్షలు, వెస్ట్‌లో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. 23వ రోజైన శనివారం రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 67 లక్షలు షేర్, రూ. 1.05 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

23 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు
RRR మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 23 రోజుల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 109.24 కోట్లు, సీడెడ్‌లో రూ. 49.79 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 34 కోట్లు, ఈస్ట్‌లో రూ. 15.71 కోట్లు, వెస్ట్‌లో రూ. 12.87 కోట్లు, గుంటూరులో రూ. 17.69 కోట్లు, కృష్ణాలో రూ. 14.24 కోట్లు, నెల్లూరులో రూ. 9.04 కోట్లతో కలిపి రూ. 262.58 కోట్లు షేర్, రూ. 396.05 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
23 రోజుల్లోనే ఏపీ తెలంగాణలో RRR మూవీకి రూ. 262.58 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 42.50 కోట్లు, తమిళనాడులో రూ. 37.31 కోట్లు, కేరళలో రూ. 10.30 కోట్లు, హిందీలో రూ. 123 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.85 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 97.15 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 23 రోజుల్లోనే రూ. 581.69 కోట్లు షేర్, రూ. 1071 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 23 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 581.69 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 128.69 కోట్ల లాభాలను సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











