RRR బడ్జెట్ లో బాహుబలి కంటే పెద్దదే కావచ్చు.. కానీ ఆ విషయంలో మాత్రం చిన్నదే!
టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాకుండా దేశవ్యాప్తంగా అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మొట్ట మొదటి సినిమా RRRపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా దర్శకుడు రాజమౌళి ఈ బడా మల్టీస్టారర్ ను తెరపైకి తీసుకు వస్తున్నాడు. తప్పకుండా సినిమా అంచనాలకు మించి ఉంటుంది అని అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఒక విషయంలో మాత్రం బాహుబలి RRRను బీట్ చేయలేకపోతోంది. అని తెలుస్తోంది. అందుకు సంబంధించిన లెక్కలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ప్రభావం ఓపెనింగ్స్ పై కూడా గట్టిగానే చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరో లెవల్ లో ఉంటుందని..
మెగా తనయుడు రామ్ చరణ్ తేజ్ నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. తప్పకుండా సినిమా మరో లెవల్ లో ఉంటుందని కూడా అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ కూడా పూర్తయ్యాయి సినిమా ఫైనల్ కట్ కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

పక్కా ప్రణాళికలతో..
ఈ ఏడాది దసరా సమయంలో విడుదల కావాల్సిన RRR సినిమా కొన్ని కారణాల వలన వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యింది. జనవరి 7వ తేదీన ఎలాగైనా విడుదల చేయాలని దర్శకుడు రాజమౌళి పక్కా ప్రణాళికలతో సిద్ధమవుతున్నాడు. మధ్యలో వాయిదా పడే అవకాశం ఉన్నట్లు కొన్ని కథనాలు వెలువడినప్పటికి కూడా అందులో ఎలాంటి అనుమానం లేదు అని చిత్ర యూనిట్ ఇదివరకే పలుమార్లు క్లారిటీ ఇచ్చింది.

బాహుబలి కంటే తక్కువగానే..
సరిగమ సినిమాస్ , రాఫ్తార్ క్రియేషన్స్ సంయుక్తంగా యూఎస్ లో RRR సినిమాను విడుదల చేస్తున్నాయి. అయితే ఈసారి టిక్కెట్ ధరల విషయంలో కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రీమియర్‌లతో సహా అన్ని షోలకు ఒకే తరహా టిక్కెట్ ధరను కొనసాగించాలని నిర్ణయించుకున్నారట. ఒక విధంగా అవి బాహుబలి 2 రెగ్యులర్ షోల ధరల కంటే తక్కువగా ఉండేలా చూసుకున్నారు. యూఎస్ లో ఉన్న ప్రేక్షకులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. అలాగే ఎగబడి సినిమాను చూస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

యూఎస్ లో ఇలా..
జనవరి 6వ తేదీ బుధవారం నుంచి RRR యూఎస్ టిక్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. తెలుగులో పెద్దలకు 23 డాలర్లు, పిల్లలకు 18 డాలర్లు. XD, RPX లేదా ఏదైనా PLF స్క్రీన్ వంటి పెద్ద ఫార్మాట్ లో మాత్రం పెద్దలకు 27 డాలర్లు, పిల్లలకు 20 డాలర్లుగా టిక్కెట్ ధరలను కేటాయించారు. IMAX / D-బాక్స్ / డాల్బీ సినిమాస్ లో పెద్దలకు 30 డాలర్లు, పిల్లల 23 డాలర్లు.
హిందీ తమిళం మలయాళం కన్నడ భాషల్లో పెద్దలకు 16 డాలర్లు, పిల్లలు 12 డాలర్లు అని తెలుస్తోంది. మరి ఈ రేట్లతో సినిమా బాహుబలి రికార్డును బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.
Recommended Video

టార్గెట్ ఎంతంటే?
RRR USA హక్కులు రూ.41 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. అంటే బ్రేక్‌ఈవెన్ కి దాదాపు 11 మిలియన్ల డాలర్లు వసూలు చేయాలి. USAలో బాహుబలి 2 ($20 M) మాత్రమే $11 మిలియన్ కంటే ఎక్కువ వసూలు చేసింది. కరోనా తరువాత యూఎస్ లో ఇదే భారీ స్థాయిలో విడుదలవుతున్న ఇండియన్ మూవీ. ఒక విధంగా బాహుబలి 2 తర్వాత విడుదలైన సినిమాలేవీ కూడా 6 మిలియన్ల డాలర్లు వసూలు చేయలేకపోయాయి. మరి ఈ RRR ఏ స్థాయిలో వసూళ్లను అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











