twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR 34 Days Collections: మళ్లీ భారీ దెబ్బ.. మరింత తగ్గిన వసూళ్లు.. 34 రోజుల రిపోర్ట్ చూశారంటే!

    |

    తెలుగు సినిమానే అయినా దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల అందరి దృష్టినీ ఆకర్షించిన చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). దీనికి కారణం ఈ సినిమాను దేశమే మెచ్చిన దిగ్గజ దర్శకుడు రాజమౌళి రూపొందించడమే. అంతేకాదు, ఇందులో ఇద్దరు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించడంతో దీని రేంజ్ మరింతగా పెరిగిపోయింది.

    ఫలితంగా విడుదలకు ముందే భారీ హైప్‌ను క్రియేట్ చేసుకుని గ్రాండ్‌గా విడుదలైంది. ఇక, ఆరంభంలోనే ఈ సినిమాకు మంచి స్పందన దక్కింది. ఫలితంగా పది రోజుల్లోనే టార్గెట్ పూర్తైంది. అయితే, ఆ తర్వాత క్రమంగా వసూళ్లు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో RRR మూవీ 34 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

    రియల్ హీరోలుగా మారిన స్టార్లు

    రియల్ హీరోలుగా మారిన స్టార్లు

    ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికలో రాజమౌళి రూపొందించిన సినిమానే RRR (రౌద్రం రణం రుధిరం). దీన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. ఇందులో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీంలుగా చేసిన విషయం తెలిసిందే.

    బ్రాతో రెచ్చిపోయిన టాలీవుడ్ హీరోయిన్: తల్లైనా తగ్గకుండా బెడ్‌పై యమ హాట్‌గా!బ్రాతో రెచ్చిపోయిన టాలీవుడ్ హీరోయిన్: తల్లైనా తగ్గకుండా బెడ్‌పై యమ హాట్‌గా!

    అత్యధిక ప్రీ బిజినెస్‌తో రికార్డులు

    అత్యధిక ప్రీ బిజినెస్‌తో రికార్డులు

    భారీ హైప్ క్రియేట్ చేసుకున్న RRR మూవీ అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇక, అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

     34వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    34వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    RRRకు 34వ రోజు ఏపీ, తెలంగాణలో కలెక్షన్లు మరింత పడిపోయాయి. దీంతో నైజాంలో రూ. 5 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్‌లో రూ. 1 లక్షలు, వెస్ట్‌లో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. 34 రోజైన బుధవారం రెండు రాష్ట్రాల్లో రూ. 14 లక్షలు షేర్, రూ. 25 లక్షలు గ్రాస్‌‌ను రాబట్టింది.

    బెడ్‌పై బట్టలు లేకుండా పాయల్ రాజ్‌పుత్: వామ్మో ఆమెనిలా చూశారంటే షాకే!బెడ్‌పై బట్టలు లేకుండా పాయల్ రాజ్‌పుత్: వామ్మో ఆమెనిలా చూశారంటే షాకే!

    34 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు

    34 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు

    RRR మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 34 రోజుల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 110.76 కోట్లు, సీడెడ్‌లో రూ. 50.59 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 34.63 కోట్లు, ఈస్ట్‌లో రూ. 16.05 కోట్లు, వెస్ట్‌లో రూ. 13.13 కోట్లు, గుంటూరులో రూ. 17.98 కోట్లు, కృష్ణాలో రూ. 14.50 కోట్లు, నెల్లూరులో రూ. 9.26 కోట్లతో కలిపి రూ. 266.90 కోట్లు షేర్, రూ. 403.45 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ఏపీ తెలంగాణలో RRR 34 రోజుల్లోనే రూ. 266.90 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 43.68 కోట్లు, తమిళనాడులో రూ. 38.10 కోట్లు, కేరళలో రూ. 10.49 కోట్లు, హిందీలో రూ. 131.25 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 9.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 101.20 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 34 రోజుల్లోనే రూ. 600.77 కోట్లు షేర్‌, రూ. 1115.50 కోట్లు గ్రాస్‌ వసూలు చేసింది.

    యాంకర్ మంజూష హాట్ ట్రీట్: స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో అందాలన్నీ కనిపించేలా!యాంకర్ మంజూష హాట్ ట్రీట్: స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో అందాలన్నీ కనిపించేలా!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    భారీ బడ్జెట్‌తో రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 34 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 600.77 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 147.77 కోట్ల లాభాలను కూడా సొంతం చేసుకుంది.

    English summary
    Jr NTR and Ram Charan Did RRR Movie under Rajamouli Direction. This Movie Collects Rs 600.77 Cr Share in 34 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X