RRR 46 Days Collections: 46వ రోజు భారీ ఎదురుదెబ్బ.. ఒక్కసారిగా డౌన్.. ఇంకో 14 లక్షలు వస్తే!

'బాహుబలి'తో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి. ఈ మూవీ ఏ రేంజ్‌లో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతటి సంచలన విజయం తర్వాత ఆయన తెరకెక్కించిన సినిమానే RRR (రౌద్రం రణం రుధిరం). ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. పిరియాడిక్ జోనర్‌లో వచ్చిన దీనిలో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీంగా నటించారు.

టాలీవుడ్‌లో హవాను చూపిస్తోన్న ఇద్దరు హీరోలు కలిసి నటించిన సినిమా కావడంతో 'RRR (రౌద్రం రణం రుధిరం)' ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా పట్టాలపై ఉన్న సమయంలోనే భారీ హైప్‌ను ఏర్పరచుకుంది. దీంతో ఈ సినిమా హక్కుల కోసం అన్ని భాషలకు సంబంధించిన బయ్యర్ల నుంచి డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ సినిమాకు అన్ని ఏరియాల్లోనూ మంచి బిజినెస్ జరిగింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలనూ కలుపుకుని రికార్డు స్థాయిలో రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగింది. ఇది టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక మొత్తం కావడం విశేషం. ఇక, ఈ సినిమా దాదాపు 10 వేలకు పైగా థియేటర్లలో విడుదలైంది.

భారీ బడ్జెట్‌తో రూపొందిన RRR మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు నుంచే మంచి ఆదరణ దక్కుతూ వచ్చింది. అందుకే ఇది వారంలోనే అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్‌ను దాటేసింది. అయితే, క్రమంగా ఈ సినిమా ప్రభావం తగ్గుతూ వస్తోంది. కానీ, వీకెండ్స్‌లో పుంజుకుంటూ వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో 46వ రోజైన సోమవారం రెండు రాష్ట్రాల్లో కలిపి దీనికి రూ. 14 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది. ఓవరాల్‌గా అన్ని ఏరియాలను కలుపుకుని దీనికి 46వ రోజు రూ. 36 లక్షలు షేర్ దక్కింది.

RRR Movie 46 Days Worldwide Box Office Collections

RRR మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 46 రోజుల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 111.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 51.02 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 35 కోట్లు, ఈస్ట్‌లో రూ. 16.24 కోట్లు, వెస్ట్‌లో రూ. 13.30 కోట్లు, గుంటూరులో రూ. 18.12 కోట్లు, కృష్ణాలో రూ. 14.67 కోట్లు, నెల్లూరులో రూ. 9.35 కోట్లతో కలుపుకుని రూ. 269.40 కోట్లు షేర్, రూ. 407.80 కోట్లు గ్రాస్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 44.38 కోట్లు, తమిళనాడులో రూ. 38.56 కోట్లు, కేరళలో రూ. 10.65 కోట్లు, హిందీలో రూ. 133.35 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 9.22 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 102.30 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 46 రోజుల్లోనే రూ. 607.86 కోట్లు షేర్‌, రూ. 1131.90 కోట్లు గ్రాస్‌ వసూలు చేసింది.

ఇద్దరు స్టార్ హీరోల కలయికలో భారీ బడ్జెట్‌తో రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 46 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 607.86 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 154.86 కోట్ల లాభాలను కూడా సొంతం చేసుకుంది. దీంతో మరో రూ. 14 లక్షలు వసూలు చేస్తే ఇది రూ. 150 కోట్ల లాభాల మార్కును చేరుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X