RRR బాక్సాఫీస్ సునామీ.. 5 ఏళ్ల బాహుబలి రికార్డులు బ్రేక్.. ప్రపంచంలోనే మొట్టమొదటిగా చూసేది వాళ్లే!
ప్రపంచవ్యాప్తంగా RRR మూవీ ఫీవర్ ప్రేక్షకులను పట్టుకొన్నది. ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారతీయ ప్రేక్షకులకు ముందుకు కొద్ది గంటల్లోనే ఎస్ఎస్ రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం రానున్నది. ఈ చిత్రం విడుదలకు ముందే రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం వసూలు చేస్తున్న కలెక్షన్ల వివరాలు మీ కోసం..

దేశవ్యాప్తంగా కలెక్షన్ల అంచనా
ఏపీ, తెలంగాణలో కనివినీ ఎరుగని విధంగా రికార్డు కలెక్షన్లు నమోదయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 110 కోట్ల గ్రాస్ వసూళ్లు, ఓవర్సీస్‌లో 65 కోట్లు గ్రాస్ వసూళ్లు, ఉత్తరాది రాష్ట్రాల్లో 25, తమిళనాడులో 7 కోట్ల గ్రాస్, కర్ణాటకలో 25 కోట్ల గ్రాస్, కేరళలో 3 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసే అవకాశం ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో అడ్వాన్స్ బుకింగ్
దేశంలోని ప్రధాన నగరాల్లో RRR మూవీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ముంబైలో 60 లక్షలు, నోయిడాలో 56 లక్షలు, ఆహ్మాదాబాద్‌లో 14 లక్షలు, జైపూర్‌లో 11 లక్షలు, కోల్‌కత్తాలో 11 లక్షలు, పూణేలో 14 లక్షలు, సూరత్‌లో 13 లక్షల మేర అడ్వాన్స్ బుకింగ్ వసూళ్లు నమోదయ్యాయి. ఈ నగరాల నుంచి మొత్తంగా 2 కోట్ల మేర వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.

రికార్డుల అడ్డాగా హైదరాబాద్
ఇక హైదరాబాద్‌లో RRR మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్‌కు ప్రేక్షకులు పోటెత్తారు. ఈ చిత్రం గతంలో బాహుబలి రికార్డులను అధిగమించింది. ఇంకా రెండు రోజులు ఉండటంతో ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్లు నమోదు అవుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. బుధవారం సాయంత్రం వరకు RRR చిత్రం 10 కోట్లు అడ్వాన్సు బుకింగ్ రూపంలో రాబట్టడం రికార్డుగా మారింది.

యూఎస్‌లో బాహుబలి రికార్డు బ్రేక్
ఇక ఓవర్సీస్‌లో RRR జోరు మాటలకు అందడం లేదు. ముఖ్యంగా అమెరికాలో ఈ చిత్రం బాహుబలి రికార్డులను అధిగమించింది. ప్రీమియర్ల విషయానికి వస్తే.. బాహుబలి చిత్రం 2.4 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అయితే RRR మాత్రం ఇంకా రెండు రోజులు ముందుగానే 2.45 మిలియన్ డాలర్లను రికార్డు చేసింది. దాంతో బాహుబలికి సంబంధించిన 5 ఏళ్ల రికార్డును RRR బ్రేక్ చేసింది.
Recommended Video


ప్రపంచంలో RRR మూవీని చూసేది ఎన్టీఆర్ ఫ్యామిలీనే
ఇదిలా ఉండగా, RRR చిత్రాన్ని మొదటగా చూసే ఘనతను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ దక్కించుకొన్నది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ కోసం ఏఎంబీలో 52 రిక్లైనర్ సీట్లు ఉన్న థియేటర్‌లో గురువారం రాత్రి 9 గంటలకు ఓ షో ప్రదర్శిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా RRR కు సంబంధించిన తొలి షో ఇదే కావడం విశేషం. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రదర్శనలు లేవనే విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











