RRR 5 Days Collection: బాహుబలి మొత్తం కలెక్షన్లు 5 రోజుల్లోనే.. సినీ పెద్దలే షాకయ్యేలా అన్ని కోట్లు

గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా స్థాయి భారీగా పెరిగిపోయిందన్న విషయం తెలిసిందే. దీనికి కారణం కొన్నేళ్ల క్రితం విడుదలైన బాహుబలి సిరీస్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ పుణ్యమా అని మన రేంజ్ ఏంటో ప్రపంచానికి తెలిసిపోయింది. ఇక, అప్పటి నుంచి టాలీవుడ్‌లో భారీ నుంచి అతి భారీ చిత్రాలు రూపొందుతోన్నాయి. అలా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించడంతో పాటు ఇందులో ఇద్దరు బడా హీరోలు కలిసి నటించడంతో దీని రేంజ్ పెరిగిపోయింది. అందుకు అనుగుణంగానే ఇది కలెక్షన్లను కొల్లగొడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా RRR సంచలనం సృష్టించింది. ఆ వివరాలు మీకోసం!

ఇద్దరు స్టార్లతో కలిసిన రాజమౌళి

ఇద్దరు స్టార్లతో కలిసిన రాజమౌళి

దేశమే మెచ్చిన దర్శకుడు రాజమౌళి డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని ఇచ్చారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు చేశారు. ఇక, ఈ సినిమాలో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలలో నటించారు.

భారీ రెస్పాన్స్‌తో.. వీక్ డేస్‌ కూడా

భారీ రెస్పాన్స్‌తో.. వీక్ డేస్‌ కూడా

భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా వచ్చిన RRR (రౌద్రం రణం రుధిరం) గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఓవర్సీస్‌లో సహా చాలా ప్రాంతాల్లో దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది. అదే సమయంలో థియేటర్లన్నీ ప్రేక్షకుల రాకతో సందడిగా మారాయి. వీక్ డేస్‌లో దీని ప్రభావం తగ్గుతుందని అంతా అనుకున్నారు. కానీ, దానికి భిన్నంగా వారాల్లోనూ ఇది హవాను చూపిస్తోంది.

4 రోజుల్లో రూ 565 కోట్లతో హవా

4 రోజుల్లో రూ 565 కోట్లతో హవా

విడుదలకు ముందే భారీ బజ్‌ను ఏర్పరచుకుని RRR (రౌద్రం రణం రుధిరం) ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది. ఇది అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. ఫలితంగా ఈ మూవీకి కలెక్షన్లు పోటెత్తాయి. నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 317.05 కోట్లు షేర్‌‌తో పాటు రూ. 565 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసి సత్తా చాటింది.

రికార్డులపై దండయాత్ర చేస్తూ

రికార్డులపై దండయాత్ర చేస్తూ

మెగా, నందమూరి అభిమానులు పెట్టుకున్న నమ్మకాలను నిజం చేస్తూ RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి ఆరంభం నుంచే భారీ స్పందన దక్కుతోంది. అందుకే అటు ఓవర్సీస్ నుంచి ఇటు ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లోనూ కలెక్షన్లు పోటెత్తాయి. దీంతో ఎన్నో కొత్త రికార్డులు నమోదయ్యాయి. ముఖ్యంగా తెలుగులోనూ దాదాపు అన్ని పట్టణాల్లో ఆల్‌టైం రికార్డులు నమోదయ్యాయి.

ఆ ఏరియాలో ఎక్కువ రాణిస్తూ

ఆ ఏరియాలో ఎక్కువ రాణిస్తూ

ఏపీ, తెలంగాణలోని అన్ని ప్రాంతాలతో పోలిస్తే RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి నైజాంలో కలెక్షన్లు మరింత ఎక్కువగా వస్తున్నాయి. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా అక్కడ ఏకంగా రూ. 61 కోట్లు పైగా షేర్‌ను రాబట్టింది. తద్వారా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోడానికి వచ్చింది. అదే సమయంలో ఎన్నో మరపురాని రికార్డులను కూడా క్రియేట్ చేసి.. నైజాం కింగ్ అనిపించుకుంటుంది.

5 రోజుల్లో బాహుబలి రికార్డ్ బ్రేక్

5 రోజుల్లో బాహుబలి రికార్డ్ బ్రేక్


జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి నైజాంలో ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలోనే ఈ చిత్రం ఐదు రోజుల్లో అక్కడ ఏకంగా రూ. 68.35 కోట్లు వసూలు చేసింది. తద్వారా బాహుబలి (68 కోట్లు) రికార్డు బ్రేక్ చేసింది. అంటే ఈ సినిమా మొత్తం కలెక్షన్లను RRR ఐదు రోజుల్లోనే దాటేసిందన్న మాట.

ఈ జాబితాలో ఏఏ చిత్రాలంటే

ఈ జాబితాలో ఏఏ చిత్రాలంటే

నైజాం ఏరియాలో ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసిన చిత్రాల్లో RRR (రౌద్రం రణం రుధిరం) మొదటి స్థానంలో, బాహుబలి 2 రెండో స్థానంలో ఉన్నాయి. ఇక, అల.. వైకుంఠపురములో రూ. 44.88 కోట్లు, బాహుబలి 1 రూ. 43 కోట్లు, పుష్ప రూ. 40.74 కోట్లతో టాప్ 5లో కొనసాగుతున్నాయి. వీటి తర్వాత సరిలేరు నీకెవ్వరు, భీమ్లా నాయక్, సైరా, మహర్షి, సాహో సినిమాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X