షాక్ ఇస్తున్న RRR స్పెషల్ షోల టికెట్ల రేట్లు.. రెండు గాజులు అమ్ముకోవాల్సిందే!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా దేశవ్యాప్తంగా RRR సినిమా సరికొత్త సంచలనం సృష్టించడానికి సిద్ధమయింది. మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో విడుదల అవుతున్న మొట్టమొదటి ఇండియన్ సినిమాగా RRR మొదటి రికార్డును క్రియేట్ చేయనుంది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ తో కూడా సినిమా ఎవరూ ఊహించని విధమైన కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉన్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాకు సంబందించిన స్పెషల్ షోలు విడుదల రోజు తెల్లవారుజామున ప్రదర్శించబడతాయి. ఇక ఆ షోలకు టికెట్ల రేట్లుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

అక్కడ కూడా అత్యధికంగా..
మెగా హీరో రామ్ చరణ్ తేజ్ నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన మొట్ట మొదటి బిగ్గెస్ట్ మల్టిస్టారర్ మూవీ RRR పై రోజురోజుకు అంచనాల స్థాయి ఒక్కసారిగా పెరిగిపోతోంది. ఇదివరకే ఐదు సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఫైనల్ గా మార్చి 25 వ తేదీన విడుదల కాబోతోంది. కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా అత్యధిక స్క్రీన్లలో విడుదల అవుతున్న సినిమాగా సరికొత్త రికార్డును క్రియేట్ చేయబోతోంది.

అడ్వాన్స్ బుకింగ్స్ తోనే..
మొదటి రోజు ఈ సినిమా వంద కోట్ల కలెక్షన్స్ ఈజీగా అందుకుంటుంది అని మొన్నటి వరకు ఒక టాక్ వినిపించింది. కానీ.ఇప్పుడు సినిమా హడావిడి చూస్తూ ఉంటే అది చాలా తక్కువ అని 150 కోట్లకు పైగా వసూళ్లు రావచ్చు అని కూడా బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. RRR సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సరికొత్త సంచలనం క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 3 మిలియన్ డాలర్లను అందుకోవచ్చు అని సమాచారం.

ఆ థియేటర్స్ లో స్పెషల్ షోలు
ఇక తెలంగాణలో ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేకమైన స్పెషల్ షో లను మార్చి 25వ తేదీన తెల్లవారుజామున ప్రదర్శించనున్నారు. అందుకోసం ప్రత్యేకమైన థియేటర్స్ ను కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక ఎక్కువగా ఫ్యాన్స్ షోలతో సందడి చేసే కూకట్ పల్లి థియేటర్లలో RRR సినిమా తెల్లవారుజామున మొదలు కాబోతోంది. ప్రధాన థియేటర్స్ అయిన భ్రమరాంబ, మల్లికార్జున, విశ్వనాథ్, అర్జున్ థియేటర్స్ లో స్పెషల్ షోలు తెల్లవారుజామున 12 గంటల తరువాత లేదా నాలుగు గంటలకు మొదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే బోరాబండ విజేత థియేటర్ లో, ముసాపేట్ శ్రీరాములు థియేటర్ లో కూడా స్పెషల్ షోలు పడనున్నాయి.

టికెట్ల కోసం.. ఆయన ఆఫీస్ చుట్టూ..
స్పెషల్ షో లకు సంబంధించిన టికెట్ల కోసం అభిమానులు దిల్ రాజు ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన నైజం రిలీజ్ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే స్పెషల్ షోలను మాత్రం గోపీచంద్ అనే మరొక డిస్ట్రిబ్యూటర్లు విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన సన్నిహితుల ద్వారా కూడా అభిమానులు భారీగా టికెట్లను దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఒక్క టిక్కెట్ ఎంతంటే?
అయితే ప్రస్తుతం ఈ సినిమా స్పెషల్ షోల టికెట్లకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఒక్క RRR సినిమా స్పెషల్ షో టికెట్ దాదాపు మూడు వేల నుంచి 4వేల వరకు అమ్ముడు పోతున్నట్లు సమాచారం. డిస్ట్రిబ్యూటర్లు సినిమా రేంజ్ ను బట్టి టికెట్లను అమ్మేందుకు ఆసక్తి చూపించినట్లు సమాచారం. ఇక ఈ టికెట్ల రేట్లతో రెండు గాజులు అమ్ముకోవాల్సిందే అంటూ సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











