RRR 33 Days Collections: మరో సంచలన రికార్డు.. 600 కోట్లు ఏంటి సామీ.. ఇందులో లాభాలు ఎంతో తెలిస్తే!

బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి. ఈ మూవీతో దర్శకుడిగా ఆయన స్థాయి కూడా భారీ స్థాయిలో పెరిగిపోయింది. దీంతో ఆయన మరింత ప్రతిష్టాత్మకంగా సినిమాలు తీయాలని భావించారు. ఇందులో భాగంగానే టాలీవుడ్‌లో స్టార్ హీరోలుగా వెలుగొందుతోన్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ను కలిపి RRR (రౌద్రం రణం రుధిరం) అనే మల్టీస్టారర్ మూవీని రూపొందించారు.

విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకున్న ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. అదే సమయంలో ఇంకా కలెక్షన్లను రాబడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో RRR మూవీ 33 రోజుల్లో ఎంత వసూలు చేసిందన్న వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి!

పిరియాడిక్ మల్టీస్టారర్‌గా సినిమా

పిరియాడిక్ మల్టీస్టారర్‌గా సినిమా

పిరియాడిక్ నేపథ్యంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో రూపొందిన సినిమానే RRR (రౌద్రం రణం రుధిరం). దీన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. ఇందులో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీంలుగా కనిపించారు.

అత్యధిక ప్రీ బిజినెస్‌తో రికార్డులు

అత్యధిక ప్రీ బిజినెస్‌తో రికార్డులు

భారీ బడ్జెట్‌తో రూపొందిన RRR మూవీపై ఎన్నో అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇక, అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు టాక్.

33వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

33వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

RRRకు 33వ రోజు ఏపీ, తెలంగాణలో కలెక్షన్లు మరింత తగ్గాయి. దీంతో నైజాంలో రూ. 6 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్‌లో రూ. 1 లక్షలు, వెస్ట్‌లో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. 33 రోజైన మంగళవారం రెండు రాష్ట్రాల్లో రూ. 16 లక్షలు షేర్, రూ. 30 లక్షలు గ్రాస్‌‌ను రాబట్టింది.

33 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు

33 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు

RRR మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 33 రోజుల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 110.71 కోట్లు, సీడెడ్‌లో రూ. 50.57 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 34.61 కోట్లు, ఈస్ట్‌లో రూ. 16.04 కోట్లు, వెస్ట్‌లో రూ. 13.12 కోట్లు, గుంటూరులో రూ. 17.96 కోట్లు, కృష్ణాలో రూ. 14.49 కోట్లు, నెల్లూరులో రూ. 9.25 కోట్లతో కలిపి రూ. 266.76 కోట్లు షేర్, రూ. 403.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ఏపీ తెలంగాణలో RRR 33 రోజుల్లోనే రూ. 266.76 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 43.64 కోట్లు, తమిళనాడులో రూ. 38.08 కోట్లు, కేరళలో రూ. 10.48 కోట్లు, హిందీలో రూ. 131 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 9.13 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 101.05 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 33 రోజుల్లోనే రూ. 600.14 కోట్లు షేర్‌, రూ. 1114 కోట్లు గ్రాస్‌ వసూలు చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

క్రేజీ కాంబోలో రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 33 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 600.14 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 147.14 కోట్ల లాభాలను సొంతం చేసుకుంది.

మరో రికార్డు.. 2.84 కోట్లు రాబడితే

మరో రికార్డు.. 2.84 కోట్లు రాబడితే

స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ 33వ రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 600 కోట్లు షేర్‌ను రాబట్టి మరో రికార్డును నమోదు చేసుకుంది. ఇక, ఈ చిత్రానికి మరో రూ. 2.84 కోట్లు షేర్ వసూలు అయితే రూ. 150 కోట్ల లాభాలు కూడా వస్తాయి. దీంతో మరో రికార్డు కూడా వచ్చి చేరుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X