RRR: విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తో న్యూ రికార్డ్.. అక్కడ జోష్ మామూలుగా లేదు!
బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ మంచి విజయాన్ని అందుకుంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ సినిమా వీకెండ్ అనంతరం ఒక్కసారిగా డౌన్ అయినట్లు అర్ధమైపోయింది. అయితే దర్శకధీరుడు రాజమౌళి RRR సినిమా మాత్రం తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది అని మళ్ళీ టాలీవుడ్ కళకళలాడుతుంది అని చెప్పవచ్చు. అయితే సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఒక రేంజ్ లో ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్ ఒక సరికొత్త రికార్డును అందుకున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.

హాట్ కేకుల్లా..
దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన RRR సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటించడంతో నే అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని దాటేశాయి. సినిమా ఇండస్ట్రీ పాత రికార్డులను కూడా తిరగరాస్తుంది అని ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఎందుకంటే పలు దేశాల్లో ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి.

సోషల్ మీడియాలో వైరల్
RRR సినిమా కోసం నందమూరి మెగా అభిమానులు ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో ప్రస్తుతం సోషల్ మీడియా పెరుగుతున్న బజ్ చూస్తేనే అర్థమవుతుంది. సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క అంశం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. దానికితోడు ఇటీవల చిత్ర యూనిట్ సభ్యులు ఒక అద్భుతమైన పాటలు కూడా విడుదల చేశారు. ఎత్తర జెండా అనే పాట యూట్యూబ్ లో ప్రస్తుతం ట్రెండింగ్ లిస్ట్ లో చేరిపోయింది. రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే అలియా భట్ ముగ్గురు కూడా అద్భుతమైన స్టెప్పులతో అభిమానులకు మంచి కిక్కు ఇచ్చారు అనే చెప్పాలి.

యూఎస్ లో భారీ డిమాండ్
అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయా అని ఎదురు చూస్తున్న అభిమానులు అలా ఆన్లైన్ లో బుకింగ్స్ ఓపెన్ అవగానే ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. ఇక ఈ యూఎస్ లో కూడా ఈ సారి RRR ఆర్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసలైతే గత సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేస్తున్నారు అన్నప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈజీగా 1 మిలియన్ డాలర్లను అందుకోవడం విశేషం. ఇక అప్పుడు సినిమా వాయిదా పడడంతో అడ్వాన్స్ టికెట్లు బుక్ చేసుకున్న వారికి మళ్ళీ ఆ డబ్బును వెనక్కి తిరిగి ఇచ్చేశారు.
Recommended Video


ఇప్పటికే 1.5మిలియన్ల డాలర్లు
ఇక ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను మార్చి 25వ తేదీన విడుదల చేయాలని డిసైడ్ అయిన చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవల అమెరికాలో ప్రీమియర్ షోలకు ప్రత్యేకంగా బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఇక ఆన్లైన్లో రెండు రోజుల్లోనే చాలా వరకు థియేటర్స్ లో హౌస్ ఫుల్ అయ్యేలా టికెట్లు అమ్ముడవ్వడం విశేషం. ఇటీవల అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 1.5 మిలియన్ల డాలర్లకు చేరినట్లుగా తెలుస్తోంది. ఇంకా సినిమా విడుదలకు 10 రోజుల టైమ్ ఉంది. చూస్తుంటే మొదటి రోజు సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











