For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR రికార్డు ప్రీ రిలీజ్ బిజినెస్: ఓటీటీ హక్కులు డిస్నీహాట్‌స్టార్‌‌ సొంతం..శాటిలైట్ రైట్స్ ఎంతంటే!

  |

  బాహుబలి సంచలన విజయం తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం RRR. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముందస్తు ప్లాన్ ప్రకారం అంత్య సవ్యంగా సాగిపోయి ఉంటే RRR చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. లాక్‌డౌన్ కారణంగా ఈ చిత్ర షూటింగ్, రిలీజ్ పలుమార్లు వాయిదా పడింది. వచ్చే ఏడాది వేసవికి సిద్ధమవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా రికార్డు స్థాయిలో ఎంత బిజినెస్ చేసిందంటే..

  RRR ఫస్ట్‌లుక్స్‌తో భారీ అంచనాలు

  RRR ఫస్ట్‌లుక్స్‌తో భారీ అంచనాలు

  ఇక రాజమౌళి బర్త్ డే రోజున రిలీజ్ చేసిన RRR ఫస్ట్ లుక్, రాంచరణ్ జన్మదినం రోజున ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేసిన రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర ఫస్ట్‌లుక్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. ఈ రెండు ఫస్ట్‌లుక్స్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచింది.

  దసరా కానుకగా కొమురం భీమ్ లుక్

  దసరా కానుకగా కొమురం భీమ్ లుక్

  ఇక దసరా కానుకగా ఎన్టీఆర్ నటిస్తున్న కొమురం భీమ్ పాత్రకు సంబంధించిన లుక్‌ను దర్శకుడు రాజమౌళి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. గతంలో ఎన్టీఆర్ బర్త్ డే రోజున లుక్‌ను రిలీజ్ చేయాలనుకొన్నారు. కానీ కరోనావైరస్ పరిస్థితుల కారణంగా సాధ్యపడలేదు. ఇక దసరాను ఎన్టీఆర్ అభిమానులకు నిజమైన పండుగ చేసేందుక రెడీ అవుతున్నారు,

  మళ్లీ మొదలైన RRR షూటింగ్

  మళ్లీ మొదలైన RRR షూటింగ్

  లాక్‌డౌన్ తర్వాత RRR షూటింగ్‌ను జక్కన మొదలుపెట్టారు. ఇటీవల తన సినిమా షూటింగ్ ప్రారంభమైందంటూ ఓ మోషన్ వీడియోను రిలీజ్ చేశారు. RRR సినిమా షూటింగ్ మొదలు కావడం ఇండస్ట్రీకి మంచి బూస్టింగ్‌ను ఇచ్చింది. మిగితా సినిమా షూటింగులు కూడా RRR స్పూర్తితో సెట్స్‌పైకి వెళ్లాయి.

  200 కోట్లకు ఓటీటీ, డిజిటల్ రైట్స్

  200 కోట్లకు ఓటీటీ, డిజిటల్ రైట్స్

  RRRకు సంబంధించి ఇలాంటి వార్తల నేపథ్యంలో మరో క్రేజీ వార్త అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. ఈ చిత్రం శాటిలైట్, డిజిటల్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగిందనే వార్త ఇప్పుడు మీడియాలో హల్‌చల్ రేపుతున్నది. శాటిలైట్, డిజిటిల్ బిజినెస్ రూ.200 కోట్ల మేర క్లోజ్ అయిందనే వార్త విస్తృతంగా ప్రచారం అవుతున్నది.

  డిస్నీ+హాట్‌స్టార్‌కు ఓటీటీ హక్కులు

  డిస్నీ+హాట్‌స్టార్‌కు ఓటీటీ హక్కులు


  RRR సినిమాకు సంబంధించిన డిజిటల్, ఓటీటీ హక్కులను డిస్నీ+హాట్‌స్టార్ సొంతం చేసుకొన్నదనే విషయం బయటకు వచ్చింది. అయితే భారీ మొత్తానికి ఈ హక్కులను డిస్నీ చేజిక్కించుకోవడం విశేషంగా మారింది. ఇక ఈ చిత్రం ఓటీటీ ద్వారా నేరుగా రిలీజ్ కాదు అనేది గమనార్హం. థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

  స్టార్ మాకు శాటిలైట్ హక్కులు

  స్టార్ మాకు శాటిలైట్ హక్కులు

  ఇక RRR సినిమాకు సంబంధించిన శాటిలైట్ హక్కులను భారీ ధరకు ప్రముఖ టెలివిజన్ ఛానెల్ స్టార్ మా దక్కించుకొన్నట్టు సమాచారం. అయితే ఫ్యాన్సీ రేటును టెలివిజన్ నిర్వాహకులు చెల్లించినట్టు తెలుస్తున్నది. అయితే వ్యక్తిగతం ఎంత ధరకు అమ్ముడు పోయాయనే విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు.

  #HBDSSRajamouli : Jr NTR to Ajay Devgn, Wishes Pour in on Twitter | Waiting For RRR
  అలియా భట్, ఓలియా మోరిస్

  అలియా భట్, ఓలియా మోరిస్

  RRR సినిమాలో బాలీవుడ్ తారలు అలియా భట్, అజయ్ దేవగన్ నటిస్తున్నారు. శ్రీయా సరన్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. ఇక హాలీవుడ్ నటి ఓలివియా మోరిస్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆలియా భట్ నవంబర్‌లో షూటింగుకు హాజరుకానున్నారు.

  English summary
  RRR pre release business for OTT, and Satellite closes at Record price. As per Reports, These two business mints Rs. 200 crores. The period drama will also feature a big star cast including Alia Bhatt, Olivia Morris, Ajay Devgn and Shriya Saran in important roles.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X