RRR 4 Weeks Collections: మరో గొప్ప రికార్డు .. 4 వారాల్లో ఊహించని విధంగా.. లాభం ఎన్ని కోట్లంటే!
తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకుడు రాజమౌళి రూపకల్పనలో వచ్చిన ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). ఇందులో టాలీవుడ్‌లోనే స్టార్లుగా వెలుగొందుతోన్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. దీంతో ఈ సినిమా రేంజ్ మరింతగా పెరిగిపోయిందనే చెప్పాలి. అందుకు అనుగుణంగానే ఇది ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది. ఫలితంగా కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి. అయితే, క్రమంగా ఈ మూవీకి స్పందన తగ్గడంతో వసూళ్లు కూడా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో RRR మూవీ నాలుగు వారాల్లో ఎంత వసూలు చేసింది? ఇప్పటి వరకూ ఈ సినిమాకు ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి!

స్టార్ హీరోలతో రాజమౌళి సందడి
స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికలో రాజమౌళి తెరకెక్కించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. ఇందులో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలు చేశారు.

అత్యధిక ప్రీ బిజినెస్‌తో రికార్డులు
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR మూవీపై ఎన్నో అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇక, అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ అయింది.

28వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
28వ రోజు RRRకు ఏపీ, తెలంగాణలో కలెక్షన్లు మరింత తగ్గాయి. దీంతో నైజాంలో రూ. 6 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్‌లో రూ. 1 లక్షలు, వెస్ట్‌లో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. 28 రోజైన గురువారం రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 18 లక్షలు షేర్, రూ. 35 లక్షలు గ్రాస్‌ను రాబట్టింది.

28 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్టు
RRR మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 4 వారాల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 110.08 కోట్లు, సీడెడ్‌లో రూ. 50.23 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 34.36 కోట్లు, ఈస్ట్‌లో రూ. 15.88 కోట్లు, వెస్ట్‌లో రూ. 13 కోట్లు, గుంటూరులో రూ. 17.84 కోట్లు, కృష్ణాలో రూ. 14.37 కోట్లు, నెల్లూరులో రూ. 9.15 కోట్లతో కలిపి రూ. 264.91 కోట్లు షేర్, రూ. 400 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
ఏపీ తెలంగాణలో RRR మూవీకి 28 రోజుల్లోనే రూ. 264.91 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 43.02 కోట్లు, తమిళనాడులో రూ. 37.70 కోట్లు, కేరళలో రూ. 10.40 కోట్లు, హిందీలో రూ. 128.25 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 9.05 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 99.25 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 4 వారాల్లోనే రూ. 592.59 కోట్లు షేర్, రూ. 1097.30 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?
బడా హీరోల కాంబోలో రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 4 వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 592.59 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 139.59 కోట్ల లాభాలను సొంతం చేసుకుంది.

ఏపీ, తెలంగాణలో అరుదైన ఘనత
భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలెక్షన్లు భారీగా వచ్చాయి. దీంతో అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎప్పుడో చేరిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 400 కోట్లు గ్రాస్‌ను అందుకుని మరో రికార్డును సొంతం చేసుకుందీ మూవీ. దీనిపై చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది.


Click it and Unblock the Notifications











