twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR 30 Days Collections: శనివారం ఊహించని వసూళ్లు.. అక్కడ సంచలన రికార్డు.. 30 రోజుల్లో ఎంతంటే!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీ చరిత్రలోనే భారీ బడ్జెట్.. హై టెక్నికల్ వ్యాల్యూస్.. అన్నింటికీ మించి స్టార్ల కాంబినేషన్‌లో భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసిన రాజమౌళి ఈ సినిమాను రూపొందించారు. ఇందులో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించడంతో ఇది అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా భారీ బిజినెస్‌ను జరుపుకుని నెల రోజుల క్రితమే ఇది ప్రేక్షకుల ముందుకొచ్చింది. అంచనాలను నిజం చేస్తూ ఈ మూవీ ఆరంభం నుంచే భారీ స్పందనను అందుకుంది. దీంతో దీనికి కలెక్షన్లు భారీగా వచ్చాయి. ఈ నేపథ్యంలో RRR మూవీకి 30 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

    ఇద్దరు స్టార్లను కలిపిన దర్శకుడు

    ఇద్దరు స్టార్లను కలిపిన దర్శకుడు

    స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికలో రాజమౌళి తెరకెక్కించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). దీన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. ఇందులో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలు చేశారు.

    హాట్ షోతో రెచ్చిపోయిన బిగ్ బాస్ సరయు: పైటను పక్కకు జరిపి మరీ ఘోరంగా!హాట్ షోతో రెచ్చిపోయిన బిగ్ బాస్ సరయు: పైటను పక్కకు జరిపి మరీ ఘోరంగా!

    అత్యధిక ప్రీ బిజినెస్‌తో రికార్డులు

    అత్యధిక ప్రీ బిజినెస్‌తో రికార్డులు


    బడా ప్రాజెక్టుగా రూపొందిన RRR మూవీపై ఎన్నో అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇక, అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ అయింది.

     30వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    30వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    RRRకు ఏపీ, తెలంగాణలో 30వ రోజు కలెక్షన్లు మరింత పెరిగాయి. దీంతో నైజాంలో రూ. 14 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 6 లక్షలు, ఈస్ట్‌లో రూ. 4 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో.. 30 రోజైన శనివారం రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 43 లక్షలు షేర్, రూ. 80 లక్షలు గ్రాస్‌‌ను రాబట్టింది.

    యాంకర్ రష్మీ అందాల ఆరబోత: స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో ముందుకు వంగి మరీ ఘాటుగా!యాంకర్ రష్మీ అందాల ఆరబోత: స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో ముందుకు వంగి మరీ ఘాటుగా!

    30 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు

    30 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు


    RRR మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 30 రోజుల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 110.31 కోట్లు, సీడెడ్‌లో రూ. 50.36 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 34.46 కోట్లు, ఈస్ట్‌లో రూ. 15.95 కోట్లు, వెస్ట్‌లో రూ. 13.04 కోట్లు, గుంటూరులో రూ. 17.89 కోట్లు, కృష్ణాలో రూ. 14.42 కోట్లు, నెల్లూరులో రూ. 9.19 కోట్లతో కలిపి రూ. 265.62 కోట్లు షేర్, రూ. 401.30 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ఏపీ తెలంగాణలో RRR 30 రోజుల్లోనే రూ. 265.62 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 43.15 కోట్లు, తమిళనాడులో రూ. 37.79 కోట్లు, కేరళలో రూ. 10.41 కోట్లు, హిందీలో రూ. 129.35 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 9.08 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 100.10 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 30 రోజుల్లోనే రూ. 595.50 కోట్లు షేర్‌, రూ. 1103.50 కోట్లు గ్రాస్‌ వసూలు చేసింది.

    నీ బాడీలో ఏ పార్టులకు సర్జరీ చేయించావ్: శృతి హాసన్‌కు నెటిజన్ ప్రశ్న.. దానికే చేయించా అంటూ!నీ బాడీలో ఏ పార్టులకు సర్జరీ చేయించావ్: శృతి హాసన్‌కు నెటిజన్ ప్రశ్న.. దానికే చేయించా అంటూ!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?


    భారీ బడ్జెట్‌తో రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 30 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 595.50 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 142.50 కోట్ల లాభాలను సొంతం చేసుకుంది.

    అక్కడ సంచలన రికార్డు సొంతం

    అక్కడ సంచలన రికార్డు సొంతం


    భారీ మల్టీస్టారర్‌గా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మంచి వసూళ్లను రాబట్టింది. అలాగే, చాలా ఏరియాల్లో భారీ కలెక్షన్లను అందుకుంది. ఈ క్రమంలోనే ఓవర్సీస్‌లో ఈ చిత్రం రూ. 100 కోట్ల షేర్‌ను సొంతం చేసుకుంది. తద్వారా మరో సంచలన రికార్డును ఈ మూవీ అందుకుని సత్తాను చాటుకుంది.

    English summary
    Jr NTR and Ram Charan Did RRR Movie under Rajamouli Direction. This Movie Collects Rs 595.50 Cr Share in 30 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X