twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR 38 Days Collections: సండే కలెక్షన్లు డబుల్.. గ్యాప్ తర్వాత కోటికి పైగా.. లాభాలతో మరో రికార్డు

    |

    తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి. ప్రభాస్‌తో తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రంతో ఆయన రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అంతటి భారీ విజయం తర్వాత దర్శకధీరుడు రూపొందించిన సినిమానే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు.

    దీంతో ఈ సినిమా ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా అత్యధిక బిజినెస్ జరుపుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఫలితంగా కలెక్షన్ల మోత మోగించింది. ఈ నేపథ్యంలో RRR మూవీ 38 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

    స్టార్ హీరోల కాంబోలో వచ్చేసింది

    స్టార్ హీరోల కాంబోలో వచ్చేసింది

    స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో రాజమౌళి తెరకెక్కించిన పిరియాడిక్ మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). దీన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. ఇందులో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీంగా చేశారు.

    Bigg Boss Non Stop: నీ బటన్స్ తీసి బ్రా చూపించు.. ఆమెతో శివ అసభ్యంగా.. నాగార్జున వీడియో చూపించడంతో!Bigg Boss Non Stop: నీ బటన్స్ తీసి బ్రా చూపించు.. ఆమెతో శివ అసభ్యంగా.. నాగార్జున వీడియో చూపించడంతో!

    అత్యధిక ప్రీ బిజినెస్‌తో రికార్డులు

    అత్యధిక ప్రీ బిజినెస్‌తో రికార్డులు


    ఆరంభంలోనే RRR మూవీ అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇక, అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

    38వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    38వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    38వ రోజు RRRకు రోజు ఏపీ, తెలంగాణలో కలెక్షన్లు మరింత పెరిగాయి. దీంతో నైజాంలో రూ. 18 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్‌లో రూ. 3 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. 38 రోజైన ఆదివారం రెండు రాష్ట్రాల్లో రూ. 43 లక్షలు షేర్, రూ. 75 లక్షలు గ్రాస్‌‌ను రాబట్టింది.

    టాప్‌ను పైకి లేపి షాకిచ్చిన హీరోయిన్: ప్రైవేట్ భాగాలు కనిపించేలా తెలుగు నటి సెల్ఫీ వీడియోటాప్‌ను పైకి లేపి షాకిచ్చిన హీరోయిన్: ప్రైవేట్ భాగాలు కనిపించేలా తెలుగు నటి సెల్ఫీ వీడియో

     38 రోజుల్లో తెలుగు రాష్ట్రాల రిపోర్టు

    38 రోజుల్లో తెలుగు రాష్ట్రాల రిపోర్టు

    RRR మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 38 రోజుల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 111.10 కోట్లు, సీడెడ్‌లో రూ. 50.75 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 34.76 కోట్లు, ఈస్ట్‌లో రూ. 16.14 కోట్లు, వెస్ట్‌లో రూ. 13.20 కోట్లు, గుంటూరులో రూ. 18.03 కోట్లు, కృష్ణాలో రూ. 14.56 కోట్లు, నెల్లూరులో రూ. 9.29 కోట్లతో కలిపి రూ. 267.83 కోట్లు షేర్, రూ. 405.05 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ఏపీ తెలంగాణలో RRR 38 రోజుల్లో రూ. 267.83 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 43.96 కోట్లు, తమిళనాడులో రూ. 38.30 కోట్లు, కేరళలో రూ. 10.57 కోట్లు, హిందీలో రూ. 132.20 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 9.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 101.68 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 38 రోజుల్లోనే రూ. 603.69 కోట్లు షేర్‌, రూ. 1122.30 కోట్లు గ్రాస్‌ వసూలు చేసింది.

    పూల్‌లో బికినీతో ప్రియాంక చోప్రా రచ్చ: వామ్మో ఆమెను ఇలా చూస్తే తట్టుకోవడం కష్టమేపూల్‌లో బికినీతో ప్రియాంక చోప్రా రచ్చ: వామ్మో ఆమెను ఇలా చూస్తే తట్టుకోవడం కష్టమే

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    భారీ బడ్జెట్‌తో రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 38 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 603.69 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 150.69 కోట్ల లాభాలను కూడా సొంతం చేసుకుంది.

    గ్యాప్ తర్వాత కోటి.. రికార్డు నమోదు

    గ్యాప్ తర్వాత కోటి.. రికార్డు నమోదు

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి 38వ రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.02 కోట్లు వసూలు అయ్యాయి. తద్వారా చాలా గ్యాప్ తర్వాత కోటి రూపాయల మార్కును చేరుకుంది. అలాగే, 38 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్ల మార్కును కూడా చేరుకుంది. తద్వారా ఈ సినిమా ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరినట్లు అయింది.

    English summary
    Jr NTR and Ram Charan Did RRR Movie under Rajamouli Direction. This Movie Collects Rs 603.69 Cr Share in 38 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X