RRR 6 Days Collections: మహేశ్ ఆల్‌టైం రికార్డు బ్రేక్.. 6 రోజుల్లోనే అన్ని కోట్ల టార్గెట్ ఫినీష్

తెలుగు సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌కు చిరునామాగా ఉంటూ టాప్ డైరెక్టర్‌గా వెలుగొందుతున్నారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. 'బాహుబలి' సినిమాతో టాలీవుడ్ స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసిన ఆయన.. తన దర్శకత్వ ప్రతిభతో అందరినీ మన వైపు చూసేలా చేశారు. అంతటి భారీ విజయం తర్వాత ఈ టాప్ డైరెక్టర్ RRR (రౌద్రం రణం రుధిరం) అనే సినిమాను తెరకెక్కించారు. భారీ మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. దీంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో గత వారమే విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల భారీ స్పందనను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో RRR మూవీ ఆరు రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

ఇద్దరు హీరోలతో కలిసిన జక్కన్న

ఇద్దరు హీరోలతో కలిసిన జక్కన్న

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో రాజమౌళి రూపొందించిన పాన్ ఇండియా మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు చేశారు. ఇందులో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలను పోషించారు.

ప్రీ బిజినెస్‌లోనూ నెంబర్ వన్‌గానే

ప్రీ బిజినెస్‌లోనూ నెంబర్ వన్‌గానే

టాలీవుడ్‌లోనే భారీగా వచ్చిన RRR మూవీపై ఎన్నో అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇలా అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్ల మేర బిజినెస్ జరిగింది.

6వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

6వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?


RRR మూవీ ఏపీ, తెలంగాణలో 6వ రోజు కూడా సత్తా చాటింది. దీంతో నైజాంలో రూ. 4.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.85 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 95 లక్షలు, ఈస్ట్‌లో రూ. 44 లక్షలు, వెస్ట్‌లో రూ. 33 లక్షలు, గుంటూరులో రూ. 41 లక్షలు, కృష్ణాలో రూ. 45 లక్షలు, నెల్లూరులో రూ. 31 లక్షలతో.. 6వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 9.54 కోట్లు షేర్, రూ. 14.60 కోట్లు గ్రాస్‌ రాబట్టింది.

6 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు

6 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు

RRR మూవీకి 6 రోజుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో భారీ స్పందన దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 73.15 కోట్లు, సీడెడ్‌లో రూ. 36.03 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 20.27 కోట్లు, ఈస్ట్‌లో రూ. 10.85 కోట్లు, వెస్ట్‌లో రూ. 9.50 కోట్లు, గుంటూరులో రూ. 13.73 కోట్లు, కృష్ణాలో రూ. 10.45 కోట్లు, నెల్లూరులో రూ. 6.19 కోట్లతో కలిపి రూ. 180.17 కోట్లు షేర్, రూ. 267.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

6 రోజుల్లోనే ఏపీ తెలంగాణలో RRR మూవీకి రూ. 180.17 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 26.15 కోట్లు, తమిళనాడులో రూ. 23.55 కోట్లు, కేరళలో రూ. 5.35 కోట్లు, హిందీలో రూ. 60.10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.85 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 71.20 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 6 రోజుల్లోనే రూ. 371.37 కోట్లు షేర్‌, రూ. 670 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బిగ్ మల్టీస్టారర్‌గా రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 6 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 371.37 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 81.63 కోట్లు వస్తే ఇది హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

మహేశ్ బాబు ఆల్‌టైం రికార్డు బ్రేక్

మహేశ్ బాబు ఆల్‌టైం రికార్డు బ్రేక్

రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపొందిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ రోజులు గడుస్తున్నా ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఆరో రోజు ఏపీ, తెలంగాణలో కలిపి ఏకంగా రూ. 9.54 కోట్లు వసూలు చేసింది. తద్వారా మహేశ్ సరిలేరు నీకెవ్వరు పేరిట ఉన్న రూ. 9.52 కోట్ల రికార్డును బ్రేక్ చేసింది. అలాగే, నైజాంలో టార్గెట్ ఫినీష్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X