RRR 41 Days Collections: ఎదురుదెబ్బ పడింది అనుకునేలోపే మళ్ళీ పెరిగిన వసూళ్లు.. ఎంత వచ్చాయంటే?

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం RRR. రౌద్రం రణం రుధిరం పేరిట తెరకెక్కిన ఈ సినిమాలో రెండు బడా ఫ్యామిలీకి చెందిన హీరోలు నటించారు.. దానికి తోడు బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్టు గానే భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుపుకున్న ఈ సినిమా విడుదలై నలభై రోజులు గడుస్తున్నా కలెక్షన్లలో మాత్రం జోరు తగ్గడం లేదు. పోటీగా రెండు పెద్ద సినిమాలు వచ్చినా సరే కలెక్షన్స్ లో మంచి జోరు కనబరుస్తోంది RRR సినిమా. ఈ RRR సినిమా నలభై ఒక్క రోజులలో ఎన్ని కోట్లు వసూలు చేసింది ? అనే దాని మీద ఒక లుక్ వేద్దాం పదండి.

RRR మేనియా

RRR మేనియా

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించిన తాజా చిత్రం RRR. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. వీరుగాక అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, మకరంద్ దేశ్పాండే వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

భారీ ప్రీ రిలీజ్ బిజినెస్

భారీ ప్రీ రిలీజ్ బిజినెస్


రిలీజ్‌కు ముందే RRR మూవీ అందరి దృష్టినీ ఆకర్షించింది. కేవలం తెలుగు వారినే కాకుండా ఇండియాలో ఉన్న అందరినీ ఎగ్జయిట్ చేయడంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరుపుకున్న ఈ సినిమాకు మిగిలిన ప్రాంతాల్లో కూడా భారీ రేటు పలికింది. ఇక, అన్ని ఏరియాల బిజినెస్ కలుపుకుని కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తేల్చాయి.

41వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

41వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

RRRకు 41వ రోజు ఏపీ, తెలంగాణలో కలెక్షన్లు 40వ రోజు కంటే కొంత మెరుగయ్యాయి. దీంతో నైజాంలో రూ. 6 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. 41వ రోజైన బుధవారం రెండు రాష్ట్రాల్లో రూ. 21 లక్షలు షేర్, రూ. 35 లక్షలు గ్రాస్‌‌ను రాబట్టింది.

41 రోజుల్లో తెలుగు రాష్ట్రాల రిపోర్టు

41 రోజుల్లో తెలుగు రాష్ట్రాల రిపోర్టు

RRR మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 41రోజుల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 111.36 కోట్లు, సీడెడ్‌లో రూ. 50.85 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 34.85 కోట్లు, ఈస్ట్‌లో రూ. 16.19 కోట్లు, వెస్ట్‌లో రూ. 13.25 కోట్లు, గుంటూరులో రూ. 18.08 కోట్లు, కృష్ణాలో రూ. 14.61 కోట్లు, నెల్లూరులో రూ. 9.32 కోట్లతో కలిపి రూ. 268.51 కోట్లు షేర్, రూ.406.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

 ప్రపంచ వ్యాప్తంగా ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?

ఏపీ తెలంగాణలో RRR 41 రోజుల్లో రూ. 268.51 కోట్లు షేర్, రూ.406.20 కోట్లు గ్రాస్ వచ్చింది.. అలాగే, కర్నాటకలో రూ. 44.15 కోట్లు, తమిళనాడులో రూ. 38.40 కోట్లు, కేరళలో రూ. 10.61 కోట్లు, హిందీలో రూ. 132.70 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 9.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 101.92 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా 41 రోజుల్లోనే రూ. 605.44 కోట్లు షేర్‌, రూ. 1126.15 కోట్లు గ్రాస్‌ వసూలు చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వేశాయి. ఈ క్రమంలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 41 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 605.44 కోట్లు షేర్‌, రూ. 1126.15 కోట్లు గ్రాస్‌ వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 152.44 కోట్ల లాభాలను కూడా సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకు క్రమక్రమంగా వసూళ్లు తగ్గుతున్నట్టు ట్రేడ్ రిపోర్టులు చెబుతున్నాయి. అయితే 39వ రోజు కంటే 40వ రోజు వసూళ్లు పుంజుకోవడం కూడా మనం గమనించవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X