RRR Pre Release Business: మరోసారి రేటు తగ్గించిన RRR టీమ్.. వంద కోట్ల బిజినెస్ ఒక్కసారిగా డౌన్
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మెగా నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న RRR సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. గత ఏడాది విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి దసరా సమయంలో అయినా వెండి తెరపై కనిపిస్తుంది అని అనుకుంటే ఆంధ్రప్రదేశ్లోని టిక్కెట్ల ధరల కారణంగా మళ్ళీ వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యింది. ఇక మొత్తానికి 2022 జనవరి 7న త్రిబుల్ ఆర్ సినిమా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే చాలావరకు సినిమా బిజినెస్ తగ్గినట్లు తెలుస్తుంది. ఇటీవల ఒక ఏరియాలో మొన్నటి వరకు 100 కోట్లు పలికిన ధర ఒక్కసారిగా మళ్లీ తగ్గినట్లు సమాచారం.

ప్రాణం పెట్టిన హీరోలు
RRR సినిమా కోసం కేవలం నందమూరి మెగా అభిమానులు మాత్రమే కాకుండా చాలా మంది సినీ ప్రముఖులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపిస్తుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో అలరించబోతున్నాడు. ఇద్దరూ కూడా ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి నటించారు అని చెప్పవచ్చు. ఇప్పటికే విడుదలైన టీజర్ పోస్టర్స్ అలాగే పాటలు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.

రాజమౌళి పెట్టుబడి..
RRR సినిమా విషయంలో దర్శకుడు రాజమౌళి చాలా నమ్మకంతో ఉన్నాడు. ఇక ఈ సినిమా బిజినెస్ విషయంలో కూడా నిర్మాత డివివి దానయ్య తో పాటు రాజమౌళి కూడా ప్రత్యేకంగా సలహాలు ఇస్తున్నాడు. ఎందుకంటే రాజమౌళి కూడా ఈ సినిమాపై కొంత పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన అనంతరం వాటాలు పంచుకునే విధంగా ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు సమాచారం.

బిజినెస్ లో మళ్ళీ మార్పులు
అయితే RRR ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో మళ్లీ మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పది వేలకు పైగా స్క్రీన్లలో విడుదల కాబోతోంది. ఇంతవరకు ఏ ఇండియన్ సినిమా విడుదల కాని విధంగా ఈ మల్టీస్టారర్ వెండితెరపైకి రాబోతోంది. అయితే కోస్తా ఆంధ్రాలో మొన్నటి వరకు 107 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో విడుదల కాబోతున్నట్లు ప్రచారాలు కొనసాగాయి. నిజానికి ఈ చిత్ర యూనిట్ కూడా అదే తరహాలో డీల్ సెట్ చేసుకుంది.
Recommended Video

రేటు తగ్గించిన RRR
అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆంధ్రప్రదేశ్లో సినిమాలు భారీ స్థాయిలో వసూళ్లను అందుకోవడం చాలా కష్టమనే చెప్పాలి. ఏదేమైనా మొదటివారంలోనే సినిమా పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకు వస్తుందని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి దర్శకుడు రాజమౌళి అలాగే నిర్మాత డివివి దానయ్య కొన్ని ఏరియాల్లో రేట్లను తగ్గించినట్లు సమాచారం. కోస్తా ఆంధ్రాలో టోటల్ గా 107 కోట్ల ధర పలికిన RRR సినిమాను 80 కోట్లకు సెట్ చేసినట్లు సమాచారం. మరి ఈ టార్గెట్ ను రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని రోజుల్లో అందుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











