RRR Collections: సినీ చరిత్రలో మరో గొప్ప రికార్డు.. బన్నీ, పవన్ కలిసినా రానన్ని కోట్లు

పేరుకు తెలుగు సినిమానే అయినా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లతో పాటు సినీ ప్రియుల అందరి దృష్టినీ ఆకర్షించింది RRR (రౌద్రం రణం రుధిరం). దీనికి కారణం ఈ చిత్రాన్ని జగమే మెచ్చిన దర్శకుడు రాజమౌళి తెరకెక్కించడమే. అంతేకాదు, ఇందులో టాలీవుడ్‌నే ఏలుతున్న ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించడమే.

అందుకే ఈ మూవీ ఆరంభం నుంచే భారీగా హైలైట్ అవుతూ వచ్చింది. దీంతో రికార్డు స్థాయిలో బిజినెస్‌ను కూడా జరుపుకుంది. ఇలా ఎన్నో అంచనాలతో శుక్రవారమే ఇది విడుదలైంది. ఈ నేపథ్యంలో రెండో రోజు RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ మరో గొప్ప రికార్డును క్రియేట్ చేసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

 ఇద్దరు స్టార్లతో రాజమౌళి మ్యాజిక్

ఇద్దరు స్టార్లతో రాజమౌళి మ్యాజిక్

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్లుగా హవా చూపిస్తోన్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు చేశారు. ఇందులో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రల్లో నటించారు.

 భారీ రెస్పాన్స్‌తో.. మరింత బూస్ట్

భారీ రెస్పాన్స్‌తో.. మరింత బూస్ట్

భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా వచ్చిన RRR (రౌద్రం రణం రుధిరం) శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఓవర్సీస్‌లో సహా చాలా ప్రాంతాల్లో దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది. అదే సమయంలో థియేటర్లన్నీ ప్రేక్షకుల రాకతో సందడిగా మారాయి. దీంతో అన్ని చోట్లా పండుగ వాతావరణం నెలకొంది. అలాగే, రివ్యూలు కూడా ఈ సినిమాకు మరింత బూస్ట్‌ను అందించాయి.

కలెక్షన్ల వర్షం.. మొదటి రోజే 200

కలెక్షన్ల వర్షం.. మొదటి రోజే 200

రిలీజ్‌కు ముందే అంచనాలను ఏర్పరచుకుని.. భారీ బిజినెస్‌తో RRR (రౌద్రం రణం రుధిరం) గ్రాండ్‌గా విడుదలైంది. ఇది అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. ఫలితంగా ఈ మూవీకి కలెక్షన్లు పోటెత్తాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 70 కోట్లు పైగానే షేర్‌ను రాబట్టిన ఈ చిత్రం.. ఓవరాల్‌గా మొదటి రోజే రూ. 135 కోట్లకు పైగా షేర్‌ను, రూ. 220 కోట్లకు పైగా గ్రాస్‌ రాబట్టింది.

ప్రపంచంలోని రికార్డులన్నీ బ్రేక్

ప్రపంచంలోని రికార్డులన్నీ బ్రేక్

అంచనాలకు తగ్గట్లుగానే RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి ఆరంభం నుంచే భారీ స్పందన దక్కుతోంది. అందుకే అటు ఓవర్సీస్ నుంచి ఇటు ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లోనూ కలెక్షన్లు పోటెత్తాయి. దీంతో ఎన్నో కొత్త రికార్డులు నమోదయ్యాయి. మరీ ముఖ్యంగా తెలుగులోనూ దాదాపు అన్ని పట్టణాల్లో ఆల్‌టైం రికార్డులు వచ్చాయి. ఫలితంగా RRR హవా స్పష్టంగా కనిపిస్తోంది.

నైజాంలో హవా.. నగరంలో రచ్చ

నైజాంలో హవా.. నగరంలో రచ్చ

అన్ని ప్రాంతాలతో పోల్చుకుంటే RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి నైజాం ఏరియాలో భారీ కలెక్షన్లు వస్తున్నాయి. మొదటి రోజు ఈ సినిమా అక్కడ ఏకంగా రూ. 23 కోట్లకు పైగా షేర్‌ను వసూలు చేసింది. తద్వారా తెలుగులోనే టాప్ ప్లేస్‌కు చేరుకుంది. అలాగే, హైదరాబాద్‌లోని థియేటర్లు అన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో కనిపిస్తున్నాయి. దీంతో నగరంలో RRR రచ్చ కనిపిస్తోంది.

 సినీ చరిత్రలో మరో గొప్ప రికార్డు

సినీ చరిత్రలో మరో గొప్ప రికార్డు

స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికలో వచ్చిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ నిత్యం ఏదో ఒక రికార్డును క్రియేట్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే రెండో రోజు మరో గొప్ప ఘనతను అందుకుంది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఈ సినిమా రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఏకంగా రూ. 9.90 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుని సరికొత్త చరిత్రను నమోదు చేసుకుంది.

పుష్ప, బాహుబలి కలిసినా అంతే

పుష్ప, బాహుబలి కలిసినా అంతే

రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఎక్కువ గ్రాస్ వసూలు చేసిన చిత్రాల జాబితాలో ఇప్పటి వరకూ పుష్ప (4.60 కోట్లు) మొదటి స్థానంలో ఉండేది. ఇప్పుడు దాన్ని భారీ తేడాతో RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ దాటేసింది. ఈ జాబితాలో భీమ్లా నాయక్ (4.29 కోట్లు) రెండో స్థానంలో ఉంది. అంటే ఈ రెండు సినిమాలు కలిసినా రానన్ని కోట్లను RRR వసూలు చేయడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X