RRR US Collections: బాహుబలితో పాటు ఆ రికార్డులన్నీ బ్రేక్.. అన్ని కోట్లతో ఇండియాలోనే టాప్ మూవీగా ఘనత
ప్రపంచమే మెచ్చిన దర్శకుడు.. సుదీర్ఘ కాలంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోన్న ఇద్దరు బడా హీరోలు.. ఖర్చు ఏమాత్రం వెనుకాడని నిర్మాత.. వందకు వంద శాతం శ్రమించే టెక్నీషియన్లు.. వీళ్లందరి కలయికలో వచ్చిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ సిరీస్ తర్వాత రాజమౌళి రూపొందిన ఈ సినిమా బడా మల్టీస్టారర్‌గా వచ్చింది. దీంతో దీనిపై ఆరంభం నుంచే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనిక అన్ని ఏరియాల్లో భారీ స్పందన దక్కింది. దీంతో కలెక్షన్లు కూడా పోటెత్తాయి. ఈ క్రమంలోనే తాజాగా RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ మరో గొప్ప రికార్డును నమోదు చేసింది. ఆ వివరాలు మీకోసం!

క్రేజీ కాంబోలో భారీ మల్టీస్టారర్
టాలీవుడ్‌లో స్టార్లుగా వెలుగొందుతోన్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు చేశారు. ఇందులో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలు పోషించారు.

రెస్పాన్స్‌తో... పండగ సందడి
ఇద్దరు బడా హీరోల కలయికలో వచ్చిన RRR (రౌద్రం రణం రుధిరం) ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఓవర్సీస్‌లో సహా చాలా ప్రాంతాల్లో దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది. అదే సమయంలో థియేటర్లన్నీ ప్రేక్షకుల రాకతో సందడిగా మారాయి. దీంతో అన్ని చోట్లా పండుగ వాతావరణం నెలకొంది. అలాగే, రివ్యూలు కూడా ఈ సినిమాకు మరింత బూస్ట్‌ను ఇచ్చాయి.

అక్కడ మరింత ఎక్కువగానే
మిగిలిన ఏరియాలతో పోల్చుకుంటే ఓవర్సీస్‌లో RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ సందడి మరింత ముందు నుంచే ప్రారంభం అయింది. అక్కడ ఈ చిత్రానికి సంబంధించిన బుకింగ్స్ ముందుగానే ఓపెన్ అయ్యాయి. దీనికితోడు ఎన్టీఆర్, చరణ్ అభిమానులు విచిత్రమైన కార్యక్రమాలతో సందడి చేశారు. దీంతో ఎన్నారైలకు కూడా ఈ సినిమా బాగా చేరువ అయిపోయింది.

విడుదలకు ముందే ఆ మార్క్
ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఓవర్సీస్‌లో RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ బుకింగ్స్ ముందుగానే ప్రారంభం అయ్యాయి. అక్కడ ప్రీమియర్స్ సహా మొదటి రోజు టికెట్లు కూడా ఎప్పుడో బుక్ అయిపోయాయి. దీంతో విడుదలకు ముందే ఇది దాదాపు 3 మిలియన్ డాలర్ల మార్కును కూడా చేరుకుంది. దీంతో ఈ సినిమా పేరిట ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ అయిపోయాయి.

రెండూ కలిపి 5 మిలియన్స్
ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ ద్వారానే దాదాపు 3 మిలియన్ డాలర్లకు పైగానే వసూలు చేసిన ఈ సినిమా.. మొదటి రోజు కూడా అదిరిపోయే స్పందనను సొంతం చేసుకుంది. ఫలితంగా ఒక మిలియన్ డాలర్లకు పైగానే కలెక్షన్లను రాబట్టింది. దీంతో మొత్తంగా ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలుపుకుని 5 మిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది. ఇదే సందడి రెండో రోజూ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారత కరెన్సీ ప్రకారం ఇలా
RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి ఓవరాల్‌గా చూసుకుంటే ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ ప్లస్ మొదటి రోజు 5.3 మిలియన్ డాలర్లను వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే.. భారత కరెన్సీ ప్రకారం.. దీనికి అప్పుడే రూ. 41 కోట్ల గ్రాస్ దక్కింది. ఇది ఇండియన్ సినీ చరిత్రలోనే టాప్ కలెక్షన్స్ అని తెలుస్తోంది. దీంతో RRR (రౌద్రం రణం రుధిరం) అప్పుడే భారీ రికార్డును నమోదు చేసుకుంది.

బాహుబలికి చాలా దూరంలో
గతంలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి 2' మూవీ ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలుపుకుని 4.55 మిలియన్ డార్లను వసూలు చేసింది. అప్పటి లెక్కల ప్రకారం.. భారత కరెన్సీలో రూ. 29 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. ఇక, రికార్డుల పరంగా చూసుకుంటే ఓవర్సీస్‌లో ఈ సినిమా RRR (రౌద్రం రణం రుధిరం)కు ఏమాత్రం దగ్గరలో కూడా లేకుండా పోయిందనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











