RRR 3 Days Collections: సండే అన్ని కోట్లతో అరాచకం.. 453 కోట్ల టార్గెట్.. 3 రోజుల్లో వచ్చిందెంతంటే!

'బాహుబలి' చిత్రంతో దేశం మొత్తాన్ని మన ఇండస్ట్రీ వైపు తిరిగి చూసేలా చేసిన దర్శకుడు రాజమౌళి. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమాతో బాక్సాఫీస్ బ్లాస్ట్ అయిపోయింది. ఇంతటి భారీ విజయవంతమైన సినిమా తర్వాత జక్కన్న చెక్కిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు కలిసి నటించడంతో దీని రేంజ్ మరింతగా పెరిగిపోయింది.

ఫలితంగా ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించడంతో పాటు భారీ స్థాయిలో బిజినెస్‌ను కూడా జరుపుకుంది. దీంతో ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది. అందుకు అనుగుణంగానే దీనికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా మూడు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లపై ఓ లుక్కేద్దాం పదండి!

 భారీ మల్టీస్టారర్‌గా రూపొందిన RRR

భారీ మల్టీస్టారర్‌గా రూపొందిన RRR

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్లు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా చేసిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు నటించారు. ఇందులో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రల్లో కనిపించారు.

ప్రీ బిజినెస్‌లోనూ నెంబర్ వన్‌గానే

ప్రీ బిజినెస్‌లోనూ నెంబర్ వన్‌గానే

భారీ బడ్జెట్‌తో రూపొందిన RRR మూవీపై ఎన్నో అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇలా అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్ల మేర వ్యాపారం జరిగినట్లు తెలిసింది.

3వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

3వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

RRR మూవీ ఏపీ, తెలంగాణలో సంచలనం సృష్టించింది. దీంతో నైజాంలో రూ. 15.05 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.40 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.14 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.72 కోట్లు, వెస్ట్‌లో రూ. 1.10 కోట్లు, గుంటూరులో రూ. 1.95 కోట్లు, కృష్ణాలో రూ. 2.03 కోట్లు, నెల్లూరులో రూ. 96 లక్షలతో.. ఆదివారం రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 33.35 కోట్లు షేర్, రూ. 50.50 కోట్లు గ్రాస్‌ రాబట్టింది.

3 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు

3 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు

RRR మూవీకి 3 రోజుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 53.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 28.90 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 15.54 కోట్లు, ఈస్ట్‌లో రూ. 8.69 కోట్లు, వెస్ట్‌లో రూ. 7.98 కోట్లు, గుంటూరులో రూ. 11.56 కోట్లు, కృష్ణాలో రూ. 8.10 కోట్లు, నెల్లూరులో రూ. 4.82 కోట్లతో కలుపుకుని రూ. 139.09 కోట్లు షేర్, రూ. 203 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

రెండు రాష్ట్రాల్లో 3 రోజుల్లోనే RRR మూవీకి రూ. 139.09 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 18.50 కోట్లు, తమిళనాడులో రూ. 16.20 కోట్లు, కేరళలో రూ. 5.10 కోట్లు, హిందీలో రూ. 36.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.05 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 56.10 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల్లోనే రూ. 275.54 కోట్లు షేర్‌, రూ. 486 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

భారీ బడ్జెట్‌తో రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 3 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 275.54 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 177.46 కోట్లు వస్తే ఇది హిట్ స్టేటస్‌లోకి వెళ్తుంది.

 రికార్డులు బ్రేక్.. సంచలన వసూళ్లు

రికార్డులు బ్రేక్.. సంచలన వసూళ్లు

ఆరంభంలోనే మంచి టాక్‌ను సంపాదించుకున్న RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ.. అప్పటి నుంచీ రాణిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే మూడో రోజైన ఆదివారం కూడా ఇది సత్తా చాటింది. ఫలితంగా మొదటి వీకెండ్‌లోనే రూ. 275.54 కోట్లు షేర్‌, రూ. 486 కోట్లు గ్రాస్‌ను రాబట్టి రికార్డులు క్రియేట్ చేసింది. ఈ రేంజ్ వసూళ్లతో టాలీవుడ్‌లో నెంబర్ వన్ మూవీగా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X