RRR 7 Days Collections: అల్లు అర్జున్ రికార్డును బ్రేక్ చేయలేకపోయిన మల్టీస్టారర్.. కలెక్షన్స్ డౌన్!

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా బిగెస్ట్ మల్టీస్టారర్ గా తెరపైకి వచ్చిన RRR సినిమా ఎవరూ ఊహించని విధంగా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. నెంబర్ వన్ ఫ్యాన్ ఇండియా సినిమా గా RRR సినిమా సృష్టించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. అయితే మొదటి ఆరు రోజులు ఈ సినిమా మంచి కలెక్షన్స్ భారీగానే అందుకున్నప్పటికీ ఏడవ రోజు మాత్రం కొన్ని లోకల్ సినిమాల రికార్డులను బ్రేక్ చేయకపోవడం విశేషం. ముఖ్యంగా అల్లు అర్జున్ పాత సినిమాలు కూడా ఈ మల్టీ స్టారర్ సినిమా బ్రేక్ చేయలేదు. ఇక మొదటి వారం ఈ సినిమా మొత్తంగా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది అలాగే అల్లు అర్జున్ ఏ సినిమా రికార్డులు బ్రేక్ చేయలేక పోయింది అనే వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ స్థాయిని పెంచే విధంగా

టాలీవుడ్ స్థాయిని పెంచే విధంగా

రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి కలిసి నటించిన ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ పాన్ ఇండియా సినిమా మొత్తానికి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులనల్తో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా రాబోయే సినిమాలకు కూడా మరింత ధైర్యాన్ని ఇచ్చింది అనే చెప్పాలి. బాహుబలి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయి కూడా మరొక మెట్టు ఎక్కింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రాబోయే రోజుల్లో మరిన్ని వసూళ్లను అందుకుంటుంది అని చెప్పవచ్చు

ప్రీ రిలీజ్ బిజినెస్

ప్రీ రిలీజ్ బిజినెస్

ఇక RRR సినిమాను ఎనౌన్స్ చేసినప్పుటి నుంచి భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసేందుకు చాలామంది బయ్యర్లు ఎగబడ్డారు అనే చెప్పాలి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి బిజినెస్ చేసింది. అంతేకాకుండా హిందీ లో కూడా మంచి బిజినెస్ చేయడంతో నిర్మాత దాదాపు సేఫ్ అయ్యాడు.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ చేయగా.. మిగతా భాషల్లో మొత్తం భారీ రేటు పలికింది. ప్రపంచవ్యాప్తంగా సినిమా రూ. 451 కోట్ల మేర బిజినెస్ జరిగింది.

7వ రోజు వచ్చిన కలెక్షన్స్

7వ రోజు వచ్చిన కలెక్షన్స్


RRR సినిమా 7 ఎవ రోజు ఏపీ, తెలంగాణలో మంచి వసూళ్లనే అందుకుంది. ఏరియాల వారిగా కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 4.07 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.25 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 70 లక్షలు, ఈస్ట్‌లో రూ. 31 లక్షలు, వెస్ట్‌లో రూ. 26 లక్షలు, గుంటూరులో రూ. 30 లక్షలు, కృష్ణాలో రూ. 33 లక్షలు, నెల్లూరులో రూ. 26 లక్షలతో.. 7వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 7.48 కోట్లు షేర్, రూ. 11.80 కోట్లు గ్రాస్‌ రాబట్టింది.

7 రోజుల్లో ఏపీ తెలంగాణ కలెక్షన్స్

7 రోజుల్లో ఏపీ తెలంగాణ కలెక్షన్స్

టోటల్ గా RRR సినిమాకి 7 రోజుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 77.22 కోట్లు, సీడెడ్‌లో రూ. 37.28 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 20.97 కోట్లు, ఈస్ట్‌లో రూ. 11.16 కోట్లు, వెస్ట్‌లో రూ. 9.76 కోట్లు, గుంటూరులో రూ. 14.03 కోట్లు, కృష్ణాలో రూ. 10.78 కోట్లు, నెల్లూరులో రూ. 6.45 కోట్లతో కలిపి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో టోటల్ గా రూ. 187.65 కోట్లు షేర్, రూ. 279.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా..

RRR సినిమాకు 7 రోజుల్లో రూ. 187.65 కోట్లు షేర్ వచ్చింది. ఇక కర్నాటకలో రూ. 27.75 కోట్లు, తమిళనాడులో రూ. 25.55 కోట్లు, కేరళలో రూ. 7.60 కోట్లు, హిందీలో రూ. 65.60 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 73.45 కోట్లతో వరల్డ్ వైడ్ గక్ మొదటి వారంలో సినిమా రూ. 392.45 కోట్లు షేర్‌, రూ. 710 కోట్లు గ్రాస్‌ను అందుకుంది.

ప్రాఫిట్స్ లోకి రావాలి అంటే..

ప్రాఫిట్స్ లోకి రావాలి అంటే..

ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ చేసిన RRR సినిమా రూ. 453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో మార్కెట్ లో విడుదలైంది. ఇక, ఈ సినిమా మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా రూ. 392.45 కోట్లు వసూలు సాధించింది. ఇక బాక్సాఫీస్ వద్ద ప్రాఫిట్స్ లోకి రావాలి అంటే మరో 60.55 కోట్ల వరకు షేర్ ను సాధించాల్సి ఉంది. మరి ఆ టార్గెట్ ను ఇంకా ఎన్ని రోజుల్లో సాధిస్తుందో చూడాలి.

Recommended Video

RRR లో మల్లి..ఎవరీ చిట్టితల్లి? Twinkle Sharma లైఫ్ మలుపు తిప్పిన యాడ్ | Filmibeat Telugu
బన్నీ మహేష్ సినిమాల కంటే తక్కువగా..

బన్నీ మహేష్ సినిమాల కంటే తక్కువగా..


ఇక RRR సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రతీ రోజు కూడా ఆల్ టైమ్ రికార్డు దిశగా కొనసాగింది. 6 రోజుల వరకు కూడా ఏపీ తెలంగాణలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా RRR రికార్డును అందుకుంది. కానీ 7వ రోజు మాత్రం అల్లు అర్జున్ సినిమా కంటే తక్కువ వసూళ్లు రావడం విశేషం. అల్లు అర్జున్ అల.. వైకుంఠపురములో సినిమా 7వ రోజు రూ.8.43కోట్ల షేర్ ను అందుకుంది. ఇక ఆ తరువాత బాహుబలి 2 రూ.8.30 కోట్లు, సై రా రూ.7.90కోట్లు, సరిలేరు నీకెవ్వరు రూ.7.64కోట్ల షేర్ తో 7వ రోజు అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాలుగా కొనసాగుతున్నాయి. ఇక RRR సినిమా తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజు రూ.7.48కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి 5వ స్థానంలో నిలిచింది. అయితే 7 రోజుల్లో టోటల్ కలెక్షన్ల విషయంలో మాత్రం RRR రూ.187 కోట్లతో టాప్ లో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X