twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR 31 Days Collections: సండే సంచలన వసూళ్లు.. ఒక్కరోజే అన్ని కోట్లు.. మరో కోటిన్నర వస్తే రికార్డే!

    |

    పేరుకు తెలుగు సినిమానే అయినా దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించడంతో పాటు విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకున్న చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). దీనికి కారణం ఈ మూవీని దర్శకధీరుడు రాజమౌళి రూపొందించడంతో పాటు ఇందులో ఇద్దరు బడా హీరోలు స్క్రీన్ షేర్ చేసుకోవడమే. దీంతో ఈ సినిమా రేంజ్ మరింతగా పెరిగిపోయింది.

    ఫలితంగా దీనికి రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. తద్వారా ఎంతో గ్రాండ్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకు అనుగుణంగానే ఆరంభంలోనే భారీ స్పందనతో కలెక్షన్లను రాబట్టిన ఈ చిత్రం 31 రోజుల్లో ఎంత వసూలు చేసింది? ఇప్పటి వరకూ ఎన్ని కోట్ల లాభాలను అందుకుంది? అనేవి చూద్దాం పదండి!

    బడా మల్టీస్టారర్‌గా వచ్చిన RRR

    బడా మల్టీస్టారర్‌గా వచ్చిన RRR

    ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో బడా మల్టీస్టారర్‌గా రూపొందిన సినిమానే RRR (రౌద్రం రణం రుధిరం). దీన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. ఇందులో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీంలుగా నటించారు.

    హాట్ షోలో హద్దు దాటిన శివాత్మిక రాజశేఖర్: వామ్మో ఆమెనిలా చూశారంటే తట్టుకోలేరుగా!హాట్ షోలో హద్దు దాటిన శివాత్మిక రాజశేఖర్: వామ్మో ఆమెనిలా చూశారంటే తట్టుకోలేరుగా!

    అత్యధిక ప్రీ బిజినెస్‌తో రికార్డులు

    అత్యధిక ప్రీ బిజినెస్‌తో రికార్డులు

    క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన RRR మూవీపై ఎన్నో అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇక, అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

    31వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    31వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    31వ రోజు RRRకు ఏపీ, తెలంగాణలో కలెక్షన్లు మరింత పెరిగాయి. దీంతో నైజాంలో రూ. 26 లక్షలు, సీడెడ్‌లో రూ. 14 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 9 లక్షలు, ఈస్ట్‌లో రూ. 7 లక్షలు, వెస్ట్‌లో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో.. 31 రోజైన ఆదివారం రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 76 లక్షలు షేర్, రూ. 1.20 కోట్లు గ్రాస్‌‌ను రాబట్టింది.

    యాంకర్ రష్మీ అందాల ఆరబోత: స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో ముందుకు వంగి మరీ ఘాటుగా!యాంకర్ రష్మీ అందాల ఆరబోత: స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో ముందుకు వంగి మరీ ఘాటుగా!

    31 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు

    31 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు

    RRR మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 31 రోజుల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 110.57 కోట్లు, సీడెడ్‌లో రూ. 50.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 34.55 కోట్లు, ఈస్ట్‌లో రూ. 16.02 కోట్లు, వెస్ట్‌లో రూ. 13.09 కోట్లు, గుంటూరులో రూ. 17.95 కోట్లు, కృష్ణాలో రూ. 14.47 కోట్లు, నెల్లూరులో రూ. 9.23 కోట్లతో కలిపి రూ. 266.38 కోట్లు షేర్, రూ. 402.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ఏపీ తెలంగాణలో RRR 31 రోజుల్లోనే రూ. 266.38 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 43.50 కోట్లు, తమిళనాడులో రూ. 38.02 కోట్లు, కేరళలో రూ. 10.45 కోట్లు, హిందీలో రూ. 130.40 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 9.12 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 100.65 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 31 రోజుల్లోనే రూ. 598.52 కోట్లు షేర్‌, రూ. 1110.05 కోట్లు గ్రాస్‌ వసూలు చేసింది.

    హాట్ షోతో రెచ్చిపోయిన బిగ్ బాస్ సరయు: పైటను పక్కకు జరిపి మరీ ఘోరంగా!హాట్ షోతో రెచ్చిపోయిన బిగ్ బాస్ సరయు: పైటను పక్కకు జరిపి మరీ ఘోరంగా!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 31 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 598.52 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 145.52 కోట్ల లాభాలను సొంతం చేసుకుంది.

    సండే డబుల్.. కోటిన్నర వస్తే రికార్డ్

    సండే డబుల్.. కోటిన్నర వస్తే రికార్డ్

    జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ 31వ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 76 లక్షల వసూళ్లను రాబట్టింది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఆదివారం రూ. 3.02 కోట్ల షేర్ రాబట్టి సత్తా చాటుకుంది. ఇక, ఈ చిత్రానికి మరో రూ. 1.50 కోట్లు వసూలు అయితే రూ. 600 కోట్ల షేర్ మార్కును చేరుతుంది.

    English summary
    Jr NTR and Ram Charan Did RRR Movie under Rajamouli Direction. This Movie Collects Rs 598.52 Cr Share in 31 Days
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X