RRR Collections : సీడెడ్, నైజాంలో మరిన్ని రికార్డులు బద్దలు.. హయ్యెస్ట్ షేర్ మూవీగా కొత్త రికార్డు!

బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయి భారీ ఎత్తున చాటి చెప్పారు రాజమౌళి. ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కి ఇటీవలే విడుదలైన పాన్ ఇండియా మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాలో టాలీవుడ్‌లోనే టాప్ స్టార్లుగా వెలుగొందుతోన్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి మల్టీస్టారర్ జోనర్‌లో చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రారంభించిన నాటి నుంచి సినిమా స్థాయి పెరుగుతూ వచ్చింది. అందుకు అనుగుణంగానే రెస్పాన్స్ కూడా దక్కుతుంది. ఈ నేపథ్యంలో RRR 12 రోజుల్లో నైజాం, సీడెడ్ ప్రాంతాల్లో కలెక్షన్స్ తో రికార్డులు బద్దలు కొట్టింది. ఆ వివరాలు

భారీ బడ్జెట్‌తో

భారీ బడ్జెట్‌తో

అసలు చరిత్రలో కలవని స్వతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీంలు కనుక కలిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ సినిమా రూపొందించారు దర్శకధీరుడు రాజమౌళి. జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించగా ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు.

451 కోట్ల మేర బిజినెస్

451 కోట్ల మేర బిజినెస్

భారీ బడ్జెట్‌తో రూపొందిన RRR మూవీపై ఎన్నో అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 191 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లో కూడా భారీ రేటు పలికింది. ఇలా అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్ల మేర బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల టాక్.

 మరపు రాని రికార్డు

మరపు రాని రికార్డు

అయితే ఆ సంగతి అలా ఉంచితే ఈ సినిమా ఇప్పటికే నైజాం ప్రాంతంలో అనేక రికార్డులు బద్దలు కొత్తగా ఇప్పుడు మరిన్ని రికార్డుల దిశగా దూసుకుపోతోంది. ఒకే ప్రాంతం నుండి మొదటి 100 కోట్ల షేర్ అది కూడా కేవలం 12 రోజుల్లోనే కొల్లగొట్టిన సినిమాగా RRR నిలవనుంది. ఎప్పటిలాగే ఈ సినిమా కొనుకున్న దిల్ రాజు కూడా నైజాం సినీ చరిత్రలో మరో మరపు రాని రికార్డు సృష్టించారు.

డే వైజ్ కలెక్షన్స్

డే వైజ్ కలెక్షన్స్


RRR సినిమా నైజాం డే వైజ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. డే1-23.35 కోట్లు, డే2-15.10 కోట్లు, డే3-15.05 కోట్లు, రోజు4-8.15 కోట్లు, డే5-6.70 కోట్లు, డే6-4.80 కోట్లు, డే7-4.07 కోట్లు, డే 8-4.31కోట్లు, డే9-8.57కోట్లు, డే 10-6.96 కోట్లు, డే 11-2.18 కోట్లు, డే 12-2.12 కోట్లు కలెక్షన్స్ సాధించి మొత్తం నైజాంలో 101.36 కోట్లు కలెక్షన్స్ సాధించింది

40 కోట్ల షేర్‌

40 కోట్ల షేర్‌

ఈ సినిమా నైజాంలో మొదటి వంద కోట్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇక మరో పక్క RRR సీడెడ్ లో కూడా రికార్డు బద్దలు కొట్టింది. GST మినహా 40 కోట్ల మార్కెట్‌ షేర్ ను దాటింది. 40 కోట్ల షేర్‌ను క్రాస్ చేసిన మొదటి సినిమాగా ఈ సినిమా రికార్డులకు ఎక్కింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X