RRR Japan Collections: సాహో రికార్డును అందుకోలేకపోతున్న RRR.. పాత సినిమాల కంటే తక్కువే!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, నందమూరి స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన RRR ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఓటిటి ద్వారా ఈ సినిమాకు విదేశాల్లో కూడా మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా హాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు. ఇక జపాన్లో కూడా ఇటీవల సినిమాను భారీ స్థాయిలో విడుదల చేశారు. అక్కడ దర్శకుడు హీరోలు ఇద్దరు కూడా గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ కూడా చేశారు. ఇక జపాన్లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే..

జపాన్ లో ప్రమోషన్స్
జపాన్ లో మొత్తానికి RRR సినిమా ఊహించినట్లుగానే గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు రాజమౌళి అక్కడ కూడా రెగ్యులర్ సినిమాల తరహాలో ప్రమోషన్స్ చేయడం విశేషం. అందుకోసం ప్రత్యేకంగా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్లడం హాట్ టాపిక్ గా నిలిచింది. వారి ఫ్యామిలీ కూడా అక్కడ ఆడియన్స్ ని ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది.

వారం రోజుల కలెక్షన్స్
ఇక జపాన్లో RRR సినిమా మొదటిరోజు మంచి ఓపెనింగ్ అందుకుంది. ఆ తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్ లోనే మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు దాదాపు వారం రోజులకు ఈ సినిమా పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకోవచ్చినట్లు సమాచారం. కలెక్షన్స్ అయితే బాగానే అందుకుంటుంది. కానీ గత సినిమాల రికార్డులను మాత్రం RRR పూర్తిస్థాయిలో బ్రేక్ చేయలేకపోతున్నట్లుగా తెలుస్తోంది. వారం రోజుల్లో ఈ సినిమా 73M జపనీస్ యెన్ లను అందుకున్నట్లు తెలుస్తోంది.

టాప్ లో రజినీకాంత్
ఇప్పటివరకు జపాన్లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న ఇండియన్ సినిమాల వివరాలలోకి వెళితే.. టాప్ లిస్టులో అయితే రజనీకాంత్ ముత్తు సినిమానే కొనసాగుతోంది. 27 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా జపాన్లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అత్యధికంగా జపాన్లో కలెక్షన్స్ అందుకున్న ఇండియన్ సినిమా గా నిలిచింది. దాదాపు 400M జపనీస్ యెన్ లను సొంతం చేసుకుంది.

టాప్ 5లో ఆ సినిమాలు
టాప్ 5లో రజనీకాంత్ మొదటి స్థానంలో ఉండగా జపాన్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో బాహుబలి రెండవ స్థానంలో నిలిచింది ఈ సినిమా జపాన్లో 300M జపనీస్ యెన్ లను సొంతం చేసుకుంది. ఇక బాలీవుడ్ నుంచి అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాగా 3 ఇడియట్స్ నిలిచింది. ఈ సినిమా 170M జపనీస్ యెన్ ల వసూళ్లను సాధించింది. ఇక శ్రీదేవి ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా 130 మిలియన్ల కలెక్షన్స్ సొంతం చేసుకొని 4 స్థానంలో నిలిచింది.

సాహో తరువాతే RRR
టాప్ 5 లిస్టులో 5 వ స్థానంలో ప్రభాస్ నటించిన సాహో సినిమా జపాన్లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. సాహో సినిమాకు డీసెంట్ టాక్ వచ్చినప్పటికీ కూడా జపాన్లో 110 మిలియన్ల కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు RRR సినిమా 73 మిలియన్ల జపనీస్ యెన్ ల కలెక్షన్స్ సొంతం చేసుకోవడం విశేషం. ప్రస్తుతం కలెక్షన్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. మరి వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సోమవారం నుంచి ఎలాంటి వసూళ్ళను అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











