RRR 29 Days Collections: మళ్లీ పెరిగిన వసూళ్లు.. 29వ రోజు కూడా భారీగా.. ఆ మార్కుతో మరో రికార్డు
పేరుకు తెలుగు సినిమానే అయినా.. దేశ వ్యాప్తంగా బజ్‌ను ఏర్పరచుకుని అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). బాహుబలి వంటి భారీ సక్సెస్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం కావడంతో పాటు ఇందులో ఇద్దరు బడా హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించడంతో దీని రేంజ్ మరింతగా పెరిగిపోయింది.
ఫలితంగా భారీ బిజినెస్‌ను జరుపుకుని ఈ సినిమా గత నెలలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు అనుగుణంగానే దీనికి ఆరంభం నుంచే భారీ స్పందన దక్కింది. దీంతో దీనికి కలెక్షన్లు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో RRR మూవీకి 29 రోజుల్లో ఎంత కలెక్షన్లు వచ్చాయి అన్న దానిపై పూర్తి సమాచారం చూద్దాం పదండి!

పిరియాడిక్ కథతో మల్టీస్టారర్‌గా
ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో పిరియాడిక్ కథతో రాజమౌళి తెరకెక్కించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). దీన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. ఇందులో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలు పోషించారు.

అత్యధిక ప్రీ బిజినెస్‌తో రికార్డులు
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన RRR మూవీపై ఎన్నో అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇక, అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

29వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
RRRకు ఏపీ, తెలంగాణలో 29వ రోజు కలెక్షన్లు మరింత తగ్గాయి. దీంతో నైజాంలో రూ. 9 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్‌లో రూ. 3 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. 29 రోజైన శుక్రవారం రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 28 లక్షలు షేర్, రూ. 50 లక్షలు గ్రాస్‌ను రాబట్టింది.

29 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు
RRR మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 29 రోజుల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 110.17 కోట్లు, సీడెడ్‌లో రూ. 50.28 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 34.40 కోట్లు, ఈస్ట్‌లో రూ. 15.91 కోట్లు, వెస్ట్‌లో రూ. 13.02 కోట్లు, గుంటూరులో రూ. 17.86 కోట్లు, కృష్ణాలో రూ. 14.39 కోట్లు, నెల్లూరులో రూ. 9.15 కోట్లతో కలిపి రూ. 265.19 కోట్లు షేర్, రూ. 400.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
ఏపీ తెలంగాణలో RRR మూవీకి 29 రోజుల్లోనే రూ. 265.19 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 43.08 కోట్లు, తమిళనాడులో రూ. 37.75 కోట్లు, కేరళలో రూ. 10.40 కోట్లు, హిందీలో రూ. 128.75 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 9.08 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 99.70 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 29 రోజుల్లోనే రూ. 593.95 కోట్లు షేర్, రూ. 1100.20 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?
భారీ బడ్జెట్‌తో రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 29 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 593.95 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 140.95 కోట్ల లాభాలను సొంతం చేసుకుంది.

ఆ మార్కుతో మరో రికార్డు సొంతం
భారీ మల్టీస్టారర్‌గా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కలిసి 29వ రోజులు కలెక్షన్లు పది లక్షల రూపాయలు పెరిగాయి. అదే సమయంలో అన్ని ఏరియాల్లో స్పందన రావడంతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 1100 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా ఈ మార్కును చేరుకున్న రెండో సినిమాగా ఇది నిలిచింది.


Click it and Unblock the Notifications











