RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీగా ఖర్చు చేయబోతున్న రాజమౌళి.. హైలైట్స్ ఏమిటంటే?
RRR సినిమా పై అంచనాలు రోజురోజుకీ అమాంతంగా ఆకాశాన్ని దాటేస్తున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా అనంతరం తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై అంచనాలు అయితే గట్టిగానే పెంచేసుకుంటున్నారు. టీజర్ ట్రైలర్స్ కు రెస్పాన్స్ ఏ స్థాయిలో వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తప్పకుండా ఈ సినిమా మొదటి వారంలోనే ఈజీగా వెయ్యి కోట్లు బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంటుందని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు కూడా అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కూడా భారీగా ఖర్చు చేయబోతున్నట్లు సమాచారం.
Recommended Video

భారీ స్థాయిలో ఉండాలని..
దర్శక ధీరుడు రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది అని చెప్పవచ్చు. మొదటిసారి మెగా నందమూరి హీరోల కలయికలో వస్తున్న సినిమా కాబట్టి ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీ స్థాయిలో ఉండాలని అన్ని భాషల్లోనూ అట్రాక్ట్ అయ్యే విధంగా ఉండాలని రాజమౌళి టీమ్ ముందు నుంచే ప్లాన్ చేసుకుంటోంది.

పవర్ఫుల్ పాత్రలతో..
ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించగా కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే. ఇక ప్రత్యేకమైన పాత్రలో బాలీవుడ్ మాస్ హీరో అజయ్ దేవగన్ నటించాడు. అలియా భట్ సీత పాత్రలో సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. ఈ పాత్రలతోనే కాకుండా మరికొన్ని పవర్ఫుల్ పాత్రలతో దర్శకుడు రాజమౌళి అన్ని భాషల్లోనూ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నాడు.

ప్లాన్ చూసుకున్న దానయ్య, కార్తికేయ
సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను దుబాయ్ లో అంగరంగ వైభవంగా నిర్వహించాలని మొదటి నుంచి కూడా RRR టీమ్ ప్లాన్ చేసుకుంటోంది. గత నెలలోనే ఈవెంట్ ప్లాన్ కోసం నిర్మాత డివివి దానయ్య తో పాటు రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా ప్రత్యేకంగా దుబాయ్ కు వెళ్లడం జరిగింది. ఇక అక్కడ జరగాల్సిన ఏర్పాట్లకు ప్రణాళికలు రచించారు.

మొత్తం ఖర్చు ఎంతంటే?
ఇక ఈవెంట్ కోసం నిర్మాత డి.వి.వి.దానయ్య భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి వేడుక జరగలేదు అనే విధంగా ఉండాలి అని మొత్తంగా 9 కోట్ల వరకు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వేడుకలో రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ మాత్రం హైలెట్ గా ఉంటుంది అని తెలుస్తోంది. అంతేకాకుండా ప్రత్యేకమైన డాన్సులు కూడా ఈవెంట్ లో హైలెట్ గా నిల్వనున్నట్లు సమాచారం.

కీరవాణి లైవ్ మ్యూజిక్
ఎప్పటిలానే సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి లైవ్ మ్యూజిక్ తో ఆకట్టుకోబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా వేడుకకు ప్రత్యేకంగా కొంతమంది సినీ ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రాజమౌళి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ వేడుకలో పాల్గొంటారని తెలుస్తోంది. ఇక ఈ ఈవెంట్ తో సినిమాపై అంచనాలు ఇంకా ఏ స్థాయిలో పెరుగుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











