RRR అసలు కలెక్షన్స్ పై హింట్ ఇచ్చిన రాజమౌళి.. బాక్సాఫీస్ ఊచకోత!

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ RRR. ఈ మూవీ బాక్సాఫీసును షేక్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కేవలం రికార్డులను క్రియేట్ చేయడమే కాకుండా అనేక అవార్డులను కూడా సొంతం చేసుకుంది. RRR విడుదల అయినప్పటి నుండి అనేక రికార్డులను తిరగరాస్తూనే ఉంది. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ సూపర్ హిట్ గా నిలిచింది. తాజాగా జపాన్ లో సైతం 100 కోట్ల గ్రాస్ మార్కు అందుకున్న చిత్రంగా రికార్డు బద్ధలు కొట్టింది.

జపాన్ లో విడుదలైనప్పటి నుండి RRR మూవీ మంచి టాక్ తో దూసుకుపోతోంది. కలెక్షన్లు కూడా జోరుగా వస్తున్నాయి. సినిమా చూసేందుకు జపాన్ సినీ ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారంటేనే RRR మానియా అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా ఇప్పటి వరకు 1.57 బిలియన్ యెన్స్ ను అందుకుంది. అంటే సుమారు రూ.100 కోట్లు కలెక్ట్ చేసి అదే జోరును కొనసాగిస్తోంది.

RRR movie Japan latest collections and latest rajamouli latest tweet

RRR సినిమా పై జపాన్ వాసులు చూపిస్తున్న ఆదరణకు, ప్రేమకు, అందుకుంటున్న కలెక్షన్లపై డైరెక్టర్ రాజమౌళి ట్విట్టర్ వేదికగా స్పందించారు. జపనీయులు మిలియన్ కౌగిలింతలతో వర్షం కురిపించారంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. అరిగాటో గుజాయిమసూ అంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చారు. జపనీయుల ఆదరాభిమానులకు ధన్యవాదాలు అంటూ జపాన్ భాషలో ట్వీట్ చేశారు దర్శకధీరుడు.

RRR movie Japan latest collections and latest rajamouli latest tweet

స్వాతంత్ర్యం సమరయోధులు అల్లూరి సీతారామ రాజు, కొమురం భీమ్ ల కథల ఆధారంగా బ్రిటీష్ రాజ్, హైదరాబాద్ నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన కల్పిత కథగా ఆర్ఆర్ఆర్ తెరకెక్కింది. ఈ సినిమా భారతదేశ స్వాతంత్ర్యానికి పూర్వం ఇద్దరు పోరాట యోధులు వారి ప్రాంతం కోసం, జనాల కోసం, దేశం కోసం చేసిన పోరాటాల నేపథ్యంలో తెరకెక్కింది.

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, అజయ్ దేవ్ గన్, శ్రియా శరణ్ కీలక పాత్రలు పోషించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు ఈ మధ్యే ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటను ఆస్కార్ అవార్డు వరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X