RRR Day 4 Collections : నాలుగో రోజూ రికార్డులు బద్దలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత కొల్లగొట్టింది అంటే!
'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా సత్తాని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన దర్శకుడు రాజమౌళి తాజాగా తెరకెక్కించిన తాజా చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు కలిసి నటించడమే కాక ఒక బాలీవుడ్ హీరో, హీరోయిన్, హాలీవుడ్ నటీనటులు కూడా సినిమాలో భాగం కావడంతో ఈ సినిమా రేంజ్ మరింత పెరిగిపోయింది. ఫలితంగా సినిమా ప్రారంభించిన నాటి నుంచి అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ సినిమా భారీ స్థాయిలో బిజినెస్ కూడా జరుపుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ దక్కుతోంది. మూడు రోజుల వీకెండ్ కాబట్టి మంచి కలెక్షన్స్ వచ్చాయి. అయితే సోమవారం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నాలుగు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లపై ఓ లుక్కేద్దాం పదండి!
Recommended Video


భారీ అంచనాలతో
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా చేసిన చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ సరసన ఆలియా భట్, కొమురం భీం పాత్రలో నటించిన ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్లు నటించారు.

451 కోట్ల మేర వ్యాపారం
భారీ బడ్జెట్‌తో రూపొందిన RRR మూవీ ప్రకటించిన నాటి నుంచి భారీ అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే మునుపెన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 191 కోట్ల బిజినెస్ జరిగింది. అలాగే, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో, ఓవర్సేస్ లో కూడా భారీ రేటు పలికింది. మొత్తం మీద అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్ల మేర వ్యాపారం జరిగినట్లు ట్రేడ్ వర్గాల అంచనా.

4వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
RRR సినిమా నాలుగో రోజు కూడా ఏపీ, తెలంగాణలో సంచలనం సృష్టించింది. దీంతో నైజాంలో రూ. 8.15 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.9 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.36 కోట్లు, ఈస్ట్‌లో రూ. 0.95 కోట్లు, వెస్ట్‌లో రూ. 0.97 కోట్లు, గుంటూరులో రూ. 0.67 కోట్లు, కృష్ణాలో రూ. 1.05 కోట్లు, నెల్లూరులో రూ.6 లక్షలతో.. ఆదివారం రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 17.55 కోట్లు షేర్ రాబట్టింది. ఇది ఇప్పటిదాకా నాలుగో రోజుకు సంబంధించి ఒక రికార్డు అని అంటున్నారు. గతంలో ఈ రికార్డు బాహుబలి పేరిట ఉంది. దాన్ని ఈ సినిమా బద్దలు కొట్టింది.

4 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు
RRR మూవీకి 4 రోజుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 61.65 కోట్లు, సీడెడ్‌లో రూ. 31.8 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 17.9 కోట్లు, ఈస్ట్‌లో రూ. 9.64 కోట్లు, వెస్ట్‌లో రూ. 8.95 కోట్లు, గుంటూరులో రూ. 12.23 కోట్లు, కృష్ణాలో రూ. 8.15 కోట్లు, నెల్లూరులో రూ. 4.88 కోట్లతో కలుపుకుని రూ. 156.64 కోట్లు షేర్ వసూళ్లు సాధించింది. మొదటి ఆట నుంచి మంచి మంచి టాక్ తెచ్చుకున్న RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ..నాలుగో రోజు కూడా సత్తా చాటింది..


Click it and Unblock the Notifications











