RRR 5 Days Collections: 5వ రోజు ఊహించని వసూళ్లు.. ఆ రికార్డులన్నీ బ్రేక్.. ఇంకెంత వస్తే హిట్ అంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ మూవీల హవా స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి కారణం ప్రేక్షకులు ఈ తరహా చిత్రాలకు అలవాటు పడడంతో పాటు హీరోలు కూడా మరొకరితో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ధైర్యంగా ముందుకు వస్తుండడమే. ఇలా ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చాయి. ఈ క్రమంలోనే గత వారం విడుదలైన భారీ మల్టీస్టారర్ మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కించడంతో దీనిపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందుకు అనుగుణంగానే గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ మూవీకి కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో RRR ఐదు రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరూ తెలుసుకోండి మరి!

రాజమౌళి నుంచి భారీ మల్టీస్టారర్

రాజమౌళి నుంచి భారీ మల్టీస్టారర్

బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ కలిసి నటించిన సినిమానే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు నటించారు. ఇందులో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రల్లో నటించారు.

ప్రీ బిజినెస్‌లోనూ నెంబర్ వన్‌గానే

ప్రీ బిజినెస్‌లోనూ నెంబర్ వన్‌గానే

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR మూవీపై ఎన్నో అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇలా అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్ల మేర వ్యాపారం జరిగింది.

5వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

5వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

ఏపీ, తెలంగాణలో RRR మూవీ 5వ రోజు కూడా రాణించింది. దీంతో నైజాంలో రూ. 6.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.36 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.51 కోట్లు, ఈస్ట్‌లో రూ. 74 లక్షలు, వెస్ట్‌లో రూ. 52 లక్షలు, గుంటూరులో రూ. 65 లక్షలు, కృష్ణాలో రూ. 70 లక్షలు, నెల్లూరులో రూ. 45 లక్షలతో.. 5వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 13.63 కోట్లు షేర్, రూ. 20.45 కోట్లు గ్రాస్‌ రాబట్టింది.

5 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు

5 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు

RRR మూవీకి 5 రోజుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 68.35 కోట్లు, సీడెడ్‌లో రూ. 34.18 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 19.32 కోట్లు, ఈస్ట్‌లో రూ. 10.41 కోట్లు, వెస్ట్‌లో రూ. 9.17 కోట్లు, గుంటూరులో రూ. 13.32 కోట్లు, కృష్ణాలో రూ. 10 కోట్లు, నెల్లూరులో రూ. 5.88 కోట్లతో కలుపుకుని రూ. 170.63 కోట్లు షేర్, రూ. 253.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

5 రోజుల్లోనే ఏపీ తెలంగాణలో RRR మూవీకి రూ. 170.63 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 24.85 కోట్లు, తమిళనాడులో రూ. 21.18 కోట్లు, కేరళలో రూ. 5.35 కోట్లు, హిందీలో రూ. 53.30 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 67.60 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల్లోనే రూ. 348.18 కోట్లు షేర్‌, రూ. 625 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

భారీ బడ్జెట్‌తో రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 5 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 348.18 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 104.82 కోట్లు వస్తే ఇది హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.

Recommended Video

RRR Movie పై Alia Bhatt హర్ట్.. అలియా ని మించిన Olivia Morris క్రేజ్| Filmibeat Telugu
రికార్డులు బ్రేక్.. తొలి సినిమా ఇదే

రికార్డులు బ్రేక్.. తొలి సినిమా ఇదే

ఆరంభంలోనే అదిరిపోయే టాక్‌ను అందుకున్న RRR మూవీ.. తాజాగా ఓవర్సీస్‌లో 10 మిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది. అలాగే, నైజాం ఏరియాలో రూ. 68.35 కోట్లు వసూలు చేసి టాలీవుడ్‌లోనే ఈ ఘనతను అందుకున్న చిత్రంగా నిలిచింది. అలాగే, హిందీలోనూ వంద కోట్ల మార్కును చేరుకుంది. అంతేకాదు, చాలా ఏరియాల్లోనూ ఆల్‌టైం రికార్డులు క్రియేట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X