RRR 9 Days Collections: ఒక్కరోజే బాహుబలికి 3 రెట్లు.. 453 కోట్లకు అమ్మితే.. 9 రోజుల్లోనే రికార్డు
తెలుగు సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌కు చిరునామాగా ఉంటూ నెంబర్ వన్ డైరెక్టర్‌గా వెలుగొందుతున్నారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. కెరీర్ ఆరంభం నుంచీ టాలీవుడ్ చిత్రాలకే పరిమితం అయిన ఆయన.. బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు. అదే సమయంలో తెలుగు సినిమా స్థాయిని కూడా విశ్వవ్యాప్తం చేసేశారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఆయన RRR (రౌద్రం రణం రుధిరం) అనే సినిమాను తెరకెక్కించారు.
ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. దీంతో దీనిపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీకి ప్రేక్షకుల భారీ స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో RRR సినిమా 8 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

ఇద్దరు స్టార్లను ఏకం చేసిన జక్కన్న
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో రాజమౌళి రూపొందించిన సినిమానే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ మల్టీస్టారర్ మూవీకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. ఇందులో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రల్లో కనిపించి అలరించారు.

ప్రీ బిజినెస్‌లోనూ నెంబర్ వన్‌గానే
ఎన్నో అంచనాలతో రూపొందిన RRR మూవీపై ఎన్నో అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇలా అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్ల మేర బిజినెస్ జరిగిందని తెలిసింది.

9వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
RRR మూవీ ఏపీ, తెలంగాణలో 9వ రోజు చరిత్ర సృష్టించింది. దీంతో నైజాంలో రూ. 8.57 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.35 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.85 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.22 కోట్లు, వెస్ట్‌లో రూ. 92 లక్షలు, గుంటూరులో రూ. 1.03 కోట్లు, కృష్ణాలో రూ. 1.03 కోట్లు, నెల్లూరులో రూ. 65 లక్షలతో.. 9వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 19.62 కోట్లు షేర్, రూ. 30.55 కోట్లు గ్రాస్ రాబట్టింది.

9 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు
RRR మూవీకి 9 రోజుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో భారీ స్పందన దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 91.10 కోట్లు, సీడెడ్‌లో రూ. 41.98 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 24.60 కోట్లు, ఈస్ట్‌లో రూ. 12.89 కోట్లు, వెస్ట్‌లో రూ. 11 కోట్లు, గుంటూరులో రూ. 15.46 కోట్లు, కృష్ణాలో రూ. 12.17 కోట్లు, నెల్లూరులో రూ. 7.40 కోట్లతో కలిపి రూ. 215.60 కోట్లు షేర్, రూ. 323.05 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
9 రోజుల్లోనే ఏపీ తెలంగాణలో RRR మూవీకి రూ. 215.60 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 32.05 కోట్లు, తమిళనాడులో రూ. 30.10 కోట్లు, కేరళలో రూ. 8.95 కోట్లు, హిందీలో రూ. 80.10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 79.50 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 9 రోజుల్లోనే రూ. 452 కోట్లు షేర్, రూ. 820 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
భారీ బడ్జెట్‌తో రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 9 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 452 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 1 కోటి వస్తే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

బాహుబలికి మూడు రెట్లు వసూళ్లు
RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి తొమ్మిదో రోజైన శనివారం భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. రెండు రాష్ట్రాల్లో కలిసి ఆరోజు ఏకంగా రూ. 19.62 కోట్లు వచ్చాయి. బాహుబలికి మాత్రం కేవలం రూ. 6.51 కోట్లు మాత్రమే వచ్చాయి. అంతేకాదు, ఇప్పటి వరకూ ఈ సినిమా ఏపీ, తెలంగాణలో కలిపి రూ. 200 కోట్ల షేర్, రూ. 300 కోట్లు గ్రాస్ మార్కును కూడా దాటేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.


Click it and Unblock the Notifications











