twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR 4 Days Collections: సోమవారం షాకింగ్ కలెక్షన్స్.. 4 రోజుల్లో అన్ని కోట్లు.. ఇంకెంత రావాలంటే!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చినా.. ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను దేశమే మెచ్చిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించారు. ఇందులో టాలీవుడ్‌లో టాప్ స్టార్లుగా వెలుగొందుతోన్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో ఈ మూవీకి బిజినెస్ కూడా భారీగానే జరిగింది.

    ఇలాంటి పరిస్థితుల్లో గత శుక్రవారమే ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి మొదటి నుంచే మంచి స్పందన దక్కి.. కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఫలితంగా సోమవారం షాకింగ్ వసూళ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో RRR బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

    ఇద్దరు స్టార్లతో రాజమౌళి మ్యాజిక్

    ఇద్దరు స్టార్లతో రాజమౌళి మ్యాజిక్

    టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు నటించారు. ఇందులో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలను పోషించారు.

    జిప్ తీసేసి రెచ్చిపోయిన అనన్య నాగళ్ల: క్లీవేజ్ షోతో తెలుగు పిల్ల అరాచకంజిప్ తీసేసి రెచ్చిపోయిన అనన్య నాగళ్ల: క్లీవేజ్ షోతో తెలుగు పిల్ల అరాచకం

    ప్రీ బిజినెస్‌లోనూ నెంబర్ వన్‌గానే

    ప్రీ బిజినెస్‌లోనూ నెంబర్ వన్‌గానే

    క్రేజీ కాంబోలో రూపొందిన RRR మూవీపై ఎన్నో అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇలా అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్ల మేర వ్యాపారం జరిగినట్లు ట్రేడ్ వర్గాల టాక్.

    4వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    4వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    RRR మూవీ ఏపీ, తెలంగాణలో వీక్ డేన కూడా రాణించింది. దీంతో నైజాంలో రూ. 8.15 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.92 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.26 కోట్లు, ఈస్ట్‌లో రూ. 97 లక్షలు, వెస్ట్‌లో రూ. 67 లక్షలు, గుంటూరులో రూ. 1.10 కోట్లు, కృష్ణాలో రూ. 1.05 కోట్లు, నెల్లూరులో రూ. 61 లక్షలతో.. 4వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 17.73 కోట్లు షేర్, రూ. 29.55 కోట్లు గ్రాస్‌ రాబట్టింది.

    బాత్రూంలో మెగా హీరోయిన్ హాట్ సెల్ఫీ: ప్రైవేటు భాగాలను చూపిస్తూ దారుణంగా!బాత్రూంలో మెగా హీరోయిన్ హాట్ సెల్ఫీ: ప్రైవేటు భాగాలను చూపిస్తూ దారుణంగా!

    4 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు

    4 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు

    RRR మూవీకి 4 రోజుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 61.65 కోట్లు, సీడెడ్‌లో రూ. 31.82 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 17.81 కోట్లు, ఈస్ట్‌లో రూ. 9.67 కోట్లు, వెస్ట్‌లో రూ. 8.65 కోట్లు, గుంటూరులో రూ. 12.67 కోట్లు, కృష్ణాలో రూ. 9.30 కోట్లు, నెల్లూరులో రూ. 5.43 కోట్లతో కలుపుకుని రూ. 157 కోట్లు షేర్, రూ. 232.65 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ఏపీ తెలంగాణలో 4 రోజుల్లోనే RRR మూవీకి రూ. 157 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 22.30 కోట్లు, తమిళనాడులో రూ. 18.90 కోట్లు, కేరళలో రూ. 5.35 కోట్లు, హిందీలో రూ. 45.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 63.80 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల్లోనే రూ. 317.05 కోట్లు షేర్‌, రూ. 565 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 4 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 317.05 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 135.95 కోట్లు వస్తే ఇది హిట్ స్టేటస్‌లోకి వెళ్తుంది.

    బీచ్‌లో బికినీతో శ్రీయ శరణ్ అందాల విందు: తల్లైన తర్వాత తొలిసారి ఇంత దారుణంగా!బీచ్‌లో బికినీతో శ్రీయ శరణ్ అందాల విందు: తల్లైన తర్వాత తొలిసారి ఇంత దారుణంగా!

     మరో రికార్డు కూడా.. సినీ పెద్దలే షాక్

    మరో రికార్డు కూడా.. సినీ పెద్దలే షాక్

    అదిరిపోయే టాక్‌ను సంపాదించుకున్న RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ.. అప్పటి నుంచీ రాణిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే నాలుగో రోజైన సోమవారం కూడా ఇది సత్తా చాటింది. ఫలితంగా నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ షేర్ సాధించిన చిత్రంగా నిలిచింది. తద్వారా బాహుబలి (14.65 కోట్లు) రికార్డును బ్రేక్ చేసింది. అలాగే మరెన్నో ఘనతలనూ సొంతం చేసుకుంది.

    English summary
    Jr NTR and Ram Charan Did RRR Movie under Rajamouli Direction. This Movie Collects Rs 317.05 Cr Share in 4 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X