RRR: పరాయి దేశంలో ఇప్పటికి స్టన్ అయ్యేలా కలెక్షన్స్.. తలైవా రికార్డ్ బ్రేక్ చేయడం పక్కా..

దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా అనంతరం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకు వచ్చిన ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ RRR బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించగా, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు ఓటీటీ లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా హాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. ఇక ఇటీవల సినిమాను జపాన్ దేశంలో కూడా గ్రాండ్ గా విడుదల చేశారు.

అక్కడ ప్రమోషన్స్ కోసం కూడా చిత్ర యూనిట్ సబ్యులు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక RRR సినిమాకు మొదట డీసెంట్ టాక్ రావడంతో అక్కడ మెల్లగా కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి. మొదట 8 రోజుల్లో 81.3M జపాన్ కరెన్సీని అందుకున్న ఈ ఇండియన్ సినిమా ఆ తరువాత రెండో వీక్ లో కూడా అదే రేంజ్ లో ¥72.2 మిలియన్స్ ను సొంతం చేసుకుంది.

RRR movie japan box office collection and expected full run numbers

ఇక మూడవ వారం ¥65.4 మిలియన్స్, నాలుగవ వారం ¥45 మిలియన్స్ ను అందుకుంది. ఇక 5వ వారం ¥50 మిలియన్స్ ను రాబట్టింది. 6వ వారం కూడా ¥48 మిలియన్స్ వచ్చాయి. టోటల్ గా 6 వారాల్లో జపాన్ లో ఈ సినిమా ¥362 మిలియన్స్ సొంతం చేసుకుంది. ఇక ఇలానే మరో రెండు మూడు వారాలు కొనసాగితే సినిమా తప్పకుండా ఫుల్ రన్ లో ¥500 మిలియన్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది.

ఇక 1995 లో వచ్చిన రజనీకాంత్ ముత్తు సినిమా జపాన్ లో అత్యధికంగా ¥400 మిలియన్స్ ను రాబట్టిన తొలి భారతీయ చిత్రంగా మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇక ఇప్పుడు RRR సినిమా ఆ రేంజ్ లో వసూళ్ళను అందుకుంటే బిగ్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న మరో ఇండియన్ ఫిల్మ్ గా రికార్డుల్లోకి రానుంది. ప్రస్తుతం హడావుడి చూస్తుంటే RRR సినిమాకు మంచి క్రేజ్ దక్కుతోంది అని చెప్పవచ్చు. ఇక దర్శకుడు రాజమౌళి భవిష్యత్తులో మహేష్ బాబు సినిమాతో కూడా జపాన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X