RRR 5 Weeks Collections: 453 కోట్ల బిజినెస్.. 5 వారాలకే షాకింగ్‌గా.. లాభాలు ఎన్ని కోట్లో తెలిస్తే!

గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ మూవీలు కాస్త ఎక్కువగానే వస్తున్నాయి. దీనికి ఎన్నో కారణాలు ఉన్నా.. అలాంటి చిత్రాలు సక్సెస్ అవడాన్ని కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. దీంతో దర్శక నిర్మాతలు, హీరోలు కూడా ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ఇలా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ మల్టీస్టారర్ మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). విడుదలకు ముందే భారీ హైప్‌ను క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం.. ఐదు వారాల క్రితమే గ్రాండ్‌గా విడుదలైంది. అందుకు అనుగుణంగానే అత్యధిక కలెక్షన్లను రాబడుతూ వచ్చింది. ఈ ప్రయాణంలో ఎన్నో రికార్డులను కూడా నమోదు చేసుకుంది. ఈ నేపథ్యంలో RRR మూవీ 5 వారాల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

భారీ మల్టీస్టారర్‌గా వచ్చిన RRR

భారీ మల్టీస్టారర్‌గా వచ్చిన RRR

టాలీవుడ్ స్టార్లు ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో రాజమౌళి తీసిన మల్టీస్టారర్ మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). దీన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. ఇందులో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీంలుగా నటించారు.

అత్యధిక ప్రీ బిజినెస్‌తో రికార్డులు

అత్యధిక ప్రీ బిజినెస్‌తో రికార్డులు

విడుదలకు ముందే ప్రభావాన్ని చూపించి RRR మూవీ అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇక, అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్లు మేర బిజినెస్ అయింది.

35వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

35వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

35వ రోజు RRRకు రోజు ఏపీ, తెలంగాణలో కలెక్షన్లు మరింత పడిపోయాయి. దీంతో నైజాంలో రూ. 3 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1 లక్షలు, ఈస్ట్‌లో రూ. 1 లక్షలు, వెస్ట్‌లో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 60 వేలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 40 వేలతో.. 35 రోజైన గురువారం రెండు రాష్ట్రాల్లో రూ. 10 లక్షలు షేర్, రూ. 17 లక్షలు గ్రాస్‌‌ను రాబట్టింది.

5 వారాల్లో తెలుగు రాష్ట్రాల రిపోర్టు

5 వారాల్లో తెలుగు రాష్ట్రాల రిపోర్టు

RRR మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 5 వారాల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 110.79 కోట్లు, సీడెడ్‌లో రూ. 50.61 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 34.64 కోట్లు, ఈస్ట్‌లో రూ. 16.06 కోట్లు, వెస్ట్‌లో రూ. 13.15 కోట్లు, గుంటూరులో రూ. 17.98 కోట్లు, కృష్ణాలో రూ. 14.51 కోట్లు, నెల్లూరులో రూ. 9.26 కోట్లతో కలిపి రూ. 267 కోట్లు షేర్, రూ. 403.62 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ఏపీ తెలంగాణలో RRR 5 వారాల్లో రూ. 267 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 43.70 కోట్లు, తమిళనాడులో రూ. 38.12 కోట్లు, కేరళలో రూ. 10.50 కోట్లు, హిందీలో రూ. 131.45 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 9.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 101.30 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 35 రోజుల్లోనే రూ. 601.22 కోట్లు షేర్‌, రూ. 1116.70 కోట్లు గ్రాస్‌ వసూలు చేసింది.

Recommended Video

Acharya Movie Public Talk మెగా ఫ్యాన్స్ ని మెప్పించిన కొరటాల | Telugu Filmibeat
బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 5 వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 601.22 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 148.22 కోట్ల లాభాలను కూడా సొంతం చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X