RRR 32 Days Collections: భారీగా పడిపోయిన కలెక్షన్లు.. అయినా మరో రికార్డుకు చేరువలో!

తెలుగు దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన RRR అయినా దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించడమే కాక విడుదలకు ముందే భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ చేసింది. ఓటమే ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఇద్దరు బడా హీరోలు స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. ఇక ముందు నుంచి పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లు రాబట్టిన ఈ సినిమా 32 రోజుల్లో ఎంత వసూలు చేసింది? ఇప్పటి వరకూ ఎన్ని కోట్ల లాభాలను అందుకుంది? అనేది ఈ బాక్సాఫీస్ రిపోర్టులో చూద్దాం!

ఎంతో ప్రతిష్టాత్మకంగా

ఎంతో ప్రతిష్టాత్మకంగా

నందమూరి వంశానికి చెందిన ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ కాంబినేషన్‌లో బడా మల్టీస్టారర్‌గా రూపొందిన సినిమానే RRR (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అలాగే రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు.

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ సరసన ఆలియా భట్, కొమురం భీమ్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు.

451 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్

451 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన RRR సినిమా మీద ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లో కూడా భారీ రేటు పలికింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా అన్ని ఏరియాలను కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

32వ రోజు తెలుగు రాష్ట్రాల రిపోర్ట్

32వ రోజు తెలుగు రాష్ట్రాల రిపోర్ట్

32వ రోజు RRRకు ఏపీ, తెలంగాణలో కలెక్షన్లు మరింత పెరిగాయి. దీంతో నైజాంలో రూ. 9 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్‌లో రూ. 1 లక్ష, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్ష, కృష్ణాలో రూ. 1 లక్ష, నెల్లూరులో రూ. 1 లక్షతో.. 32 రోజైన సోమవారం రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 22 లక్షలు షేర్ రాబట్టింది.

32 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్ట్

32 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్ట్

RRR మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 31 రోజుల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 110.66 కోట్లు, సీడెడ్‌లో రూ. 50.54 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 34.59 కోట్లు, ఈస్ట్‌లో రూ.16.03 కోట్లు, వెస్ట్‌లో రూ. 13.11 కోట్లు, గుంటూరులో రూ. 17.96 కోట్లు, కృష్ణాలో రూ.14.48 కోట్లు, నెల్లూరులో రూ. 9.24 కోట్లతో కలిపి రూ. 266.60 కోట్లు షేర్, రూ. 402.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

32 రోజుల వరల్డ్ వైడ్ రిపోర్ట్

32 రోజుల వరల్డ్ వైడ్ రిపోర్ట్

ఏపీ తెలంగాణలో RRR 32 రోజుల్లోనే రూ. 266.60 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 43.60 కోట్లు, తమిళనాడులో రూ. 38.05 కోట్లు, కేరళలో రూ. 10.47 కోట్లు, హిందీలో రూ. 130.80 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 9.12 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 100.90 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 32 రోజుల్లోనే రూ. 599.54 కోట్లు షేర్‌, రూ. 1112.50 కోట్లు గ్రాస్‌ వసూలు చేసింది.

ఎన్ని కోట్లు లాభాలు వచ్చాయంటే?

ఎన్ని కోట్లు లాభాలు వచ్చాయంటే?

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 32 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 599.54 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 146.54 కోట్ల లాభాలను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా మరో 46 లక్షలు వసూలు చేస్తే రూ. 600 కోట్ల షేర్ మార్కును చేరుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X