RRR 27 Days Collections: మరీ భారీ ఎదురుదెబ్బ.. 453 కోట్ల టార్గెట్.. 27 రోజుల్లో వచ్చింది ఎంతంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంత కాలంగా మల్టీస్టారర్ మూవీలు చాలా ఎక్కువగా వస్తున్నాయన్న విషయం తెలిసిందే. గతంలో పోలిస్తే ఇప్పుడు ఆ తరహా సినిమాలకు ప్రేక్షకులు అలవాటు పడిపోతున్నారు. దీంతో దర్శక నిర్మాతలు ఇలాంటి కథలతో ముందుకు వస్తున్నారు. ఇలా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం).

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ మూవీలో ఇద్దరు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. దీంతో ఈ మూవీ రేంజ్ భారీగా పెరిగింది. అందుకు అనుగుణంగానే ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది. ఫలితంగా కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో RRR మూవీ 27 రోజుల కలెక్షన్లపై ఓ లుక్కేద్దాం పదండి!

భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన RRR

భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన RRR

ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో రాజమౌళి తీసిన మల్టీస్టారర్ మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. ఇందులో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రల్లో కనిపించారు.

అత్యధిక ప్రీ బిజినెస్‌తో రికార్డులు

అత్యధిక ప్రీ బిజినెస్‌తో రికార్డులు

టాలీవుడ్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన RRR మూవీపై ఎన్నో అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇలా అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగింది.

27వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

27వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

RRRకు 27వ రోజు ఏపీ, తెలంగాణలో కలెక్షన్లు బాగా తగ్గాయి. దీంతో నైజాంలో రూ. 8 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. 26 రోజైన మంగళవారం రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 23 లక్షలు షేర్, రూ. 90 లక్షలు గ్రాస్‌‌ను రాబట్టింది.

26 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు

26 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు

RRR మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 27 రోజుల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 110.02 కోట్లు, సీడెడ్‌లో రూ. 50.20 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 34.32 కోట్లు, ఈస్ట్‌లో రూ. 15.87 కోట్లు, వెస్ట్‌లో రూ. 12.99 కోట్లు, గుంటూరులో రూ. 17.83 కోట్లు, కృష్ణాలో రూ. 14.35 కోట్లు, నెల్లూరులో రూ. 9.14 కోట్లతో కలిపి రూ. 264.73 కోట్లు షేర్, రూ. 399.65 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ఏపీ తెలంగాణలో RRR మూవీకి 27 రోజుల్లోనే రూ. 264.73 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 42.95 కోట్లు, తమిళనాడులో రూ. 37.65 కోట్లు, కేరళలో రూ. 10.38 కోట్లు, హిందీలో రూ. 127.70 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 9.05 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 98.95 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 27 రోజుల్లోనే రూ. 591.41 కోట్లు షేర్‌, రూ. 1094.70 కోట్లు గ్రాస్‌ వసూలు చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 27 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 591.41 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 138.41 కోట్ల లాభాలను సొంతం చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X