RRR 7 Days Collections: 6 రోజుల్లోనే బాహుబలి చరిత్ర మటాష్.. అక్కడ నెంబర్ వన్ మూవీగా రికార్డు
కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోన్న పేర్లలో RRR (రౌద్రం రణం రుధిరం) ఒకటి. దీనికి కారణం ఈ సినిమాను దేశమే మెచ్చిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడంతో పాటు ఇందులో ఇద్దరు బడా హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించడమే. దీంతో ఆరంభంలోనే ఈ సినిమా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా భారీ స్థాయిలో అంచనాలను కూడా ఏర్పరచుకుంది. అలా ఎంతో హైప్‌తో గత వారమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందరి నమ్మకాలను నిలబెడుతూ భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా RRR మూవీ ఓ గొప్ప రికార్డును నమోదు చేసింది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

స్టార్ హీరోలతో కలిసి స్టార్ డైరెక్టర్
దర్శకధీరుడు రాజమౌళి రూపకల్పనలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమానే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు నటించారు. ఇక, ఈ సినిమాలో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలను పోషించారు.

వీకెండే కాదు.. ఆ తర్వాత కూడా
క్రేజీ కాంబోలో ప్రతిష్టాత్మకంగా వచ్చిన RRR (రౌద్రం రణం రుధిరం) గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఓవర్సీస్‌లో సహా చాలా ప్రాంతాల్లో దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది. అదే సమయంలో థియేటర్లన్నీ ప్రేక్షకుల రాకతో సందడిగా మారాయి. వీక్ డేస్‌లో దీని ప్రభావం తగ్గుతుందని అంతా అనుకున్నారు. కానీ, దానికి భిన్నంగా వారాల్లోనూ ఇది ప్రభావాన్ని చూపించింది.

వారం రోజుల్లో 710 కోట్లతో హవా
రిలీజ్‌కు ముందు నుంచే భారీ బజ్‌ను ఏర్పరచుకుని RRR (రౌద్రం రణం రుధిరం) గ్రాండ్‌గా విడుదలైంది. ఇది అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. ఫలితంగా ఈ మూవీకి కలెక్షన్లు పోటెత్తాయి. వారం రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 392.45 కోట్లు షేర్‌తో పాటు రూ. 710 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసి హవా చూపించింది.

రికార్డులను బద్దలు కొడుతోంది
అభిమానులతో పాటు చిత్ర యూనిట్ పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి ఆరంభం నుంచే భారీ స్పందన దక్కుతోంది. అందుకే అటు ఓవర్సీస్ నుంచి ఇటు ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లోనూ కలెక్షన్లు భారీగా వచ్చాయి. దీంతో ఎన్నో కొత్త రికార్డులు నమోదయ్యాయి. ముఖ్యంగా తెలుగులోనూ చాలా పట్టణాల్లో ఆల్‌టైం రికార్డులు వచ్చాయి.

టార్గెట్ ఫినీష్ చేసేసిన సినిమా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ప్రాంతాలతో పోలిస్తే RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి సీడెడ్‌లో కలెక్షన్లు మరింత ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ఏడు రోజుల్లోనే ఈ సినిమా అక్కడ ఏకంగా రూ. 37.28 కోట్లు పైగా షేర్‌ను రాబట్టింది. తద్వారా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను దాటేసింది. అదే సమయంలో ఎన్నో మరపురాని రికార్డులను కూడా క్రియేట్ చేసి సత్తా నిరూపించుకుంది.

6 రోజుల్లో బాహుబలి రికార్డ్ బ్రేక్
రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి సీడెడ్‌లో ఆదరణ భారీ స్థాయిలో దక్కుతోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రం ఆరు రోజుల్లో అక్కడ ఏకంగా రూ. 36.03 కోట్లు వసూలు చేసింది. తద్వారా బాహుబలి (34.75 కోట్లు) రికార్డు బ్రేక్ చేసింది. అంటే ఈ సినిమా మొత్తం కలెక్షన్లను RRR ఆరు రోజుల్లోనే దాటేసి రికార్డు నమోదు చేసింది.
Recommended Video


సీడెడ్‌లో ఏ సినిమా ఎక్కడుంది
సీడెడ్ ఏరియాలో ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసిన చిత్రాల్లో RRR మొదటి స్థానంలో, బాహుబలి 2 రెండో స్థానంలో ఉన్నాయి. ఇక, బాహుబలి 1 రూ. 21.08 కోట్లు, సైరా: నరసింహారెడ్డి రూ. 19.11 కోట్లు, అల.. వైకుంఠపురములో రూ. 18.27 కోట్లతో టాప్ 5లో కొనసాగుతున్నాయి. వీటి తర్వాత రంగస్థలం, అరవింద సమేత, అఖండ, సరిలేరు నీకెవ్వరు, ఖైదీ నెంబర్ 150 ఉన్నాయి.


Click it and Unblock the Notifications











