RRR బాక్సాఫీస్ టార్గెట్స్.. మొదటి రోజు బ్రేక్ చేయాల్సిన రికార్డులు.. అవి మాత్రం కష్టమే..

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా దేశవ్యాప్తంగా బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ RRR కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. గత 2 ఏళ్లుగా ప్రేక్షకులను ఎంతగానో ఊరించిన ఈ సినిమా మొత్తానికి మార్చి 25 వ తేదీన భారీ స్థాయిలో విడుదల అవుతోంది. సినిమా మొదటి రోజు మొదటి షో చూడాలి అని హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే అందరికీ షాక్ ఇస్తున్నారు.

ఇక ఈ సినిమా ముందున్న మొదటిరోజు టార్గెట్స్ లలో కొన్నిటిని అయితే ఫినిష్ చేస్తుంది అని తెలుస్తోంది. ఇండస్ట్రీలోని పాత రికార్డులన్నింటినీ బ్రేక్ చేయాలి అంటే మళ్లీ రాజమౌళి తోనే సాధ్యం అవుతుంది అని మరో సారి నిరూపిస్తున్నారు. ఇక రాజమౌళి RRR సినిమా ఫస్ట్ డే ఎలాంటి రికార్డులను బ్రేక్ చేయాలి. మొదటి రోజు అనుకున్న కలెక్షన్స్ వస్తాయా లేదా అనే వివరాల్లోకి వెళితే..

భారీ పెట్టుబడితో..

భారీ పెట్టుబడితో..

RRR సినిమా లో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించడమే ఒక పెద్ద వండర్ అని చెప్పవచ్చు. నిత్యం పోటాపోటీగా తెలుగు ఇండస్ట్రీలో తలపడే మెగా నందమూరి హీరోల కలయికలో వస్తున్న సినిమా కాబట్టి సౌత్ ఇండస్ట్రీ మొత్తం లో కూడా ఈ ప్రాజెక్టు పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు రాజమౌళి ఈ సినిమా కోసం దాదాపు 500 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లుగా వివరణ ఇచ్చాడు. ఇక 450 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది.

మొదట తెలుగు స్టేట్స్ లో..

మొదట తెలుగు స్టేట్స్ లో..

మొదటి రోజు బాహుబలి 2 కి సంబంధించిన రికార్డులే మొదటి స్థానంలో ఉన్నాయి. అంటే RRR సినిమా ఆ రికార్డులను ఎంత డిస్టెన్స్ తో బ్రేక్ చేస్తుంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముందుగా తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 సినిమా 43 కోట్లతో టాప్ ఓపెనర్ గా ఉంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం RRR సినిమా ఆ రికార్డును ఈజీగా బ్రేక్ చేయవచ్చు అని తెలుస్తోంది.

సాహో రికర్ట్..

సాహో రికర్ట్..

అయితే వర్త్ షేర్ పరంగా సాహో సినిమా మొదటి స్థానంలో ఉంది. ప్రభాస్ సుజిత్ కాంబినేషన్ లో వచ్చిన ఆ సినిమా 29.27 కోట్ల షేర్ కలక్షన్స్ తో టాప్ లో ఉండగా ఇప్పుడు RRR అంతకుమించి అనేలా కలెక్షన్స్ అందుకుంటుంది అని చెప్పవచ్చు. ఒక విధంగా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో కూడా బెస్ట్ నెంబర్స్ గా త్రిబుల్ ఆర్ కలెక్షన్స్ తెలుస్తాయి అని అర్థం అవుతోంది.

టోటల్ గ్రాస్ రికార్డ్

టోటల్ గ్రాస్ రికార్డ్

ఇక మొదటి రోజు అత్యధిక షేర్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా బాహుబలి సెకండ్ పార్ట్ 123 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. అయితే ఈ రికార్డును RRR సినిమా బ్రేక్ చేస్తుందా లేదా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి 2 గ్రాస్ విషయంలో అయితే 215 కోట్ల తో మొదటి స్థానంలో ఉంది. RRR అయితే దాదాపు 150 నుంచి 170 కోట్ల కలెక్షన్స్ రాబట్టవచ్చని సమాచారం.

అక్కడ మాత్రం?

అక్కడ మాత్రం?

ఇక అమెరికాలో మాత్రం సరికొత్త రికార్డులు నమోదు అవుతాయి అని తెలుస్తోంది. అక్కడ బాహుబలి 2 సినిమా ప్రీమియర్స్ తో 2.45 మిలియన్ల డాలర్లను అందుకోగా ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా అంతకుమించి వసూళ్ళని దక్కించుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే కర్ణాటకలో బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేస్తుందా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.అక్కడ తొలిరోజు బాహుబలి2 19.60 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు RRR ఆ స్థాయిలో అందుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లుగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

హిందీలో అయితే..

హిందీలో అయితే..

కేరళ తమిళనాడులో కూడా సినిమా ఏ మేరకు కలెక్షన్స్ అందుకుంటుంది అనేది కాలమే సమాధానం చెప్పాలి. అయితే హిందీలో మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా మెరుగుపడలేదు. బాహుబలి సెకండ్ పార్ట్ కు ఉన్న హైప్ తో పోలిస్తే RRR కు అంతగా లేదు. కాబట్టి సినిమా కలెక్షన్స్ ఆ తర్వాత పెరగొచ్చు అని సమాచారం.

Recommended Video

Why RRR Bigger Than Baahubali ? RRR VS Baahubali Budget And Collections | Filmibeat Telugu
అడ్వాన్స్ బుకింగ్స్

అడ్వాన్స్ బుకింగ్స్

సినిమా అయితే పక్కా పాజిటివ్ టాక్ తో ముందుకు ఉంటుంది అని ప్రస్తుతం వైబ్రేషన్స్ చూస్తేనే అర్థమవుతుంది పైగా రాజమౌళి సినిమా కాబట్టి నెగిటివ్ టాక్ వచ్చే ఛాన్స్ అసలే ఉండదు. అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ప్రస్తుతం హైదరాబాద్లో అయితే గట్టిగానే ఉన్నాయి. అయితే బాహుబలి 2 హిందీలో అడ్వాన్స్ బుకింగ్స్ 37.2కోట్లతో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా మొదటి స్థానంలో ఉంది. మరి ఈ ఈకార్డును RRR బ్రేక్ చేస్తుందో లేదో చూడలో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X