RRR సినిమా కోసం వీళ్లకు దక్కిన మొత్తం రెమ్యునరేషన్ ఎంతంటే.. సగం బడ్జెట్ వాళ్లకే..
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న త్రిబుల్ ఆర్ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి సినిమా అనంతరం ఎంతో కష్టపడి తీసిన ఈ సినిమా తప్పకుండా పాన్ ఇండియా స్థాయిని మరింత పెంచుతుంది అని చెప్పవచ్చు. ఇక సినిమా కోసం వర్క్ చేసిన వారికి ఎంత రెమ్యునరేషన్ దక్కింది అనే విషయాలపై అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అయితే అందులో ప్రధానం గా నలుగురికి ఎక్కువ స్థాయిలో పారితోషికం వెళ్లినట్లు తెలుస్తోంది.

ఎక్కువ డేట్స్ ఇచ్చిన హీరోలు
RRR సినిమా కోసం స్టార్ హీరోలు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా కష్టపడ్డారు అని మేకింగ్ వీడియోలు చూస్తే అర్థమవుతుంది. దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆయన తప్పకుండా హీరోల స్థాయిని పెంచే విధంగానే సినిమాలో చేస్తూ ఉంటారు. అందుకే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా వారి కెరీర్లో ఎక్కువ సమయాన్ని ఈ సినిమా కోసం కేటాయించారు.

రాజమౌళి వాటా ఎంతంటే..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా చూసుకుంటే అత్యధిక భారీ బడ్జెట్ తో తెరపైకి వచ్చిన చిత్రం RRR అనే చెప్పాలి.. నిర్మాత డి.వి.వి.దానయ్య తో పాటు రాజమౌళి కూడా ఇందులో పార్టనర్ గా ఉన్నట్లు కథనాలు చాలానే వెలువడుతున్నాయి. అలాగే చాలామంది ప్రముఖులు కూడా ఈ సినిమాకు ఫైనాన్స్ చేసినట్లుగా తెలుస్తోంది. రాజమౌళి తనకంటూ ఒక స్థాయికి వచ్చిన తర్వాత ప్రతి సినిమాకు కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా అందుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు రాజమౌళికి 30% వరకు లాభాల్లో వాటా రానుందట.

రామ్ చరణ్ రెమ్యునరేషన్ ఎంతంటే..
ఈ సినిమాకు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఏ స్థాయిలో పారితోషికం అందుకున్నారు అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకు మెగా పవర్ స్టార్ తన జీవితం లోనే అత్యధిక పారితోషకం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా 45 కోట్ల వరకు ఇచ్చినట్లు సమాచారం. పాన్ ఇండియా సినిమా కాబట్టి హీరోల స్థాయికి తగ్గట్టుగానే నిర్మాతలు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఎన్టీఆర్ పారితోషికం ఎంతంటే..
ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే తరహాలో పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 20 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఆ సినిమా కోసం మాత్రం 45 కోట్ల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. ఒక విధంగా జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడనే చెప్పాలి. ఇక రాబోయే సినిమాలకు కూడా దాదాపు అదే తరహాలో ఛార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అలియా ఎంత తీసుకుందంటే?
ఇక రాజమౌళి తో ఎలాగైనా సినిమా చేయాలని ఆలియా భట్ కూడా ముందు నుంచే ప్రయత్నాలు చేసింది. ఫైనల్ గా ఒక రోజు ఎయిర్ పోర్ట్ లో రాజమౌళి కలిసినప్పుడు మీరు ఎప్పుడు కావాలన్న డేట్స్ ఇస్తానని చాలా ఓపెన్ గా అడిగేసి మరి RRRలో అవకాశం దక్కించుకుంది. ఆమెకు ఈ సినిమాకు గాను 9 కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్లు సమాచారం.

అజయ్ దేవ్ గన్ రెమ్యునరేషన్
అజయ్ దేవగన్ ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే ఈ సినిమాలో అతని పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది అని ఇదివరకే చిత్ర యూనిట్ సభ్యులు వివరణ ఇచ్చారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అజయ్ దేవ్ గన్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని 25 కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్లు సమాచారం.
Recommended Video

450కోట్లు ఎలా ఖర్చు చేశారంటే..
మిగతా నటీనటులకు కూడా అనుకున్న దానికంటే ఎక్కువగానే పారితోషికాలు దక్కినట్లు సమాచారం. ఒక విధంగా ఈ సినిమా బడ్జెట్ మొత్తం 450 కోట్లు వరకు ఖర్చు అయినట్లు సమాచారం. దాదాపు 200కోట్లు నటీనటుల కోసమే ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక మిగతా 250 కోట్లలో 220 కోట్లు ప్రొడక్షన్ కోసం ఖర్చు చేయగా మిగతా 30 కోట్లు ప్రమోషన్స్ ఇతర పనుల కోసం ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











