RRR 9 Days Collections: దిల్ రాజుకు అన్ని కోట్ల లాభాలు.. 9 రోజుల్లోనే ఏకంగా 90 కోట్లతో సంచలనం

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). పేరుకు టాలీవుడ్ మూవీనే అయినా దేశ వ్యాప్తంగా భారీ బజ్‌ను ఏర్పరచుకుంది. దీనికి కారణం దీన్ని బాహుబలి వంటి భారీ సక్సెస్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి రూపొందించడమే. అంతేకాదు, ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు.

దీంతో ఈ సినిమా రేంజ్ భారీ స్థాయిలో పెరిగింది. ఫలితంగా విడుదలకు ముందే మంచి హైప్‌ను క్రియేట్ చేసుకుని బిజినెస్‌ను అత్యధికంగా జరుపుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ చిత్రం నైజాంలో సంచలనం సృష్టించింది. దీంతో దిల్ రాజుకు కొన్ని కోట్ల లాభాలు వచ్చాయి. ఆ లెక్కలేంటో మీరూ చూడండి!

విప్లవ వీరుల కథతో వచ్చిన RRR

విప్లవ వీరుల కథతో వచ్చిన RRR

దర్శకధీరుడు రాజమౌళి రూపకల్పనలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని ఇచ్చారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు చేశారు. ఇక, విప్లవ వీరుల కథతో వచ్చిన ఈ సినిమాలో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలు పోషించారు.

మొదటి వారం అలా.. ఇప్పుడిలా

మొదటి వారం అలా.. ఇప్పుడిలా

క్రేజీ కాంబోలో ప్రతిష్టాత్మకంగా వచ్చిన RRR (రౌద్రం రణం రుధిరం) మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్‌లో సహా చాలా ప్రాంతాల్లో దీనికి భారీ స్పందన దక్కుతోంది. మరీ ముఖ్యంగా మొదటి వారం ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. అదే కంటిన్యూ చేస్తూ రెండో వారంలోనూ సత్తా చాటుతోంది. దీంతో ఎన్నో రికార్డులు బద్దలైపోతున్నాయి.

9 రోజుల్లోనే రూ 820 కోట్ల వసూళ్లు

9 రోజుల్లోనే రూ 820 కోట్ల వసూళ్లు

ఆరంభం నుంచే భారీ అంచనాలను ఏర్పరచుకుని RRR (రౌద్రం రణం రుధిరం) ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది. ఇది అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. ఫలితంగా ఈ మూవీకి కలెక్షన్లు పోటెత్తాయి. నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 452 కోట్లు షేర్‌‌తో పాటు రూ. 820 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసి హవాను చూపించింది.

ప్రతిరోజూ రికార్డులు బద్దలు చేసి

ప్రతిరోజూ రికార్డులు బద్దలు చేసి

సినీ ప్రియులతో పాటు అభిమానులు పెట్టుకున్న నమ్మకాలను నిజం చేస్తూ RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ ఆరంభం నుంచే అదరగొట్టేస్తోంది. అందుకే అటు ఓవర్సీస్ నుంచి ఇటు ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లోనూ కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. దీంతో ఎన్నో కొత్త రికార్డులు నమోదయ్యాయి. ముఖ్యంగా తెలుగులోనూ దాదాపు అన్ని పట్టణాల్లో ఆల్‌టైం రికార్డులు వచ్చాయి.

ఆ ఏరియాలో మరింత ఎక్కువగా

ఆ ఏరియాలో మరింత ఎక్కువగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ప్రాంతాలతో పోలిస్తే RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి నైజాంలో కలెక్షన్లు మరింత ఎక్కువగా వస్తున్నాయి. 9 రోజుల్లోనే ఈ సినిమా అక్కడ ఏకంగా రూ. 91.10 కోట్లు షేర్‌ను రాబట్టింది. తద్వారా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ (70కోట్ల రూపాయలు)ను ఎప్పుడో చేరుకుంది. అదే సమయంలో ఎన్నో మరపురాని రికార్డులను కూడా క్రియేట్ చేసింది.

టాలీవుడ్‌లో నెంబర్ వన్ మూవీ

టాలీవుడ్‌లో నెంబర్ వన్ మూవీ

ఇప్పటికే నైజాం ఏరియాలో ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసిన చిత్రాల్లో RRR (రౌద్రం రణం రుధిరం) మొదటి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే ఇప్పుడు రూ. 90 కోట్ల షేర్ మార్కును కూడా దాటేసింది. తద్వారా ఈ ఘనతను అందుకున్న ఏకైక సినిమాగా ఇది చరిత్రను సృష్టించింది. ఇదే కంటిన్యూ అయితే ఒక్క ఏరియాలోనే వంద కోట్లు వసూలు చేసే అవకాశం కనిపిస్తోంది.

Recommended Video

RRR లో మల్లి..ఎవరీ చిట్టితల్లి? Twinkle Sharma లైఫ్ మలుపు తిప్పిన యాడ్ | Filmibeat Telugu
దిల్ రాజుకు అన్ని కోట్ల లాభాలు

దిల్ రాజుకు అన్ని కోట్ల లాభాలు

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రూ. 70 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ సినిమా 9 రోజుల్లోనే ఏకంగా రూ. 91.10 కోట్లు వసూలు చేసింది. దీంతో అప్పుడే ఆయన ఖాతాలోకి రూ. 21.10 కోట్ల లాభాలు వచ్చి చేరాయి. దీనిపై దిల్ రాజు పుల్ ఖుషీ అవుతున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X