RRR's Nizam Andhra day 1 Collections బాక్సాఫీస్ ఊచకోత.. ప్రతీ చోట్ల ఆల్‌టైమ్ రికార్డ్స్.. తొలి రోజు ఎంతంటే?
ప్రపంచవ్యాప్తంగా RRR చిత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తున్నది. ప్రీమియర్, స్పెషల్ షోలు, తొలి రోజు ప్రేక్షకుల నుంచి అనూహ్యంగా స్పందన రావడంతో బాక్సాఫీస్ వద్ద బెంచ్ మార్క్ వసూళ్లు నమోదయ్యాయి. విడుదలైన ప్రతీ చోట, ప్రతీ ప్రాంతంలో హౌస్‌ఫుల్ బోర్డులతో థియేటర్లు కళకళలాడాయి. తెలుగు రాష్ట్రాల్లో RRR చిత్రం వసూళ్లు సినిమా పరిశ్రమ వసూళ్ల విషయంలో మైలురాళ్లుగా మారాయి. ఈ క్రమంలో తొలి రోజు RRR సాధించిన వసూళ్లు ఎంతంటే..

ఆర్టీసీ క్రాస్ రోడ్డులో
తెలుగు సినిమా కలెక్షన్లకు అడ్డాగా మారిన ఆర్టీసీ క్రాస్ రోడ్డులో RRR చిత్రం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. గతంలో నమోదైన బాహుబలి 2 సినిమా కలెక్షన్లను సునాయసంగా అధిగమించి కొత్త రికార్డులను క్రియేట్ చేసింది.
బాహుబలి 2 చిత్రం తొలి రోజున 36 లక్షలు వసూలు చేస్తే.. ఇటీవల భీమ్లా నాయక్ 38 లక్షలు, పుష్ప చిత్రం 41 లక్షలు రాబట్టాయి. అయితే RRR మాత్రం గత సినిమాల కంటే రెండు రెట్లు అధికంగా అంటే.. 77 లక్షల రూపాయలను తొలి రోజే వసూలు చేయడం విశేషంగా మారింది.

రాయలసీమలో
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. రాయలసీమ ప్రాంతంలో అనంతపూర్ సిటీలో RRR చిత్రం ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. తొలి రోజు 61 షోలు ప్రదర్శించగా అన్ని హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడాయి. తొలి రోజున 85 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఇక ఆదోని పట్టణంలో 45 లక్షలు వసూలు చేసింది. గతంలో తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే ఆదోనిలో 17 లక్షల అత్యధిక వసూళ్లు నమోదయ్యాయి. కర్నూలులో గతంలో సరిలేరు నీకెవ్వరు తొలి రోజు 56 లక్షల, బాహుబలి 1 40 లక్షలు, బాహుబలి 2 35 లక్షల వసూళ్లతో అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే RRR మాత్రం 1.23 కోట్లతో కొత్త రికార్డును సాధించింది.

ఉత్తరాంధ్రలో వసూళ్లు ఇలా
ఇక ఉత్తరాంధ్రలో ఇప్పటి వరకు 7.40 కోట్ల వసూళ్లతో బాహుబలి 2 చిత్రంపై రికార్డు ఉండేది. RRR ఆ రికార్డును సునాయసంగా తొలి రోజు అధిగమించింది. ఫస్ట్ డే ఈ చిత్రం 6 కోట్ల వసూళ్లను సాధించి సరికొత్త సవాల్‌ను విసిరింది. ఇక మండపేటలో ఈ చిత్రం సుమారుగా 40 లక్షలు వసూలు చేసింది. కాకినాడలో RRR చిత్రం 61.5 కోట్లు వసూలు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 5.93 కోట్లు, గుంటూరులో 7 కోట్లు, నెల్లూరులో 3 కోట్ల వసూళ్లను రాబట్టింది.

సీడెడ్ కలెక్షన్ల పరంపర
సీడెడ్ ప్రాంతంలో RRR మూవీ రికార్డుల పరంపర కొనసాగింది. ఇప్పటి వరకు బాహుబలి పేరిట ఉన్న రికార్డును ఈ సినిమా తుడిచిపెట్టింది. తొలి రోజున ఈ చిత్రం 15 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. తూర్పు గోదావరి జిల్లాలో 6 కోట్లు, కృష్ణా జిల్లాలో 5 కోట్ల వసూళ్లను సాధించినట్టు వార్తలు వస్తున్నాయి.

నైజాంలో ఆల్ టైమ్ రికార్డు
ఇక నైజాంలో RRR సినిమా బాక్సాఫీస్‌ను ఊచకోత కోసింది. తొలిరోజున 23.25 కోట్లు వసూలుచేసింది. ఇప్పటి వరకు నైజాంలో భీమ్లా నాయక్ 11.85 కోట్లు, పుష్ప చిత్రం 11.44 కోట్లు, రాధేశ్యామ్ 10.80 కోట్లు, సాహో 9.41 కోట్లు, బాహుబలి 8.9 కోట్లు, వకీల్ సాబ్ చిత్రం 8.75 కోట్లు రాబట్టింది. ఈ రికార్డులను ఒకే దెబ్బతో తుడిచిపెట్టి నైజాంలో ఆల్ టైమ్ రికార్డులు నమోదయ్యాయి.
Recommended Video


తెలుగు రాష్ట్రాల్లో స్వైర విహారం
ఇక RRR రిలీజ్‌కు ఊహించినట్టుగానే అంతా జరిగిపోయింది. ఈ చిత్రం వసూళ్ల విషయంలో స్వైర విహారం చేసింది. తొలి రోజున ఏకంగా 70 కోట్ల షేర్ సాధించింది. నైజాంలో ఇదే ఆల్‌టైమ్ రికార్డు అని ట్రేడ్ వర్గాలు చెప్పుకొంటున్నాయి. ఇంకా అధికారికంగా పలు జిల్లాల నుంచి వసూళ్ల వివరాలు అందాల్సి ఉంది. బాక్సాఫీస్ రిపోర్టుల కోసం ఫిల్మీబీట్ తెలుగును ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











