RRR 3rd Day Collection: తెలుగులో మరో సంచలన రికార్డు.. ప్రభాస్, బన్నీ, పవన్‌ను వెనక్కి నెట్టిస్తూ!

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రాల్లో RRR (రౌద్రం రణం రుధిరం) ఒకటి. దీనికి కారణం ఈ చిత్రాన్ని ఇండియాలోనే టాప్ డైరెక్టర్‌గా వెలుగొందుతోన్న దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించడంతో పాటు ఇందులో టాలీవుడ్‌లోని టాప్ హీరోలు ఇద్దరు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించడమే. దీంతో దీనికి గ్రాండ్‌నెస్ భారీ స్థాయిలో పెరిగిపోయింది. అంతేకాదు, ఆరంభంలోనే అంచనాలు కూడా తారాస్థాయికి చేరాయి. ఇలా బోలెడంత బజ్‌తో గత శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే, భారీ రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఈ నేపథ్యంలో మూడో రోజు RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ మరో ఘనతను సొంతం చేసుకుంది. ఆ వివరాలు మీకోసం!

బడా మల్టీస్టారర్‌తో రచ్చ రచ్చ

బడా మల్టీస్టారర్‌తో రచ్చ రచ్చ

దిగ్గజ దర్శకుడు రాజమౌళి రూపకల్పనలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు చేశారు. ఇక, ఈ సినిమాలో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలను పోషించి మెప్పించారు.

భారీ స్పందన.. అంతా సందడి

భారీ స్పందన.. అంతా సందడి

క్రేజీ కాంబోలో ప్రతిష్టాత్మకంగా వచ్చిన RRR (రౌద్రం రణం రుధిరం) శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఓవర్సీస్‌లో సహా చాలా ప్రాంతాల్లో దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది. అదే సమయంలో థియేటర్లన్నీ ప్రేక్షకుల రాకతో సందడిగా మారాయి. దీంతో అన్ని చోట్లా పండుగ వాతావరణం నెలకొంది. దీంతో ఫస్ట్ వీకెండ్ అంతా ఈ సినిమా పేరు తప్ప మరొకటి వినిపించలేదు.

2 రోజుల్లో రూ 350 కోట్లతో హవా

2 రోజుల్లో రూ 350 కోట్లతో హవా

ఆరంభం నుంచే భారీ బజ్‌ను ఏర్పరచుకుని RRR (రౌద్రం రణం రుధిరం) ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది. ఇది అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. ఫలితంగా ఈ మూవీకి కలెక్షన్లు పోటెత్తాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 70 కోట్లు పైగానే షేర్‌ను రాబట్టిన ఈ చిత్రం.. ఓవరాల్‌గా మొదటి రోజే రూ. 200 కోట్లకు పైగా షేర్‌ను, రూ. 350 కోట్లకు పైగా గ్రాస్‌ వసూలు చేసింది.

రికార్డులపై దండయాత్ర చేస్తూ

రికార్డులపై దండయాత్ర చేస్తూ

చిత్ర యూనిట్‌తో పాటు ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకాలను నిజం చేస్తూ RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి ఆరంభం నుంచే భారీ స్పందన దక్కుతోంది. అందుకే అటు ఓవర్సీస్ నుంచి ఇటు ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లోనూ కలెక్షన్లు పోటెత్తాయి. దీంతో ఎన్నో కొత్త రికార్డులు నమోదయ్యాయి. మరీ ముఖ్యంగా తెలుగులోనూ దాదాపు అన్ని పట్టణాల్లో ఆల్‌టైం రికార్డులు వచ్చాయి.

ఆ ఏరియాలో ఎక్కువ రాణిస్తూ

ఆ ఏరియాలో ఎక్కువ రాణిస్తూ

మిగిలిన ఏరియాలతో పోల్చుకుంటే RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి నైజాంలో కలెక్షన్లు మరింత ఎక్కువగా వస్తున్నాయి. రెండు రోజుల్లోనే ఈ సినిమా అక్కడ ఏకంగా రూ. 38 కోట్లకు పైగా షేర్‌ను రాబట్టింది. తద్వారా తెలుగులోనే టాప్ ప్లేస్‌కు చేరుకుంది. అలాగే, హైదరాబాద్‌లోని థియేటర్లు అన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో కనిపిస్తున్నాయి. దీంతో నగరంలో RRR హవా చూపుతోంది.

మరో సంచలన రికార్డు కొట్టేసి

మరో సంచలన రికార్డు కొట్టేసి

ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికలో వచ్చిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ రోజులోనే లెక్కలేనన్ని రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మూడో రోజు మరో గొప్ప ఘనతను సొంతం చేసుకుంది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఈ సినిమా మూడో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఏకంగా రూ. 9.57 కోట్ల గ్రాస్‌ను రాబట్టి మరో సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది.

Recommended Video

Kollywood Directors కి తలనొప్పిగా మారిన Rajamouli | RRR Movie | Filmibeat Telugu
బన్నీ, పవన్, ప్రభాస్‌ వెనక్కే

బన్నీ, పవన్, ప్రభాస్‌ వెనక్కే


మూడో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఎక్కువ గ్రాస్ వసూలు చేసిన చిత్రాల జాబితాలో ఇప్పటి వరకూ పుష్ప (4.10 కోట్లు) మొదటి స్థానంలో ఉండేది. ఇప్పుడు దాన్ని భారీ తేడాతో RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ దాటేసింది. ఈ జాబితాలో భీమ్లా నాయక్ (3.80 కోట్లు) రెండో స్థానంలో, రాధే శ్యామ్ (3.10 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దీంతో RRR హవా స్పష్టంగా కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X