Don't Miss!
- News
తీన్మార్ మల్లన్న అరెస్ట్.. జీవో రద్దు చేసేవరకు పోరాడుతాం: మల్లన్న
- Sports
IPL 2022: హర్షా భోగ్లే బెస్ట్ టీమిండియా టీ20 ఎలెవన్.. కోహ్లీ, రోహిత్‌కు నో చాన్స్!
- Finance
తెలంగాణలో యూరియా ప్లాంట్‌ను తెరిపించింది మేమే: మోడీ: రూ.8 లక్షల కోట్లు
- Automobiles
భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్
- Lifestyle
'ఈ' టీ తాగడం వల్ల మీ గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు అని మీకు తెలుసా?
- Technology
Xiaomi Pad 6 లాంచ్ వివరాలు వచ్చేసాయి ! స్పెసిఫికేషన్లు చూడండి
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
RRR 50 Days Collections: క్లోజ్ అయినట్లే.. నిర్మాతలకు వచ్చిన మొత్తం ప్రాఫిట్ ఎంతంటే?
దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన RRR సినిమా నిన్నటితో మొత్తానికి 50 రోజులు పూర్తి చేసుకుంది. ఎన్నో సార్లు వాయిదా పడిన ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ మొత్తానికి ప్రేక్షకుల ముందుకు వచ్చి సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందించింది. అంతేకాకుండా చాలా రోజుల తర్వాత ఒక బిగ్ బడ్జెట్ మూవీ థియేటర్లలో 50 రోజులు కొనసాగింది. ఇక మొత్తంగా 50 రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందించింది.. నిర్మాతలకు ఎంత లాభం వచ్చాయనే వివరాల్లోకి వెళితే..

భారీ స్థాయిలో బిజినెస్
రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ బిగ్గెస్ట్ మల్టిస్టారర్ మూవీపై మొదటి నుంచి కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. దీంతో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఊహించని స్థాయిలోనే పెరిగిపోయింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగింది.

నెంబర్ వన్ మొవీగా..
బాక్సాఫీస్ టార్గెట్ ను పూర్తి చేయడానికి ఈ ఇద్దరి హీరోలకు ఎక్కువ సమయం పట్టలేదు. రెండవ వారంలో కి వచ్చేసరికి నిర్మాత లాభాల్లోకి వచ్చేసాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యధిక లాభాలు ను సొంతం చేసుకున్న సినిమాగా కూడా RRR నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో..
50 రోజులకు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా ఈ విధంగా బాక్సాఫీస్ షేర్ ను అందుకుంది. నైజాంలో రూ. 111.79 కోట్లు, సీడెడ్ రూ. 51.40 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 35.10 కోట్లు, తూర్పు రూ. 16.35 కోట్లు, వెస్ట్ రూ.13.39 కోట్లు, గుంటూరు రూ. 18.19 కోట్లు, కృష్ణా రూ.14.69 కోట్లు, నెల్లూరు: రూ. 9.40 కోట్లు, ఏపీ తెలంగాణలో మొత్తం 50 రోజులకు రూ. 269.81 కోట్ల షేర్ రాగా రూ. 410.35 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా..
ఇక
కర్ణాటకలో
రూ.44.49
కోట్లు
సాధించిన
RRR
తమిళనాడులో
రూ.38.69
కోట్లు,
కేరళ
రూ.10.99
కోట్లు
హిందీ
రూ.133.53
కోట్లు,
రెస్ట్
ఆఫ్
ఇండియాలో
రూ.9.28
కోట్లు,
ఓవర్సీస్
లో
రూ.
102.40
కోట్లు
వచ్చాయి.
ఇక
మొత్తంగా
వరల్డ్
వైడ్
గా
50
రోజుల్లో
రూ.
608.67
కోట్ల
షేర్
వచ్చింది.
ఇక
రూ.
1134.95
కోట్లు
గ్రాస్
కలెక్షన్స్
వచ్చినట్లు
సమాచారం.

ప్రాఫిట్స్ ఎంతంటే
ఏదేమైనా కూడా త్రిబుల్ ఆర్ సినిమా బాక్సాఫీసు వద్ద పెట్టిన పెట్టుబడికి భారీస్థాయిలో కలెక్షన్స్ అయితే అందుకుంది. 500 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ రోజు బిగ్ బడ్జెట్ మూవీ నిర్మాతలకు పెట్టిన పెట్టుబడి కంటే కాస్త ఎక్కువ లాభాలను అందించినట్లు తెలుస్తోంది. ఇక 50 రోజుల తర్వాత ఈ సినిమా నిర్మాతలకు మొత్తంగా 156 కోట్లకుపైగా ప్రాబ్లమ్స్ అందించినట్లు సమాచారం.