RRR 6 Weeks Collections: 453 కోట్ల టార్గెట్.. 6 వారాల్లోనే అన్ని కోట్లు.. లాభం ఎంత వచ్చిందంటే!

'బాహుబలి' మూవీ తర్వాత తెలుగు సినిమా స్థాయి ఏ రేంజ్‌లో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంతో దర్శకుడిగా తన స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసుకున్నారు రాజమౌళి. అంతటి భారీ విజయం తర్వాత ఆయన చేసిన సినిమానే RRR (రౌద్రం రణం రుధిరం). ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించడంతో ఇది ఆరంభంలోనే అందరి దృష్టిలో పడింది. ఫలితంగా భారీ స్థాయిలో ఆదరణను దక్కించుకుని ఘన విజయాన్ని అందుకుంది. ఇలా రిలీజ్ అయినప్పటి నుంచి ప్రభావాన్ని చూపిస్తూ సత్తా చాటుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ RRR ఎంత రాబట్టింది? దీనికి లాభాలు ఎంత వచ్చాయి? అనే వివరాలు మీకోసం!

ఇద్దరు స్టార్లతో రాజమౌళి సందడి

ఇద్దరు స్టార్లతో రాజమౌళి సందడి

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన పిరియాడిక్ మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). దీన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. పిరియాడిక్ జోనర్‌లో వచ్చిన దీనిలో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలు చేశారు.

అత్యధిక ప్రీ బిజినెస్‌తో రికార్డులు

అత్యధిక ప్రీ బిజినెస్‌తో రికార్డులు


ఆరంభంలోనే భారీ అంచనాలను ఏర్పరచుకున్న RRR మూవీ.. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇక, అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

42వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

42వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

RRR మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఆరంభం నుంచే మంచి ఆదరణ దక్కుతూ వచ్చింది. అయితే, క్రమంగా ఈ సినిమా ప్రభావం తగ్గుతోంది. అలాంటిది గత వీకెండ్‌లో మళ్లీ పుంజుకుని ప్రపంచ వ్యాప్తంగా కోటి రూపాలయకు పైగానే షేర్‌ను రాబట్టింది. మళ్లీ అప్పటి నుంచి ఏపీ, తెలంగాణలో షేర్ తగ్గుతోంది. ఈ నేపథ్యంలో 42వ రోజైన గురువారం దీనికి రూ. 14 లక్షలు షేర్ వచ్చింది.

6 వారాల్లో తెలుగు రాష్ట్రాల రిపోర్టు

6 వారాల్లో తెలుగు రాష్ట్రాల రిపోర్టు

RRR మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 6 వారాల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 111.41 కోట్లు, సీడెడ్‌లో రూ. 50.88 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 34.88 కోట్లు, ఈస్ట్‌లో రూ. 16.20 కోట్లు, వెస్ట్‌లో రూ. 13.25 కోట్లు, గుంటూరులో రూ. 18.08 కోట్లు, కృష్ణాలో రూ. 14.62 కోట్లు, నెల్లూరులో రూ. 9.33 కోట్లతో కలిపి రూ. 268.65 కోట్లు షేర్, రూ. 406.45 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ఆంధ్రా, తెలంగాణలో RRR 6 వారాల్లో రూ. 268.65 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 44.18 కోట్లు, తమిళనాడులో రూ. 38.42 కోట్లు, కేరళలో రూ. 10.62 కోట్లు, హిందీలో రూ. 132.80 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 9.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 101.96 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 6 వారాల్లోనే రూ. 605.78 కోట్లు షేర్‌, రూ. 1127 కోట్లు గ్రాస్‌ వసూలు చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?


భారీ మల్టీస్టారర్‌గా రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 6 వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 605.78 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 152.78 కోట్ల లాభాలను కూడా సొంతం చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X