twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR 26 Days Collections: మరోసారి భారీ షాక్.. రిలీజ్ తర్వాత తొలిసారి.. ఇంకో 10 కోట్లు వస్తే రికార్డు

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో రూపొందినా ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). దీనికి కారణం ఈ సినిమాను దేశమే మెచ్చిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించడంతో పాటు ఇందులో ఇద్దరు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించడమే. దీంతో ఈ మూవీ రేంజ్ తారాస్థాయిలో పెరిగిపోయింది. అందుకు అనుగుణంగానే ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది. ఫలితంగా దీనికి ఆరంభం నుంచే మంచి స్పందనతో పాటు కలెక్షన్లు పోటెత్తాయి. దీంతో రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోందీ మూవీ. ఈ నేపథ్యంలో అసలు RRR మూవీ 26 రోజుల్లో ఎంత వసూలు చేసింది? ఇప్పటి వరకూ దీనికి లాభం ఎంతొచ్చింది? అనే విషయాలు చూద్దాం పదండి!

    ఇద్దరు స్టార్లను కలిపిన రాజమౌళి

    ఇద్దరు స్టార్లను కలిపిన రాజమౌళి

    స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తీసిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). ఈ మూవీని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. ఇందులో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలు పోషించారు.

    చరణ్ హీరోయిన్ ఎద అందాల ఆరబోత: బ్లౌజ్ ఉన్నా లేనట్లే మరీ ఘోరంగా!చరణ్ హీరోయిన్ ఎద అందాల ఆరబోత: బ్లౌజ్ ఉన్నా లేనట్లే మరీ ఘోరంగా!

    అత్యధిక ప్రీ బిజినెస్‌తో రికార్డులు

    అత్యధిక ప్రీ బిజినెస్‌తో రికార్డులు

    బడా హీరోల కాంబోలో రూపొందిన RRR మూవీపై ఎన్నో అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇలా అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్లు మేర బిజినెస్ అయింది.

    26వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    26వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    ఏపీ, తెలంగాణలో RRRకు 26వ రోజు కలెక్షన్లు తగ్గాయి. దీంతో నైజాంలో రూ. 11 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. 26 రోజైన మంగళవారం రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 30 లక్షలు షేర్, రూ. 50 లక్షలు గ్రాస్‌‌ను రాబట్టింది.

    Samantha: సమంత బాడీపై చైతూ గుర్తు.. నెటిజన్ ఊహించని ప్రశ్న.. మీరు కూడా ఆ తప్పు చేయొద్దంటూ!Samantha: సమంత బాడీపై చైతూ గుర్తు.. నెటిజన్ ఊహించని ప్రశ్న.. మీరు కూడా ఆ తప్పు చేయొద్దంటూ!

    26 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు

    26 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు

    RRR మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 26 రోజుల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 109.94 కోట్లు, సీడెడ్‌లో రూ. 50.17 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 34.29 కోట్లు, ఈస్ట్‌లో రూ. 15.85 కోట్లు, వెస్ట్‌లో రూ. 12.97 కోట్లు, గుంటూరులో రూ. 17.81 కోట్లు, కృష్ణాలో రూ. 14.35 కోట్లు, నెల్లూరులో రూ. 9.12 కోట్లతో కలిపి రూ. 264.20 కోట్లు షేర్, రూ. 398.75 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    26 రోజుల్లోనే ఏపీ తెలంగాణలో RRR మూవీకి రూ. 264.20 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 42.88 కోట్లు, తమిళనాడులో రూ. 37.60 కోట్లు, కేరళలో రూ. 10.37 కోట్లు, హిందీలో రూ. 127 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 9.05 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 98.65 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 26 రోజుల్లోనే రూ. 590.05 కోట్లు షేర్‌, రూ. 1091.90 కోట్లు గ్రాస్‌ వసూలు చేసింది.

    మళ్లీ రెచ్చిపోయిన దిశా పటానీ: ఈ సారి బట్లలేమీ లేకుండానే యమ ఘాటుగా!మళ్లీ రెచ్చిపోయిన దిశా పటానీ: ఈ సారి బట్లలేమీ లేకుండానే యమ ఘాటుగా!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    భారీ బడ్జెట్‌తో రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 26 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 590.05 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 137.01 కోట్ల లాభాలను సొంతం చేసుకుంది.

    ఇంకో పది కోట్లు వస్తే కొత్త రికార్డులు

    ఇంకో పది కోట్లు వస్తే కొత్త రికార్డులు

    RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి 26 రోజుల్లోనే రూ. 590.05 కోట్లు షేర్ వచ్చింది. ఇక, ఈ సినిమాకు మరో 10 కోట్లు షేర్ వస్తే.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 600 కోట్ల మార్కును చేరుకుంటుంది. అలాగే, 8 కోట్లు గ్రాస్ వస్తే 1100 మార్కును చేరుతుంది. 13 కోట్లు షేర్ వస్తే లాభాలు 150 కోట్లు అవుతాయి. ఇదే జరిగితే వేగంగా ఈ మార్కులను దాటుకున్న చిత్రంగా రికార్డు నమోదు అవుతుంది.

    English summary
    Jr NTR and Ram Charan Did RRR Movie under Rajamouli Direction. This Movie Collects Rs 590.05 Cr Share in 26 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X