twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR 48 Days Collections: తగ్గని రాజమౌళి హవా.. 48వ రోజు కూడా అన్ని లక్షల వసూళ్లు

    |

    'బాహుబలి' మూవీతో తెలుగు సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఈ మూవీతో ఇండియన్ బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఆయన.. ఇప్పుడు భారీ మల్టీస్టారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే.. టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందించిన ఈ మూవీలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. ఈ సినిమాలో చరణ్.. అల్లూరిగా, తారక్.. కొమరం భీం పాత్రలు చేశారు.

    శ్రీముఖికి బాలీవుడ్ స్టార్ హీరో బిగ్ సర్‌ప్రైజ్: ఏ అమ్మాయికీ దక్కని అదృష్టం ఈమెదే మరి!శ్రీముఖికి బాలీవుడ్ స్టార్ హీరో బిగ్ సర్‌ప్రైజ్: ఏ అమ్మాయికీ దక్కని అదృష్టం ఈమెదే మరి!

    దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్‌నే ఏలుతోన్న ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించిన సినిమా కావడంతో 'RRR (రౌద్రం రణం రుధిరం)'పై ఆరంభం నుంచే అంచనాలను ఏర్పడ్డాయి. అంతేకాదు, దీని నుంచి వచ్చిన అప్‌డేట్ల కారణంగా బజ్ అంతకంతకూ పెరుగుతూ పోయింది. దీంతో ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కుల కోసం భారీ స్థాయిలో పోటీ ఏర్పడింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌కు అన్ని ఏరియాల్లోనూ రికార్డు స్థాయిలోనే బిజినెస్ జరిగింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలనూ కలుపుకుని రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగింది. ఫలితంగా ఈ మూవీ టాలీవుడ్‌లో నెంబర్ వన్ ప్లేస్‌కు చేరుకుంది.

    RRR Movie 48 Days Worldwide Box Office Collections

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన భారీ మల్టీస్టారర్ మూవీ RRRకు తెలుగు రాష్ట్రాల్లో ఆరంభం నుంచే మంచి ఆదరణ దక్కుతూ వచ్చింది. అందుకే ఇది వారంలోనే అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్‌ను దాటేసింది. అంతేకాదు, చాలా ఏరియాల్లో ఆల్‌టైం రికార్డును కూడా క్రియేట్ చేసుకుంది. అయితే, క్రమంగా ఈ సినిమా ప్రభావం పడిపోతూ వచ్చింది. అయితే, అప్పుడప్పుడూ వీకెండ్స్‌లో పుంజుకుంటూ వసూళ్లను రాబడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో 48వ రోజైన బుధవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి దీనికి రూ. 8 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది. ఓవరాల్‌గా అన్ని ఏరియాలను కలుపుకుని దీనికి 48వ రోజు రూ. 23 లక్షలు షేర్ వచ్చింది.

    ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో యాంకర్ స్రవంతి రచ్చ: ఎద అందాలను హైలైట్ చేస్తూ ఘోరంగా!ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో యాంకర్ స్రవంతి రచ్చ: ఎద అందాలను హైలైట్ చేస్తూ ఘోరంగా!

    ఏపీ తెలంగాణలో 48 రోజుల్లో RRR మూవీకి భారీ కలెక్షన్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 111.78 కోట్లు, సీడెడ్‌లో రూ. 51.06 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 35.03 కోట్లు, ఈస్ట్‌లో రూ. 16.24 కోట్లు, వెస్ట్‌లో రూ. 13.31 కోట్లు, గుంటూరులో రూ. 18.14 కోట్లు, కృష్ణాలో రూ. 14.67 కోట్లు, నెల్లూరులో రూ. 9.36 కోట్లతో కలుపుకుని రూ. 269.59 కోట్లు షేర్, రూ. 408.15 కోట్లు గ్రాస్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 44.44 కోట్లు, తమిళనాడులో రూ. 38.60 కోట్లు, కేరళలో రూ. 10.65 కోట్లు, హిందీలో రూ. 133.47 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 9.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 102.40 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 48 రోజుల్లోనే రూ. 608.40 కోట్లు షేర్‌, రూ. 1133.10 కోట్లు గ్రాస్‌ వసూలు చేసింది.

    పాన్ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 48 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 608.40 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 155.40 కోట్ల లాభాలను కూడా సొంతం చేసుకుని రికార్డులు నమోదు చేసుకుంది.

    English summary
    Jr NTR and Ram Charan Did RRR Movie under Rajamouli Direction. This Movie Collects Rs 608.40 Cr Share in 48 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X