RRR ప్రీ రిలీజ్ బిజినెస్.. రాజమౌళికి భారీ ఆఫర్.. బాహుబలి2 చరిత్రను తిరగరాసేలా..

బాహుబలి2 సినిమా తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం RRR. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీ రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తున్నది. తాజాగా RRR మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ దక్షిణాది చిత్రసీమలో చర్చనీయాంశమైంది. ఈ సినిమా కోసం ప్రముఖ డిస్టిబ్యూటర్ ఇచ్చిన ఆఫర్ ఎంతంటే..

RRR రిలీజ్ డేట్ ఫిక్స్

RRR రిలీజ్ డేట్ ఫిక్స్

RRR మూవీ రిలీజ్ విషయానికి వస్తే.. అంతా సవ్యంగా సాగితే గతేడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. అయితే కోవిడ్ పరిస్థితులు, షూటింగులో జాప్యం చోటుచేసుకోవడంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. చివరకు 2022 జనవరి 8వ తేదీని విడుదలకు ముహుర్తంగా నిర్ణయించారు.

అందాల భామ ఆహానా కృష్ణ బ్యూటిఫుల్ గ్యాలరీ

దేశవ్యాప్తంగా భారీగా బిజినెస్ ఆఫర్లు

దేశవ్యాప్తంగా భారీగా బిజినెస్ ఆఫర్లు

అయితే RRR మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ దేశవ్యాప్తంగా ఓ చర్చనీయాశమవుతున్నది. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సంస్థ ఈ సినిమా కోసం భారీగా చెల్లించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అయితే రాజమౌళి, ఆ సంస్థకు మధ్య చర్చలు కొనసాగుతుండటంతో ఏ రేంజ్ బిజినెస్ కానున్నదనిది స్పస్పెన్స్‌గా మారింది.

దక్షిణాదిలో రికార్డు స్థాయిలో

దక్షిణాదిలో రికార్డు స్థాయిలో

ఇక ఇటీవల RRR మూవీ యూనిట్ దక్షిణాది సినిమా పరిశ్రమకు చెందిన డిస్టిబ్యూటర్లు నుంచి భారీ ఆఫర్‌ను అందుకొన్నట్టు సమాచారం. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం సుమారు 350 కోట్ల మేర ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఈ మొత్తం దక్షిణాదిలో ఓ రికార్డుగా చెప్పుకొంటున్నారు. ఇంత వరకు ఏ సినిమాకు ఇంత మొత్తంలో ఆఫర్ వచ్చిన దాఖలాలు లేవనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు ప్రస్తావిస్తున్నారు.

ఏపీ, తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో బిజినెస్

ఏపీ, తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో బిజినెస్

తాజా వివరాల ప్రకారం.. ఆంధ్ర, సీడెడ్‌కు సంబంధించిన థియేట్రికల్ హక్కుల కోసం రూ.165 కోట్లు, నైజాంకు సంబంధించి రూ.75 కోట్ల మేర ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది. ఇక తమిళనాడు థియేట్రికల్ హక్కుల కోసం రూ.50 కోట్లు, కర్ణాటక డిస్టిబ్యూటర్ల నుంచి రూ.45 కోట్లు, కేరళ నుంచి రూ.15 కోట్ల మేర ఆఫర్ వచ్చినట్టు సమాచారం.

బాహుబలి2 రికార్డును మించి

బాహుబలి2 రికార్డును మించి

ఇక రాజమౌళి రూపొందించిన బాహుబలి2 సినిమా థియేట్రికల్ హక్కుల విషయానికి వస్తే రూ.220 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ప్రస్తుతం ఆ మొత్తాన్ని మించిన ఆఫర్ రావడంతో దక్షిణాదిలో రికార్డుగా చెప్పుకొంటున్నారు. ఒకవేళ ఈ మొత్తానికి బిజినెస్ సెట్ అయితే దక్షిణాదిలో RRR చరిత్రను తిరగరాసినట్టే అనే టాక్ వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X